
లక్డీకాపూల్: నగరం నుంచి కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతి పిన్న వయసు్కలలో ఒకరిగా ప్రీతం గోలీ చరిత్ర సృష్టించాడు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న 16 ఏళ్ల ఎన్‌సీసీ క్యాడెట్ సాహస యాత్ర చేపట్టారు. 8 రోజుల ఈ యాత్రలో శిఖరాన్ని గత నెల 17న చేరుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుడు సత్య రూమ్ సిద్ధాంత మార్గదర్శకంలో నలుగురు బృందంతో కూడిన ప్రీతం గత నెల 12న యాత్ర చేపట్టాడు. మరింత ఎతైన శిఖరాలను అధిరోహించాలన్నదే తన తపన అని ప్రీతం అన్నారు. ‘కిలిమంజారో నిటారుగా, కంకర, ఇసుకలతో కూడిన జారే నేల కావడంతో కష్టమనిపించింది. శిఖరాగ్రం చేరుకున్న తర్వాత గర్వంగా భారత జాతీయ జెండా, ఎన్‌సీసీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జెండాను ఎగరవేశా’అని అన్నారు.