Pritam
-
Hyderabad: కిలిమంజారో పర్వతం.. అధిరోహించిన ప్రీతం!
లక్డీకాపూల్: నగరం నుంచి కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతి పిన్న వయసు్కలలో ఒకరిగా ప్రీతం గోలీ చరిత్ర సృష్టించాడు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 16 ఏళ్ల ఎన్సీసీ క్యాడెట్ సాహస యాత్ర చేపట్టారు. 8 రోజుల ఈ యాత్రలో శిఖరాన్ని గత నెల 17న చేరుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుడు సత్య రూమ్ సిద్ధాంత మార్గదర్శకంలో నలుగురు బృందంతో కూడిన ప్రీతం గత నెల 12న యాత్ర చేపట్టాడు. మరింత ఎతైన శిఖరాలను అధిరోహించాలన్నదే తన తపన అని ప్రీతం అన్నారు. ‘కిలిమంజారో నిటారుగా, కంకర, ఇసుకలతో కూడిన జారే నేల కావడంతో కష్టమనిపించింది. శిఖరాగ్రం చేరుకున్న తర్వాత గర్వంగా భారత జాతీయ జెండా, ఎన్సీసీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జెండాను ఎగరవేశా’అని అన్నారు. -
30 అడుగుల అభిమానం
‘జవాన్’తో మరో పెద్ద విజయాన్ని అందుకున్నాడు షారుక్‌ఖాన్. అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కోల్‌కత్తాకు చెందిన షారుక్‌ఖాన్ అభిమాని, చిత్రకారుడు ప్రీతమ్ బెనర్జీ మార్బుల్ స్టోన్ చిప్స్, పెయింట్ బ్రష్‌ను ఉపయోగిస్తూ 30 అడుగుల షారుక్ పోట్రాయిన్ రూపొందించాడు. ఈ స్టన్నింగ్ పోర్ట్రయిట్ డ్రోన్ షాట్ అదిరిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజనులు ‘వావ్’ అంటున్నారు. ‘ట్రిబ్యూట్ టూ ది కింగ్‌ఖాన్. ఇది నా హృదయంలో నుంచి వచ్చిన కళారూపం. నా అభిమాన హీరో దీన్ని త్వరలోనే చూడాలనుకుంటున్నాను’ అంటూ రాశాడు బెనర్జీ. -
Pritam Bull:కోటి రూపాయల ఎద్దును కాపాడారోచ్!
నోయిడా: యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు అరిగోస పడుతున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్) సైతం రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. నోయిడా తీరం వెంట ఎనిమిది గ్రామాలకు చెందిన ఐదు వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించింది ఎన్డీఆర్ఎఫ్. అలాగే.. గురువారం నుంచి ఇప్పటిదాకా పశువులు, కుక్కలు, కుందేళ్లు, గినియా పందులు.. ఇలా 6వేల దాకా మూగజీవాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారట. ఈ రెస్క్యూలో దేశంలోకెల్లా నెంబర్ వన్ ఎద్దును సైతం కాపాడరంట. ఈ విషయాన్ని స్వయంగా 8వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించింది. ప్రీతమ్ అనే గిర్ జాతి ఎద్దును నోయిడా కమలా నగర్లో వరద నుంచి రక్షించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. దీని ధర కోటి రూపాయలకు పైగా పలుకుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని వయసు ఏడేళ్లు?!. నడిచే బంగారంగా గిర్ పశువులకు దేశంలోనే ఓ పేరుంది. పాలకే కాదు.. ఎద్దులకూ మాంచి గిరాకీ. ఇక ప్రీతమ్ వంశ వృక్షంలో ముందుతరాల పశువులకూ అడ్డగోలు రేటు దక్కింది. దేశంలో ఇలాంటి కాస్ట్లీ పశువులు ఉన్నా.. ప్రీతమ్ మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 2019లో తొలిసారి ది నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. సంకరణంతో పాటు దీని వీర్యాన్ని కూడా ప్రత్యేకంగా అమ్ముతుంటారు. అయితే ఇది కూడా కాస్ట్లీ వ్యవహారమే!. భారత్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు ధర.. గరిష్టంగా 98లక్షల రూపాయలుగా ఉండడం గమనార్హం. అంటే ప్రీతమ్గాడి వెల అంతకన్నా ఎక్కువేనన్న మాట!!. #आपदासेवासदैवसर्वत्र Team @8NdrfGhaziabad has rescued 3 cattles including India's No.1 Bull "PRITAM" costing 1 Cr. from Noida. NDRF teams are working hard to save lives in flood affected areas.#animalrescue @ndmaindia @NDRFHQ @noida_authority @HMOIndia @PIBHomeAffairs pic.twitter.com/MdMRikYFVz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 #आपदासेवासदैवसर्वत्र#animalrescue Team @8NdrfGhaziabad conducting flood rescue and evacuation.This is our country's philosophy:-No one should be left behind in times of need.NdRF rescue people as well as animals at Noida@noida_authority@HMOIndia@NDRFHQ@ndmaindia@ANI pic.twitter.com/e7j8sTEixz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 -
ఆధ్యాత్మికం ఉట్టిపడేలా 'దేవ దేవ' పాట విడుదల
Deva Deva Song Out From Brahmastra Movie: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'కుంకుమల' వీడియో సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా 'దేవ దేవ' అనే మరో పాటను విడుదల చేశారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాట ఆధ్యాత్మికతతో ఉల్లాసభరితంగా సాగింది. ఈ పాట గురించి 'నేను ఈ సాంగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. ఈ పాటతో ఆధ్యాత్మికంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతి పొందుతారని నేను ఆశిస్తున్నాను' అని రణ్‌బీర్ కపూర్ తెలిపాడు. 'ఈ పాటను విడుదల చేసేందుకు శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను' అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలికించేవి: ప్రధాని మోదీ
PM Narendra Modi Akshay Kumar Condolence On Singer KK Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 Extremely sad and shocked to know of the sad demise of KK. What a loss! Om Shanti 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) May 31, 2022 Heartbreaking news on the sudden passing away of such an incredible talent…. RIP KK…💔 the entertainment world has lost a true artist today….Om Shanti 🙏 pic.twitter.com/SiKQutPJVO — Karan Johar (@karanjohar) May 31, 2022 In utter shock. Just heard about KK . Someone please tell me it's not true — Pritam (@ipritamofficial) May 31, 2022 Black year for Indian music. Lata didi, bappi da, sidhu paaji and now KK sir. These losses.. all of them feel so personal. — ARMAAN MALIK (@ArmaanMalik22) May 31, 2022 One and only . KK 😔 . — Jubin Nautiyal (@JubinNautiyal) May 31, 2022 My deepest sincerest condolences. His golden, soulful voice echoes in all our hearts. Rest in peace dear #KK🙏🏻💔 — Shreya Ghoshal (@shreyaghoshal) May 31, 2022 Singer KK never smoked or drank! Led the most simple non controversial non media hyped life. Complete family man. Jab bhi mujhe mile he met with so much of love & kindness. God! Too unfair! OM SHANTI. — RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 31, 2022 -
భార్యాపిల్లలను హతమార్చి...
కోలారు:వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని బలిగొంది. వృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు... తాలూకాలోని కామధేనుహళ్లికి చెందిన గంగప్ప(30), దీప(24) దంపతులు. వీరికి నేహ(5), ప్రీతమ్(2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైన్యంలో పనిచేస్తున్న గంగప్ప, తన భార్యపిల్లలను గ్రామంలోనే వదిలి వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీప తన పక్కింటిలో ఉన్న కాలేజీ విద్యార్థితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ పెద్దలు ఆమెను కొన్ని రోజుల పాటు పుట్టినింటికి(బంగారు పేట తాలూకా కీలు కొప్ప) పంపారు. మూడు రోజుల క్రితం సెలవుపై గంగప్ప వచ్చాడు. బంగారుపేటకు వెళ్లి భార్యాపిల్లలను పిలుచుకుని వచ్చాడు. తన భార్య వివాహేతర సంబంధం తెలుసుకున్న అతను శనివారం రాత్రి భార్యాపిల్లల గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రెండు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ అజయ్ హిలోరి తెలిపారు. -
ముండే కుమార్తెల ఘన విజయం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఉప ఎన్నికలో దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తెలు పంకజ, ప్రీతమ్‌లు విజయం సాధించారు. పంకజా పర్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిపై 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా ప్రీతమ్ తన తండ్రి మరణంతో ఖాళీ అయిన బీడ్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ చరిత్రలోకెల్లా రికార్డు విజయం సాధించారు. 6,96,321 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఆమెకు 9,22,416 ఓట్టొచ్చాయి. ఇప్పటి వరకూ ఈ రికార్డు బెంగాల్ నుంచి 2004లో 5,92,502 ఓట్ల తేడాతో గెలిచిన సీపీఎం నేత అనిల్ పేరిట ఉంది.