
చెన్నై సినిమా: రాజకీయ నేపథ్యంలో మరో థ్రిల్లర్ రూపొందుతోంది. నటులు ప్రాజన్, అజిత్ నాయక్ హీరోలుగా నటిస్తున్న ఇందులో నటి ప్రఖ్యా నయన్, రష్మీ నాయికలుగా నటించనున్నారు. శ్రీకృష్ణ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. సూర్యకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్, కెన్నడీ ద్వయం కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం ఆదివారం ధర్మపురిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సినిమాకు వినోద్‌కుమార్ ఛాయాగ్రహణం, విజయ్ యాట్లీ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. దుర్మార్గులైన రాజకీయ నాయకుల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కొత్తకోణంలో చూపించబోతున్నట్లు చెప్పారు. షూటింగ్ ధర్మపురి, కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment