ఇలాంటి సినిమాలు తక్కువ వస్తాయి! | this type of films comes rarely | Sakshi
Sakshi News home page

ఇలాంటి సినిమాలు తక్కువ వస్తాయి!

Published Sat, Nov 8 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

ఇలాంటి సినిమాలు తక్కువ వస్తాయి!

ఇలాంటి సినిమాలు తక్కువ వస్తాయి!

‘‘ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. నాకు ఈ తరహా స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌తో తక్కువ సినిమాలు వస్తాయి. విభిన్న అంశాలను మేళవించి తీసిన చిత్రం ఇది. చేస్తున్నప్పుడే చాలా థ్రిల్ అయ్యాను. రషెస్ చూసి, చాలా సంతృప్తిపడ్డాను’’ అని నవదీప్ అన్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ దర్శకుడు చందు మొండేటి ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు.

అనంతరం కార్తీక్ వర్మ మాట్లాడుతూ -‘‘చందు దర్శకత్వంలో వహించిన ‘కార్తికేయ’కు స్క్రీన్‌ప్లే ఇచ్చాను. ఆ సినిమా ముగింపు దశలో ఉన్నప్పుడు రాజేష్‌గారికి ఈ కథ చెప్పాను. ఇదొక క్రైమ్, కామెడీ థ్రిల్లర్. కథను నమ్మి ఆయన ఈ అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ సినిమా చేశాను’’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ- ‘‘కార్తీక్ వర్మ ఏదైతే చెప్పాడో దాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఒక కొత్త కథతో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరుకి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఓ మంచి స్క్రిప్ట్‌తో చేసిన చిత్రమిదని నవీన్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్ వర్మ దండు, సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె. ధరన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement