
నాని, అదితీరావ్ హైదరీ, నివేదా థామస్, సుధీర్‌బాబు
‘సమ్మోహనం’ సక్సెస్ తర్వాత దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్‌బాబు, నానిలతో ఈ మల్టీస్టారర్ రూపొందనుంది. ఇందులో నాని పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం. నాని సరసన అదితీరావ్ హైదరీ, సుధీర్‌కి జోడీగా నివేదా థామస్ నటించనున్నారట.
ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ నలుగురిలో ఎవరు వ్యూహం పన్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్, అదితీలను, ‘జెంటిల్‌మేన్’ తర్వాత నాని, నివేదా థామస్‌లను ఇంద్రగంటి రిపీట్ చేస్తున్నారు. జులైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment