
సాక్షి, న్యూఢిల్లీ : పిన్నవయస్సులోనే కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ గిరిజన యువకుడు మాస్టర్ ఆంగోత్ తుకారాంను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. కిలిమాంజారో పర్వతంపై జాతీయ గీతాలాపనతో 18 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ హెల్మెట్ వాడకంపై తుకారాం సందేశాన్నిచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర తేజావత్ ఆధ్వర్యంలో తుకారాం రాష్ట్రపతిని బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తుకారాం ధైర్య సాహసాలను, సామాజిక స్పృహను కోవింద్ ప్రశంసించారు. సౌత్ కౌల్ రూట్ నుంచి ఎవరెస్టును ఎక్కబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్ర తేజావత్‌లు తుకారాంను ఘనంగా సన్మానించారు.
ఆగస్టు 5న ఐఐటీహెచ్‌కి రాష్ట్రపతి రాక
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నా«థ్ కోవింద్ రానున్నారు. ఆగస్టు 5న ఐఐటీలో జరిగే స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment