![Vishwadev Talk About 35: Chinna Katha Kaadu Movie](/styles/webp/s3/article_images/2024/09/7/vishwade-hero.jpg.webp?itok=BWI9RHtD)
‘‘35–చిన్న కథ కాదు’ సినిమా కథ విన్నప్పుడే అందులోని ప్రసాద్ పాత్ర చేయాలనుకున్నాను. సినిమా విడుదల తర్వాత నా పాత్రకి వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని విశ్వదేవ్ అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా విశ్వదేవ్ మాట్లాడుతూ– ‘‘విమర్శకులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో మా సినిమాని ప్రశంసించడంతో పాటు డిస్టింక్షన్ మార్కులు వేయడం సంతోషంగా ఉంది. నంద కిశోర్ సినిమాని చక్కగా తీశాడు. నా కెరీర్‌లో అన్ని విషయాల్లో సంతృప్తి ఇచ్చిన చిత్రం ఇది. పెద్దలు, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన అందమైన సినిమా ఇది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment