కొలంబో: స్వార్థపూరిత ప్రస్తుత రాజకీయాలలో ప్రజా సమస్యలపై పోరాడే రాజకీయ నాయకులు చాలా తక్కువ. కానీ శ్రీలంకకు చెందిన ఓ మంత్రి చేసిన పని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీలంక ప్రజలు కొబ్బరి వ్యాపారంపై విపరీతంగా ఆధారపడుతుంటారు. అయితే ప్రస్తుతం దేశంలో 70 కోట్ల కొబ్బరి చెట్ల కొరత ఉందని, ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వానికి గట్టిగా వినిపించేందుకే తాను కొబ్బరి చెట్టు ఎక్కినట్లు మంత్రి అరుందికా ఫెర్నాండో తెలిపారు. దేశంలో పారిశ్రామిక అవసరాల భారీగా కొబ్బరిని వినియోగిస్తున్నారని తెలిపారు.
కొబ్బరికి అధిక డిమాండ్ తీర్చేందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలలో కొబ్బరి చెట్లను పెంచాలని పేర్కొన్నారు. కాగా కొబ్బరి కొరతను తీర్చేందకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అరుందికా ఫెర్నాండో తెలిపారు. మరోవైపు కొబ్బరి కొరతను అధిగమించేందుకు మంత్రి ఫెర్నాండో తీసుకుంటున్న చర్యలు హర్షనీయమని సామాజిక విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment