Delhi Yamuna Floods: NDRF Saved Costliest Bull Of India Pritam - Sakshi
Sakshi News home page

ప్రీతమ్‌గాడు నిజంగానే నడిచే బంగారం!.. వరద నుంచి రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌

Published Sat, Jul 15 2023 3:50 PM | Last Updated on Sat, Jul 15 2023 4:03 PM

Delhi Yamuna Floods NDRF Saved Costliest Bull Of India Pritam - Sakshi

నోయిడా: యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు అరిగోస పడుతున్నాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌(నేషనల్‌ డిజాస్టర్‌ రెస్సాన్స్‌ ఫోర్స్‌) సైతం రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. 

నోయిడా తీరం వెంట ఎనిమిది గ్రామాలకు చెందిన ఐదు వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించింది ఎన్డీఆర్‌ఎఫ్‌. అలాగే.. గురువారం నుంచి ఇప్పటిదాకా పశువులు, కుక్కలు, కుందేళ్లు, గినియా పందులు.. ఇలా 6వేల దాకా మూగజీవాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారట. ఈ రెస్క్యూలో దేశంలోకెల్లా నెంబర్‌ వన్‌ ఎద్దును సైతం కాపాడరంట. ఈ విషయాన్ని స్వయంగా 8వ బెటాలియన్‌ ఎన్డీఆర్‌ఎఫ్‌ ట్విటర్‌ ద్వారా స్వయంగా ప్రకటించింది. 

ప్రీతమ్‌ అనే గిర్‌ జాతి ఎద్దును నోయిడా కమలా నగర్‌లో వరద నుంచి రక్షించింది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం. దీని ధర కోటి రూపాయలకు పైగా పలుకుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.  దీని వయసు ఏడేళ్లు?!. నడిచే బంగారంగా గిర్‌ పశువులకు దేశంలోనే ఓ పేరుంది. పాలకే కాదు.. ఎద్దులకూ మాంచి గిరాకీ. ఇక ప్రీతమ్‌ వంశ వృక్షంలో ముందుతరాల పశువులకూ అడ్డగోలు రేటు దక్కింది. దేశంలో ఇలాంటి కాస్ట్‌లీ పశువులు ఉన్నా.. ప్రీతమ్‌ మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 2019లో తొలిసారి ది నేషనల్‌ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. సంకరణంతో పాటు దీని వీర్యాన్ని కూడా ప్రత్యేకంగా అమ్ముతుంటారు. అయితే ఇది కూడా కాస్ట్‌లీ వ్యవహారమే!. 

భారత్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్‌5 కారు ధర.. గరిష్టంగా 98లక్షల రూపాయలుగా ఉండడం గమనార్హం. అంటే ప్రీతమ్‌గాడి వెల అంతకన్నా ఎక్కువేనన్న మాట!!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement