ఒక సినిమాకు ఇన్ని స్టార్స్‌ ఇవ్వడం నేనేప్పుడు చూడలేదు: రానా | Rana And Nivetha Thomas Interesting Comments About 35 Chinna Katha Kaadu Movie Success Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

ఒక సినిమాకు ఇన్ని స్టార్స్‌ ఇవ్వడం నేనేప్పుడు చూడలేదు: రానా

Published Sun, Sep 8 2024 6:07 PM | Last Updated on Mon, Sep 9 2024 12:05 PM

Rana, Nivetha Thomas Talk About  35 Chinna Katha Kaadu At Success Meet

ఒక మంచి సినిమా వస్తే..దాన్ని మీడియా ఎంత బాగా ప్రమోట్‌ చేస్తుందో ‘35-చిన్న కథ కాదు’చిత్రం ద్వారా తెలిసింది. ఈ సినిమాకి మీరు(మీడియా) ఇచ్చినన్ని స్టార్స్‌ నేను ఎప్పుడూ చూడలేదు .చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రానా. 

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్,  హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది. 

(చదవండి: 35: చిన్న కథ కాదు మూవీ రివ్యూ)

ఈ సందర్భంగా మూవీ టీం థాంక్స్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్‌ మీట్‌లో రానా మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు' సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్ గా ఉంది. సురేష్ ప్రొడక్షన్ పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటాం' అన్నారు

నివేదా థామస్‌ మాట్లాడుతూ..  కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్.  ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైయింది. మేము పర్శనల్ గా వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెబుతాం. అందరికీ థాంక్ యూ' అన్నారు

‘ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి '35-చిన్న కథ కాదు' తో ప్రూవ్ అయ్యింది. థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా ఉంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో విశ్వదేవ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నంద కిశోర్‌, నిర్మాతలు సిద్ధార్థ్ రాళ్లపల్లి ,సృజన్ యరబోలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement