కిలిమంజారోను అధిరోహించిన బాలికకు ప్రోత్సాహం | nalanda group announced to sponsor mountaineer vineela mandela education | Sakshi
Sakshi News home page

కిలిమంజారోను అధిరోహించిన బాలికకు ప్రోత్సాహం

Published Sat, Jun 10 2017 8:40 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

కిలిమంజారోను అధిరోహించిన బాలికకు ప్రోత్సాహం

కిలిమంజారోను అధిరోహించిన బాలికకు ప్రోత్సాహం

హైదరాబాద్‌: ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించిన నగర బాలికకు నలందా గ్రూప్‌ నజరానా ప్రకటించింది. ఇక నుంచి ఆ బాలిక విద్యకు సంబంధించిన వ్యయాన్ని తాము చూసుకుంటామని ప్రకటించింది.

తొమ్మిదేళ్ల వినీలా మండేలా ఈ ఏడాది జనవరి 12న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఆసియా నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన చిన్నవయస్కురాలు వినీలానే కావడం విశేషం. వినీలా సాధించిన ఘనతను గుర్తించిన నలందా గ్రూప్‌ శుక్రవారం బాలికను అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా కిలిమంజారో పర్వతారోహణకు సంబంధించిన అనుభవాలను వినీలా పంచుకుంది. సోదరుడు వినీల్‌ శిక్షణలో ఈ ఫీట్‌ను సాధించినట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement