మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్, క్రేజీ ప్రాజెక్ట్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. స్వామి రారా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుధీర్, కేశవతో మరో విజయాన్నిఅందుకున్నాడు. ఇప్పుడు అదే జోరు శర్వానంద్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో శర్వాకు జోడిగా ఇద్దరు టాలెంటెడ్ బ్యూటీస్ ను ఫైనల్ చేశారు.
వరుసగా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ సత్తా చాటుతున్న మలయాళీ బ్యూటీ నివేదా థామస్‌తో పాటు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన షాలినీ పాండే మరో హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌తో కాకుండా మరో దర్శకుడితో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇదే కావటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment