సాక్షి, గద్వాల: ఆఫ్రికా ఖండంలోని ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని గద్వాలకు చెందిన ఆడెం కిశోర్‌కుమార్ అధిరోహించాడు. 5,895 మీటర్ల ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని డిసెంబర్ 25న అధిరోహించి అక్కడ జాతీయ జెండాను ఎగురవేశాడు. పర్యావరణ పరిరక్షణ, మానవ రవాణా, ఉగ్రవాదం రూపుమాపాలనే అంశాలతో తాను రూపొందించిన జెండాను శిఖరంపై ఎగురవేసినట్లు ఆ యువకుడు పేర్కొన్నాడు.
హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదువుతున్న కిశోర్ ఒకటిన్నరేళ్లు పర్వతారోహణలో శిక్షణ పొందాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటడమే తన లక్ష్యమని తెలిపాడు.
‘కిలిమంజారో’పై గద్వాల కుర్రాడు
Published Tue, Jan 2 2018 4:36 AM | Last Updated on Tue, Jan 2 2018 4:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment