coconut tree
-
పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు..
-
World Coconut Day: రైతుకు సిరి.. ఉపాధికి ఊపిరి
సాక్షి అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం): కొబ్బరి అనగానే కోనసీమ గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, సుమారు 93 వేల ఎకరాలకు పైగా కోనసీమలోనే ఉంది. 70 వేల మందికిపైగా రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. దీర్ఘకాలిక ఉద్యాన పంటల్లో ఒకటిగా... నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పంటగా పేరొందింది. అంతేకాదు కొబ్బరి నుంచి సుమారు 160 రకాలకు పైగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇంత విలువైన బంగారు పంటపై రైతులే కాకుండా దింపు, వలుపు, తరుగు కార్మికులుగా, మోత, రవాణా కూలీలుగా వేలాది మంది జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్నారు. కాయర్ ఉత్పత్తి పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతుండగా, కూలీలుగానే కాకుండా పీచుతో కళాత్మక ఉత్పత్తుల తయారీతో మహిళలు జీవనం సాగిస్తున్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతుల చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు దళారులు, ట్రాన్స్‌పోర్టు యాజమానులు ఇలా వేలాది మంది ఉపాధికి కొబ్బరి ఊపిరిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నారికేళంతో వివిధ వర్గాల జీవనం పెనవేసుకుపోయిన తీరుపై కథనం... చిన్ననాటి నుంచి అనుబంధం కొబ్బరితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. మా కొబ్బరి తోటల్లో ఇంచుమించు ప్రతీ చెట్టు చిన్నప్పుడు నేను సేకరించి విత్తనాల నుంచి మొలక వచ్చినదే. అందుకే వీటితో నాకు సొంత పిల్లలతో ఉన్నంత అనుబంధం ఉంది. బహుశా అందుకేనేమో పెద్దలు కొబ్బరి చెట్టును కన్న కొడుకుతో పోలుస్తారు. 1960ల నుంచి కోనసీమలో కొబ్బరిసాగు బాగా పెరిగింది. మా లంక గ్రామాల్లో ఇది 1980 నుంచి ఆరంభమైంది. – గోదాశి నాగేశ్వరరావు, కొబ్బరి రైతు, లంకాఫ్ ఠాన్నేల్లంక మాది నాలుగవ తరం కురిడీ వ్యాపారంలో మాది నాలుగవ తరం. 60 ఏళ్లకు పైగా మా కుటుంబం ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. ఈ వ్యాపారాన్ని ఇష్టపడి చేయాలని, నిజాయితీగా ఉండాలని మా పెద్దలు చెప్పేవారు. దేశంలో కురిడీ వ్యాపారంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే దీని వల్లే. వ్యాపారం కన్నా ముందు రైతులుగా కొబ్బరి చెట్టును ప్రేమిస్తాం. బహుశా దాని వల్లనేమో కొబ్బరి మా జీవితాల్లో ఇంతగా కలిసిపోయింది. మా తరువాత తరం కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. – అప్పన బాలాజీ, కురిడీ కొబ్బరి వ్యాపారి, మాచవరం, అంబాజీపేట మండలం మూడున్నర దశాబ్దాలుగా ఆయిల్ వ్యాపారం మాది కొబ్బరి నూనె వ్యాపారం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. అంబాజీపేటలో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మాది ఒకటిగా పేరొచ్చింది. గతంలో రైతులు కొబ్బరి ఎండబెట్టి సొంతంగా ఆయిల్ తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మా పిల్లలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. – గెల్లి నాగేశ్వరరావు, కొబ్బరి నూనె వ్యాపారి, అంబాజీపేట 60 ఏళ్లుగా ఇక్కడే రాజస్థాన్‌లోని నాగూర్ మాది. మా తండ్రితోపాటు మా కుటుంబ సభ్యులు 60 ఏళ్లకు ముందే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాం. అప్పుడు నా వయస్సు రెండేళ్లు. తొలి నుంచి మాది కొబ్బరి కమీషన్ వ్యాపారం. కోనసీమ కొబ్బరి ఉత్తరాదికి పంపడంలో మా కుటుంబం కీలకంగా ఉండేది. అన్నదమ్ములమంతా ఇక్కడ కమీషన్ వ్యాపారం చేసేవాళ్లం. 1980 నుంచి 1996 వరకు కోనసీమ కొబ్బరి దేశీయ మార్కెట్లో ఉజ్వలంగా ఎదిగింది. తుపాను వచ్చిన తరువాత బాగా దెబ్బతింది. ఇప్పటికీ కమీషన్ వ్యాపారం జరుగుతున్నా అంతగా లేదు. – సంపత్ కుమార్ ఫారిక్, కొబ్బరి కమీషన్ వ్యాపారి, అంబాజీపేట కొబ్బరి వలుపే జీవనాధారం ఇప్పుడు నా వయస్సు 49. నా పదిహేనవ ఏట నుంచి కొబ్బరి వలువులో జీవనోపాధి పొందుతున్నాను. ఈ పని తప్ప మరొకటి రాదు. కుటుంబాన్ని పెంచి పోషించింది కూడా ఈ వృత్తిలోనే. నేనే కాదు చాలామంది మా వలుపు కార్మికులకు మరోపని రాదు. ఇన్నేళ్లుగా కొబ్బరితోనే మా జీవనం సాగిపోతోంది. – విప్పర్తి సత్యనారాయణ (బంగారి), పోతాయిలంక, అంబాజీపేట మండలం పరాయి రాష్ట్రమైనా కొబ్బరే ఆధారం మాకు స్థానికంగా పనులు లేక తమిళనాడులోని కాంగేయం వెళ్లిపోయాం. పరాయి రాష్ట్రానికి వెళ్లినా జీవనోపాధికి కొబ్బరి మీదనే ఆధారపడాల్సి వస్తోంది. నేను గడిచిన ఆరు ఏళ్లుగా తమిళనాడులో ఎండు కొబ్బరి తరిగే పనిచేస్తున్నాను. – దోనిపూడి దుర్గాప్రసాద్, తరుగు కార్మికుడు -
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
నక్కపల్లి: మండలంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. రాజయ్యపేటలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. ఆ ప్రాంతంలో ఆటలాడుకుంటున్న పిల్లలు పిడుగు శబ్దానికి భయపడి పరుగులు తీశారు. ఈ దృశ్యాన్ని కొందరూ వీడియోలో చిత్రీకరించారు. -
కొబ్బరి దింపు.. ఉండదిక జంకు
సాక్షి, అమరావతి: కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి నేలకు దించే (కొబ్బరి దింపు) విషయంలో రైతులు పడే వెతలు అన్నీఇన్నీ కావు. కొబ్బరి దింపు కార్మికులకు ఆదాయం తక్కువగా ఉండటం.. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు ఉండటం లేదు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం పరిష్కారం చూపుతోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపుతోంది. ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ కొబ్బరి చెట్టుపైకి సునాయాసంగా ఎక్కగలిగే పరికరాన్ని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీబీడీ) రూపొందించింది. ఈ పరికరం ఆధారంగా కొబ్బరి చెట్లు ఎక్కడం, కాయల్ని కోసి దించడంపై అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ ఇస్తోంది. 18–45 ఏళ్ల మధ్య వయసు కలిగి 7వ తరగతి వరకు చదివిన యువతీ, యువకులను కొబ్బరి వృక్ష మిత్రలుగా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు ఎక్కడం, కాయలు దెబ్బతినకుండా నేలకు దించడం, కొబ్బరి తోటల్లో తెగుళ్ల నివారణ, ఎరువులు, పురుగుల మందుల ఉత్తమ యాజమాన్య పద్ధతులపై తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి చొప్పున 6 రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కోసం ఉద్యాన వర్సిటీ రూ.1,06,500 ఖర్చు చేస్తోంది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్తో పాటు రూ.2,500 విలువ గల చెట్టు ఎక్కే పరికరాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 26 బ్యాచ్‌లుగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పట్టణానికి చెందిన 520 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. తాజాగా అంబాజీపేట పరిశోధనా కేంద్రం సహకారంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విశాఖ జిల్లా అచ్యుతాపురం, చిత్తూరు జిల్లా కలికిరి, కృష్ణా జిల్లా గరికిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా (కేవీకే) శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. దింపు కార్మికులకూ పెరుగుతున్న ఆదాయం సాధారణంగా సంప్రదాయ కొబ్బరి దింపు కార్మికులు రోజుకు 30నుంచి 40 చెట్ల కాయల్ని దించగలరు. అదే శిక్షణ పొందిన వృక్ష మిత్రలైతే 70నుంచి 80 చెట్ల కాయలను దించగలుగుతున్నారు. సంప్రదాయ దింపు కార్మికులు రోజుకు రూ.300 సంపాదిస్తుండగా.. వృక్షమిత్రలు రోజుకు రూ.500 కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. శిక్షణ పొందాలనుకుంటే.. ఆసక్తి గల నిరుద్యోగులు ఎంతమంది ముందుకొచ్చినా శిక్షణ ఇచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. శిక్షణ పొందగోరే అభ్యర్థులు అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్ 08856–243847 లేదా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్‌బీవీ చలపతిరావు (సెల్: 83095 38808)ను సంప్రదించవచ్చు. అభ్యర్థులకు సమీపంలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. స్థానికంగా ఉపాధి పొందగోరే యువత మాత్రమే కాకుండా కొబ్బరి తోటలు పెంచే రైతులు సైతం శిక్షణ పొందవచ్చు. నేనే దింపు తీసుకుంటున్నా నాకు మూడెకరాల కొబ్బరితోట ఉంది. దింపు సమస్యతో చాలా ఇబ్బందిపడే వాడిని. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ పొందా. ఇప్పుడు కార్మికులపై ఆధారపడకుండా నా తోటలో నేనే స్వయంగా కాయలు దింపుకోగలుగుతున్నా. దీనివల్ల నెలకు రూ.2 వేలకు పైగా మిగులుతోంది. – మట్టపర్తి వెంకట సుబ్బారావు, శిక్షణ పొందిన రైతు రోజుకు రూ.500 సంపాదిస్తున్నా నేను కూలీ పనులు చేసుకునే వాడిని. రోజూ రూ.300కు మించి ఆదాయం వచ్చేది కాదు. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ తీసుకున్నాను. ఉచితంగా ఇచ్చిన పరికరం సాయంతో సులభంగా కొబ్బరిచెట్లు ఎక్కి కాయల్ని దింపు తీస్తున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. – నెల్లి నవీన్, కొబ్బరి వృక్షమిత్ర, గంగలకుర్రు, తూర్పు గోదావరి సమయం.. పెట్టుబడి కలిసొస్తుంది. నాకు పదెకరా>ల కొబ్బరి తోట ఉంది. దశాబ్దాలుగా దింపు సమస్య ఎదుర్కొన్నా. శిక్షణ పొందిన కొబ్బరి వృక్షమిత్రలు రావడంతో దింపు కోసం ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు సమయం, పెట్టుబడి కూడా కలిసి వస్తోంది. – చేకూరి సూర్యనారాయణ, డైరెక్టర్, కృషివల కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీ దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం విశ్వవిద్యాలయం ద్వారా అంబాజీపేట పరిశోధనా కేంద్రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. శిక్షణ సందర్భంగా సాగులో యాజమాన్య మెళకువలపైనా తర్ఫీదు ఇస్తున్నాం. కొబ్బరి వృక్ష మిత్రల రాకతో కొబ్బరి దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ -
కొబ్బరి చెట్టెక్కి మరీ చెప్పిన మంత్రి..
కొలంబో: స్వార్థపూరిత ప్రస్తుత రాజకీయాలలో ప్రజా సమస్యలపై పోరాడే రాజకీయ నాయకులు చాలా తక్కువ. కానీ శ్రీలంకకు చెందిన ఓ మంత్రి చేసిన పని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీలంక ప్రజలు కొబ్బరి వ్యాపారంపై విపరీతంగా ఆధారపడుతుంటారు. అయితే ప్రస్తుతం దేశంలో 70 కోట్ల కొబ్బరి చెట్ల కొరత ఉందని, ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వానికి గట్టిగా వినిపించేందుకే తాను కొబ్బరి చెట్టు ఎక్కినట్లు మంత్రి అరుందికా ఫెర్నాండో తెలిపారు. దేశంలో పారిశ్రామిక అవసరాల భారీగా కొబ్బరిని వినియోగిస్తున్నారని తెలిపారు. కొబ్బరికి అధిక డిమాండ్ తీర్చేందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలలో కొబ్బరి చెట్లను పెంచాలని పేర్కొన్నారు. కాగా కొబ్బరి కొరతను తీర్చేందకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అరుందికా ఫెర్నాండో తెలిపారు. మరోవైపు కొబ్బరి కొరతను అధిగమించేందుకు మంత్రి ఫెర్నాండో తీసుకుంటున్న చర్యలు హర్షనీయమని సామాజిక విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
రామయంపేట (మెదక్): మండలంలో లక్ష్మాపూర్ వద్ద ఒక్క రైస్‌మిల్ ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై గురువారం రాత్రి పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీనితో కొబ్బరి చెట్టు పాక్షికంగా దగ్ధమైంది. పక్కనే ఉన్న ఇళ్లలో ఉన్న వారికి తృటిలో ప్రాణప్రాయం తప్పింది. దీనితో గ్రామస్తులు భయందోళన వ్యక్తం చేశారు. -
చిచ్చరపిడుగు మోగ్లీ.. విన్యాసాలు
తిరువనంతపురం : వేసవి కాలం వస్తోందంటే అందరూ హడలెత్తిపోతారు.. కానీ చిన్న పిల్లలు మాత్రం పండగ చేసుకుంటారు. ఎందుకంటే అపుడే కదా వారికి సెలవులు వచ్చేది. అప్పటివరకూ బడిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు వేసవి సెలవుల్లో తమ చేష్టలతో తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. అటువంటి చిచ్చర పిడుగుల అల్లరికి అంతే ఉండదు. ‘నోస్టాలిగా’ అనే ఫేస్బుక్ పేజీలో కేరళకు చెందిన ఓ చిన్నారి భయం లేకుండా కొమ్మను పట్టుకుని కొబ్బరి చెట్టెక్కేందుకు ప్రయత్నిస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘రానున్న రెండు నెలల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో దేవుడా’ అంటూ చేసిన కామెంట్ లైక్‌లు, షేర్లతో దూసుకుపోతోంది. అయితే ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరి నవ్వు తెప్పిచ్చినా.. జాగ్రత్త వహించకపోతే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచడం మర్చిపోకండి సుమా. -
మోగ్లీ చేసిన విన్యాసాలు..వైరల్!
-
గుడిలో కొబ్బరి చెట్టు మీద పడి బాలుడి మృతి
-
కొబ్బరి చెట్టు మీద పడి బాలుడి మృతి
నిజామాబాద్ : కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కమ్మర్పల్లి మండలకేంద్రానికి చెందిన మణి(14) అనే బాలుడు కొత్త సంవత్సరం సందర్భంగా ఉప్లూర్ గ్రామంలో ఉన్న శ్రీ బాలరాజేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తుండగా అకస్మాత్తుగా కొబ్బరిచెట్టు విరిగి బాలుడి మీద పడింది. దీంతో మణి తీవ్రరక్త స్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. కొబ్బరిచెట్టు మొదలులో పుచ్చిపోవడం వల్లే చెట్టు విరిగి పడిందని స్థానికులు చెబుతున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
మూడేళ్లు చెట్టుపైనే గడిపాడు
-
‘నీరు’కేళం కాదు సుమా..
అమలాపురం : కొబ్బరిని ‘నారికేళం’ అని కూడా అంటారు. తోటల్లో, గట్లపై, పెరళ్లలో పెరిగే ఈ చెట్ల మెుదళ్లలో నీరు ఎక్కువైతే వేర్లు దెబ్బతిని చెట్టు చనిపోయే అవకాశముంది. అలాంటిది మెువ్వు వరకూ చెరువులో మునిగిన ఈ ఫొటోలోని కొబ్బరిచెట్టు ‘ఎలా బతికి ఉందో?’ అనిపిస్తుంది. అసలు సంగతేమిటంటే.. తల తప్ప నిలువెల్లా నీట మునిగినట్టు కనిపిస్తున్న ఈ చెట్టు మెుదలు చెరువులో కాక గట్టున ఉంది. అయితే.. వంపులు తిరిగిన చెట్టు చెరువులోకి ఒరిగిపోవడంతో కాండంలో చాలాభాగం నీట మునిగి, తలభాగం చెరువు మధ్యలో కనిపిస్తోంది. అంతరచిత్రం చూస్తే అసలు సంగతి అర్థమవుతుంది. అంబాజీపేట శివారు భేతాళస్వామి గుడి సమీపంలోని చెరువులో ఈ తమాషా దృశ్యాన్ని చూడవచ్చు. -
దింపు కార్మికుడి దుర్మరణం
అమలాపురం రూరల్ : కొబ్బరిచెట్టు ఎక్కి దింపు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై దింపు కార్మికుడు దుర్మరణం పాలైన సంఘటన భట్నవిల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. అనాతవరం బాలయోగి కాలనీకి చెందిన పరమట నాగేశ్వరరావు(50) భట్నవిల్లి గ్రామంలోని రైతు పొలంలో దింపు తీస్తుండగా, 11కేవీ విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై చెట్టుపైనే మరణించాడు. స్థానికులు అతడిని కిందకు దించేటప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హెచ్‌సీ అచ్చిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య వేధిస్తోందని ...
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు అభిమాన నటుడు అంబరీష్ రావాలని పట్టు అక్క మాటతో దిగి వచ్చిన వెంకటేష్ మైసూరు : ఆస్తి కోసం భార్య, ఆమె బంధువులు వేధించడంతో భర్త చెట్టెక్కాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తన సమస్య పరిస్కారం కావాలంటే తన అభిమాన నటుడు అంబరీష్ ఘటనా స్థలానికి రావాలని పట్టుబట్టాడు. తాను జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తానని అతని అక్క హామీ ఇవ్వడంతో చెట్టు దిగాడు. సంచలనం సృషించిన ఈ ఘటన శనివారం మైసూరు నగరంలోని సరస్వతిపురంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు... సరస్వతిపురలో వెంకటేశ్,సుశీల దంపతులు నివాసం ఉంటున్నారు. ఈయనకు చెందిన ఆస్తిపాస్తులను భార్య, ఆమె బంధువులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో వెంకటేశ్ శనివారం ఉదయం 10 గంటలకు తన ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దిగాలని నచ్చజెప్పారు. అందుకు వెంకటేశ్ ససేమిరా అన్నాడు. తన భార్య, ఆమె బంధువులు తనను కొట్టి ఆస్తి పత్రాలు లాక్కున్నారని, ఆస్తి మొత్తం రాసివ్వకపోతే చంపివేస్తామని బెదిరిస్తున్నారని, వారిని వెంటనే ఇక్కడకు తీసుకొచ్చి తనకు న్యాయం చేయాలని, అంతవరకు కిందకు దిగేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. రాత్రి ఏ డుగంటలైనా కిందకు దిగకపోవడంతో పోలీసులు చెట్టుపైకి ఎక్కేందుకు యత్నించగా కిందకు దూకుతానని వెంకటేశ్ బెదిరించాడదు. అక్కడే ఉన్న భార్య మాట్లాడుతూ తన భర్తను తాను వేధించలేదని పేర్కొంది. భర్త కిందకు దిగితే సమస్య పరిష్కరించుకుందామని సూచించింది. అయినా వెంకటేశ్ స్పందించలేదు. రాత్రి 7.30గంటల సమయంలో అతని అక్క పుట్ట మహదేవమ్మ వచ్చి నేను మాట్లాడుతా అని చెప్పడంతో వెంకటేష్ రాత్రి 7.30 గంటల సమయంలో కిందికి దిగడంతో పొలిసులు ఊపిరి పిల్చుకున్నారు. చెట్టు దిగిన వెంకటేష్‌ను పొలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా సినీ నటుడు, ఎంపీ అయిన అంబరీష్‌కు వీరాభిమాన అయిన వెంకటేశ్ 1993లో ఓసారి ఇలా చెట్టు ఎక్కాడు. అప్పట్లో మైసూరు సమీపంలో సినిమా షూటింగ్లోఉన్న నటుడు అంబరిష్ విషయం తెలుసుకోని అక్కడికి చేరుకోగా వెంకటేశ్ కిందకు దిగినట్లు స్థానికులు తెలిపారు. -
కొబ్బరి పొట్టుతో ప్రయోజనాలెన్నో!
సేంద్రియసాగు ►సేంద్రియ ఎరువు తయారీకి అవకాశం ►నీటి లభ్యత లేని ప్రాంతాలకు వరం అమలాపురం : కొబ్బరి చెట్టు కల్పతరువు. దీని నుంచి వచ్చే కాయలే కాదు.. అన్ని పదార్థాలు రైతుకు ప్రయోజనం చేకూర్చేవే. కొబ్బరి కాయ లు ఒలిచిన తర్వాత వచ్చే డొక్కలు, పీచు వృథా పోకుండా వంట చెరుకుగా వాడుతున్నారు. దీనిని మరింత ఉపయుక్తంగా నారతీసి రకరకాల అవసరాలకు వినియోగించినప్పుడు ఉప ఉత్పత్తిగా ‘పొట్టు’ వస్తుంది. గతంలో ఇటుక బట్టీల్లో దీనిని వినియోగించేవారు. అయితే వ్యవసాయ అవసరాల కోసం కొబ్బరి పొట్టును విని యోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. అమలాపురం రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు కన్వీనర్ (94402 50552, 93925 50552) అడ్డాల గోపాలకృష్ణ. వివరాలు ఆయన మాటల్లోనే... కొబ్బరి పీచును ఉత్పత్తి చేసే సమయంలో వచ్చే కొబ్బరి పొట్టుతో ఎన్నో వ్యవసాయ ఉపయోగాలున్నాయి. ఈ పొట్టును నేరుగా పొలంలో వినియోగించకూడదు. దానిని శుద్ధిచేసి.. ఆ తరువాత కుళ్లబెట్టి రకరకాలుగా వినియోగించవచ్చు. దీంతో మంచి సేంద్రియ ఎరువును తయారుచేసుకోవచ్చు. శుద్ధి చేసి వాడాలి డొక్కల నుంచి నార (కోకోనట్ యార్న్) తీయగా వచ్చే ‘కొబ్బరిపొట్టు’లో ముందుగా చిన్న చిన్న నారముక్కలు వేరయ్యేలా జల్లెడ పట్టాలి. తర్వాత పెద్ద సిమెంట్ తొట్టెలో నీరు నింపి నాలుగు రోజులు ఉంచాలి. ఆపై ఆ నీరు తీసి మళ్లీ కొత్త నీటితో తొట్టె నింపాలి. ఒక రోజు ఉంచి మరుసటి రోజు పొట్టును తీసి ఎండలో ఆరనివ్వాలి. ఇలా ఆరిన పొట్టులో ‘లిగ్నన్’ బాగా తగ్గుతుంది. దీనిని ప్రత్యేక యంత్రాలతో ఇటుకల మాదిరిగా కంప్రెస్ చేసి మార్కెటింగ్ చేస్తారు. ప్రత్యేకించి పోషక విలువలు ఏమీ లేకపోయినా ఎడారి ప్రాంతాల్లో నీటి సామర్థ్యం పెంచేందుకు ఈ కొబ్బరి పొట్టు ఇటుకలు బాగా ఉపకరిస్తాయి. త్వరత్వరగా నీరు పోయనవసరం లేకుండా ఈ ఇటుకలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుండీల్లో, నేలలో వేసి నీరు పెడతారు. ఆపై 10 నుంచి 15 రోజుల వరకు మొక్కలకు కావాల్సిన తేమ ఈ ఇటుకల నుంచి నెమ్మదిగా విడుదలవుతుంది. నేరుగా ఎందుకు వాడకూడదంటే... ►కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే దీనిలో ఉన్న లిగ్నన్ మొక్కలకు హాని చేస్తుంది. ►కుళ్లబెట్టకపోతే మొక్కలకు ఎరువుగా ఉపయోగపడదు. ► పోషకాలను పట్టి ఉంచే లక్షణాన్ని కోల్పోతుంది. ►నీటి నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. ►సి : ఎన్ (కర్బనం, నత్రజనిల నిష్పత్తి) మొక్కలకు అనుకూలంగా ఉండదు. దీనిని శుద్ధి చేసి కొన్ని రకాలుగా, కుళ్లబెట్టి మరికొన్ని అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎరువు తయారీ ఇలా.. ►కొబ్బరి పొట్టును సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలంటే దీనిని తప్పని సరిగా కుళ్లబెట్టాలి. ►ఒక టన్ను కొబ్బరి పొట్టులో ఐదు కేజీల రాతి భాస్వరం, ఐదు కేజీల యూరియా వేసి తడిపి 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఇలా ఉంచిన పొట్టును పొరలు పొరలుగా తడుపుతూ ఐదు కేజీల ప్లూరోటస్ సాజర్కాజూ అనే శిలీంధ్రాన్ని (పుట్టగొడుగుల తయారీలో వాడతారు) చల్లి నీటితో పలుచగా తడపాలి. ►పొట్టును నాలుగు అడుగుల వెడల్పు, సుమారు మూడడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు కలిగిన కుప్పలా చేయాలి. దీనికి సూర్యరశ్మి నేరుగా తగలకుండా (నీడ) ఏర్పాటు చేయాలి. బాగా పైభాగంలో కొబ్బరి ఆకులు కప్పితే మరింత చల్లగా ఉండడం వల్ల శిలీంధ్రం వేగంగా విస్తరించి పొట్టు త్వరగా కుళ్లిపోతుంది. ►సాధారణంగా శీతాకాలం చల్లగా ఉండ డం వల్ల ఈ ప్రక్రియ వేగంగా 60 నుంచి 90 రోజుల్లో కొబ్బరి పొట్టు కుళ్లిపోతుంది. ఆవు పేడ, దాని మూత్రం, గ్లైరిసిరియాలను ఈ పొట్టులో పొరల మధ్య వేయడం ద్వారా పొట్టు మరో పది రోజులు ముందుగా కుళ్లడమే కాకుండా మరింత నత్రజని శాతం పెరిగి వ్యవసాయాని బాగా ఉపయోగపడుతుంది. ►ప్లూరోటస్ సాజర్ కాజూను కేరళ, ధవళేశ్వరంల్లో క్వాయర్ బోర్డు కార్యాలయాలు, అంబాజీపేట హెచ్‌ఆర్‌ఎస్‌లో గాని రైతులు పొందవచ్చు. ►పొట్టు కుళ్లే 90 రోజుల సమయంలో రెండు లేదా మూడుసార్లు బాగా తడిపితే పొట్టు మరింత త్వరగా కుళ్లుతుంది. కలిగే ప్రయోజనాలు ►పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువును అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ►దీనికి నీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. నీరు లభ్యత తక్కువగా ఉండే కరువు ప్రాంతాలకు ఇది వరం. ►అతి తక్కువ బరువు ఉండడం వల్ల విమానాల్లో రవాణా చేసే మొక్కలకు ఉపయోగకరం. ప్రయాణాల్లో నీరు వేయాల్సిన పని లేదు. ►పాలీ హెజ్ల్లో, నర్సరీ ట్రేలల్లో, జర్జెరా, కార్నేషన్ వంటి పూలమొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. ►కూరగాయల విత్తనాలు ట్రేలలో పెంచేందుకు వాడుకోవచ్చు. ►సేంద్రియ, జీవన, రసాయనిక ఎరువులను నీటితో కలిపి సులువుగా దీనిలో వేసి మొక్కలకు నెమ్మదిగా అందించవచ్చు. ►ఈ పొట్టు వల్ల మొక్కల వేర్లకు గాలి బాగా సోకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతాయి. ►వేసవిలో మొక్కలకు నీటి ఎద్దడికి గురి కాకుండా నర్సరీ కవర్లో పైన వేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. ►నీరు లేని (కంప్రెస్డ్) కుళ్లిన కొబ్బరి పొట్టు బరువు చాలా తక్కువగా ఉండడం వల్ల దూర ప్రాంతాలకు తక్కువ వ్యయంతో ఎక్కువ పొట్టును రవాణా చేయవచ్చు. -
వివరం: కల్పవృక్షం భూమ్మీద పుడితే...
వృద్ధాప్యం ఎరుగని కాయ ఏదైనా ఉందీ అంటే, అది కొబ్బరికాయే! పండుగా రూపాంతరం చెందకుండానే జీవితసారంతో పండిపోయే కాయ కూడా అదే! ఏ కాయకూ లేనన్ని అన్వయాలు! ఏ కాయా చెప్పలేనన్ని తత్వాలు! చిన్నప్పుడు బోండాంగాడిగా తీసి పారేయగలిగే వెసులుబాటు ఇస్తూనే, పెద్దవుతూనే పరమ పవిత్రతను ఆపాదించుకుంటుంది నారీకేళ ఫలం. అదికదా అసలైన పరిణామం. అది కదా మనిషి అందుకోగలిగే సందేశం. పూజల్లో, భోజనంలో, వివాహంలో, బతుకుదెరువులో భాగమైన ఈ చెట్టంత ప్రాధాన్యత భూమ్మీద మరిదేనికీ లేదేమో! సర్వకాల సర్వావస్థల్లోనూ అది ఉపయోగపడినట్టే, కొబ్బరిచెట్టులోని సర్వాంగాలూ మనకు పనికొస్తాయి. బహుశా పురాణాల్లో వినిపించే కల్పవృక్షం ఇదేనేమో! సాధారణంగా వేసవి రాగానే తలుచుకునే కొబ్బరిని ఇప్పుడు గుర్తుచేసుకోవడానికి కారణం ఇది మాత్రమే కాదు; సెప్టెంబర్ 2న ‘వరల్డ్ కొకొనట్ డే’ కావడం మూలాన కూడా! ఏ పనిచేసినా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం మన సంప్రదాయం. ఏ మొదటి పూజైనా గణేశుడికి చేయడం అంతకన్నా ప్రధానం. అందుకే ఈ కథనాన్ని ‘గణేశుడు - కొబ్బరికాయ’తో మొదలుపెడదాం. బొజ్జ గణపయ్య బుజ్జి గణపయ్యగా ఉన్నప్పటి సంగతిది. ఆటలాడుకునే పసితనం కదా! ఒకరోజు శివుడి మూడోకన్నును చూసి ముచ్చటపడి, దాంతో ఆడుకుంటానని మారాంచేశాడట విఘ్నేశుడు. అది తెరవడం ప్రళయసంకేతం కాబట్టి, కొడుకును బుజ్జగించి, దీనికి బదులుగా నీకో ప్రత్యేక బంతి ఇస్తాను, అన్నాడట పరమేశ్వరుడు. అలా కొబ్బరి పుట్టిందట. అందుకే కొబ్బరికాయకు శంకరుడిలా మూడు కళ్లుంటాయని ఒక భౌతిక రుజువు. పీచు తీసిన కొబ్బరి మనిషి తలను తలపిస్తుంది కాబట్టి, ఇది నిజమేనేమో అనిపించేంత పకడ్బందీగా అల్లిన పూర్వగాథ. వాస్తవం ఏమైనా, నమ్మడానికి బాగుండే కథ. మతాలు, విశ్వాసాల కన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది బతుకుదెరువుతో కొబ్బరి ముడిపడివున్నదన్నది మాత్రం కాదనలేని నిజం. చిట్లించిన ముఖం! ప్రపంచం నుంచి మనం ఎన్నిరకాల కూరగాయల్ని, పళ్లను దిగుమతిచేసుకున్నామో! కానీ కొబ్బరికాయను మాత్రం పాక్షికంగానైనా మనదేనని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే, మూడున్నర నుంచి ఐదున్నర కోట్ల సంవత్సరాల క్రితమే భూమ్మీద కొబ్బరిచెట్టు ఉనికి ఉందని నిర్ధారించే శిలాజాలను భారత్, ఆస్ట్రేలియాల్లో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు మరి! మనదేశం నుంచే యూరప్ యాత్రికులు తమ దేశాలకు ఈ కాయను పరిచయం చేశారు. అందుకే దీన్ని ‘ఇండియన్ నట్’గానే వాళ్లు భావించారు. పోర్చుగీసు నావికుడు వాస్కో డి గామా బూరు తీసిన కొబ్బరికాయను తొలుత చూసి, చిట్లించిన ముఖంలాగా దాని ఆకృతి ఉందనుకుని, తన భాషలో ఆ అర్థాన్నిచ్చే పదం ‘కొకొ’ అని దీనికి నామకరణం చేశాడట. ఇంగ్లీషువాళ్లు దానికి ‘నట్’ చేర్చి, ‘కొకొనట్’ అన్నారట. నాగరిక చెట్టు! కొబ్బరి మహాసముద్రంలో పుట్టింది. భూమధ్యరేఖకు ఇరువైపులా ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాల్లో ఈ చెట్లు తొలుత పెరిగాయంటారు. మలేసియా(దేశం కాదు; ఫిలిప్పీన్స్, ఇండోనేసియా లాంటి దేశాలున్న హిందూ మహాసముద్ర ప్రాంతం), మెలనేసియా (ఫిజి, గినియా లాంటి దేశాలున్న పిసిఫిక్ మహాసముద్ర ప్రాంతం)ల్లో కొబ్బరిచెట్లు ఆవిర్భవించి ఉండొచ్చు. మరింత స్పష్టంగా న్యూ గినియా ద్వీపం చుట్టుపక్కల పెరిగివుంటాయని మరో అభిప్రాయం. ఏదేమైనా సముద్రంలోని చిన్న చిన్న దీవుల్లో ఇవి పెరిగాయి. నీటిలో ఈదడానికీ, ఇతర సమూహాల సంపర్కానికీ కొబ్బరిదుంగలు పనికొచ్చాయి. అలా నాగరికతను ఒక తీరానికి చేర్చిన చెట్టు ఇది. ప్రకృతి ఎంత గొప్పదంటే, మనిషి జీవించడానికి అది మరొక ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టి ఉంచుతుంది. కనుచూపుమేరా కనబడే తాగడానికి పనికిరాని సముద్ర నీళ్లు ఉన్నచోట కొబ్బరినీటిని సృష్టించి పెట్టింది. తల్లి భూదేవి తన పిల్లలకు బోండాం రూపంలో ప్యాక్ చేసిచ్చిన హెల్త్ డ్రింక్ అది. లైఫ్ డ్రింక్! చిన్నకాయలో పావు లీటర్, ఎదిగినదాన్లో లీటర్ వరకూ నీళ్లుండే బోండాం కడుపారా దాహం తీర్చగలదు. ఇది పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలాంటివే కాక, లారిక్ ఆమ్లం కలిగివుంటుంది. ఈ విషయంలో తల్లిపాలతో దాదాపు సరిసమానం అవగలదు. ఈ నీరు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది. చిన్నప్రేవుల్లోని పురుగుల్ని చంపేస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి కలిగివుంటుంది. మూత్రం వృద్ధి అయ్యేట్టు చేసి, శరీరాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది. అందుకే కొబ్బరి అధికంగా పండించే ఫిలిప్పీన్స్‌లో కొత్త సామెత పుట్టింది: ఎ కొకొనట్ ఎ డే కీప్స్ ది యూరాలజిస్ట్ అవే(రోజో కొబ్బరిబోండాం తాగితే, మూత్రపిండాలకు సంబంధించిన వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం రాదని దీని అర్థం). గ్లకోమా ఉన్నవాళ్లకు కూడా తాగితే మేలుచేస్తుంది. నీరసంగా ఉన్నవాళ్లకు కూడా కొబ్బరి ఎంత సులభంగా శరీరంలో కలిసిపోగలదంటే, దాన్ని జీర్ణం చేయడానికి ప్రత్యేకంగా పైత్యరసం ఉత్పత్తి కానవసరం లేదు. అందుకే అది నేరుగా రక్తంలో కలిసిపోయి, తక్షణం శక్తి ఇస్తుంది. అందుకే దాన్ని జీవద్రవం అంటారు. కొబ్బరినీరు రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయం కాగలదు. పైగా ఎర్ర రక్తకణాలకు హాని చేయదు, అలెర్జీ కలిగించదు. అందుకే యుద్ధ సమయాల్లో ఐ.వి.(ఇంట్రా వీనస్) ద్రవాలు అందుబాటులో లేని సందర్భాల్లో- ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధం, వియత్నాం యుద్ధ కాలంలో- అప్పుడే దింపిన తాజా కొబ్బరినీటిని సైనికులకు నేరుగా ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించేవారు. బాగా పరుగెత్తడం వల్ల చెమటతో కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి భర్తీ చేయడానికి అథ్లెట్లకు కూడా ఇది మంచి రీహైడ్రేజన్ డ్రింక్! భూమ్మీది కల్పవృక్షం! 30 మీటర్ల ఎత్తుకు పెరిగే కొబ్బరిచెట్టు దుంగను పడవగా మలుచుకోవచ్చు. వంతెనగా వాడుకోవచ్చు. కొబ్బరిమట్టల్ని తలదాచుకోవడానికి పైకప్పుగా వేసుకోవచ్చు. తడికలు, చాపలు అల్లుకోవచ్చు. బుట్టలు చేసుకోవచ్చు. పనితనం తెలిసినవాళ్లు ఆకులతో పిల్లలకు ఆటవస్తువులు చేసివ్వొచ్చు. కొబ్బరిపీచుతో తాళ్లు పేనుకోవచ్చు, మ్యాట్స్ చేసుకోవచ్చు, గిన్నెల్ని తోముకోవచ్చు, కొబ్బరి ఇటుకలు చేసుకోవచ్చు. బూరును అంటించడం ద్వారా దోమలను పారద్రోలవచ్చు. వంటచెరుకుగా, ఫర్నిచర్‌గా, చీపురుగా ఎలా అంటే అలా రూపాంతరం చెందించవచ్చు. ఆరోగ్యంగా ఉంటే ఒక్కోచెట్టు ఏటా కనీసం 75 కాయలు ఇస్తుంది. నీళ్లనూ, పాలనూ, నూనెనూ, కొబ్బరినీ, టెంకనూ, మీది పీచును కూడా వినియోగించుకోగలిగే అద్భుత ఫలం ఇది. శాకాహారులు కూడా తినగలిగే మాంసం ఇది. తెల్లటి భాగాన్ని మాంసం అంటారు. అసలు ఇందులో వృథా అయ్యేది ఏదీ లేదు. కాయ, ఆకు, కాండం అన్నీ పనికొచ్చేవే! ఆకలి తీర్చి, దప్పిక తీర్చి, పోషకాహారాన్ని ఇచ్చి, నీరసంగా ఉంటే శక్తినిచ్చి, అందుకోవడానికి సాహసాన్నిచ్చి, దాని నీడ, జాడల అందంతో కవిత్వశక్తినిచ్చే ఇలాంటి చెట్టును కల్పవృక్షం అనికాకుండా మరేమంటారు? అందుకే ఒక్క కొబ్బరిచెట్టు మనిషి మనుగడకు అండాదండ. అందుకే కొబ్బరికి అంత ప్రాధాన్యత. కొకొనట్ డే కూడా చెప్పేది అదే! ఎందుకు సెప్టెంబర్ 2? ఇండోనేషియా కేంద్రంగా ఉన్న ‘ఏసియన్ అండ్ పసిఫిక్ కొకొనట్ కమ్యూనిటీ’(ఏపీసీసీ) ఈ ‘వరల్డ్ కొకొనట్ డే’ను ప్రారంభించింది. భారత్ సహా, కొబ్బరి అత్యధికంగా పండించే దేశాలన్నీ ఇందులో సభ్యత్వం కలిగివున్నాయి. సెప్టెంబర్ 2 ఏపీసీసీ వ్యవస్థాపక దినం. కొబ్బరి ప్రాధాన్యతను గురించిన అవగాహన కల్పించడం, పేదరిక నిర్మూలనలో కొబ్బరి పాత్ర తెలియజెప్పడం, మొత్తంగా కొబ్బరి పరిశ్రమ వృద్ధి అయ్యేలా చూడటం ఏపీసీసీ లక్ష్యాలు. 92 దేశాల్లోని సుమారు మూడు కోట్ల ఎకరాల్లో కొబ్బరి పండుతుంది; ఏటా 6 కోట్ల టన్నుల కాయ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ ఉత్పత్తిలో 16 శాతంతో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇండోనేషియా(34), ఫిలిప్పీన్స్(25) అత్యధికంగా సుమారు అరవై శాతం వాటాను ఆక్రమిస్తాయి. మళ్లీ మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కొబ్బరిలో దక్షిణాది నాలుగు రాష్ట్రాలు- కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లదే 92 శాతం. తిరిగి ఇందులో కేరళది సగం వాటా. కేరళీయులు వంటను కూడా కొబ్బరినూనెతో చేస్తారని మలయాళేతరుల ప్రేమవిసుగు ఇందుకే! కొబ్బరి చెప్పే భావాలెన్నో! ఒక కొత్త పని ప్రారంభించినప్పుడు, దాని తాలూకు గర్వం మనిషిలో మొలకెత్తే అవకాశం ఉంటుంది. నేను కేవలం పరికరాన్నే, అంతా నువ్వే అని దేవుడి ముందు మనిషి తన అహాన్ని బద్దలు కొట్టుకోవడంగా కొబ్బరికాయ కొట్టడాన్ని పెద్దలు విశ్లేషిస్తుంటారు. భయస్థులకు కొబ్బరిపీచు ప్రతీకట. ఎవరినీ లెక్కచేయనితనాన్ని టెంక ప్రతిబింబిస్తుంది. అటు అలానూ కాకుండా ఇటు ఇలానూ కాకుండా లోపలి తియ్యటి కొబ్బరిముక్కలాగా మనిషి ఉండాలని మరోరకంగా అర్థాన్ని చెప్పేవాళ్లూ ఉంటారు. స్థూలదేహం, సూక్ష్మదేహం, అతిచేతన మనసు, ఆత్మలను ఇది సూచిస్తున్నదని కొందరంటారు. తంత్రవిద్యల్లో చేసే నరబలిని మాన్పించడానికి, దాని స్థానంలో కొబ్బరికాయను కొట్టడం ఆదిశంకరాచార్యులు ప్రవేశపెట్టివుంటారని ఒక కథనం. కొబ్బరిటెంకను శివుడిగానూ, కొబ్బరిని పార్వతీదేవిగా, నీటిని గంగాదేవిగానూ చెబుతారు. హిందువుల వివాహాల్లో ఆకుపచ్చటి కొబ్బరికాయను వధువు పందిట్లోకి మోసుకెళ్తుంది. కొబ్బరి గర్భాన్ని సూచిస్తుందట. మీది పీచు మనిషి జుట్టుకు, పెంకు మనిషి తలకు, కొబ్బరి మెదడుకు, నీళ్లు రక్తానికి ప్రతీకలని చెబుతారు. గుట్టు దాచుకుని కాపురం చేసుకోండని చెప్పడం కూడా కావొచ్చు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి సాధిస్తే తప్ప చేరుకోలేమని చెప్పేందుకు ప్రతీకాత్మకంగా మన పూర్వీకులు ఆలయాలను కొండల మీద నిర్మించారు. దేవుడి దగ్గరికి, ఆ మాటకొస్తే ఎవరిదగ్గరికి వెళ్లినా పువ్వో పండో తీసుకెళ్లడం మర్యాద. మరి కొండెక్కడో ఉంది. ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో దేవుడికి ఏదైనా తీసుకెళ్లాలంటే ఎన్ని రోజులైనా పాడవ్వనిది అయ్యుండాలి. అలా కొబ్బరికాయ పూజల్లోకి వచ్చిందని ఒక కథనం. అభిషేకం కోసమే కొబ్బరి... సృష్టిలో ఎన్నో ఫలాలున్నా వాటిలో కాయ, పండు అవస్థ లేనిది కొబ్బరికాయ మాత్రమే. అది ఎప్పుడూ కాయే! కుళ్లిపోవడం తెలియని కాయ. విత్తనమూ కాయా రెండూ అయిన చెట్టు. దాని పుట్టుకే విశిష్టతతో కూడుకున్నది. షోడషోపచారాల్లో దేవతలకు స్నానం చేయించడం ఒకటి. మనం తాకిన నీళ్లతో చేయించడం అపవిత్రం కాబట్టి, ప్రకృతి ప్రసాదించిన కొబ్బరినీటితో అభిషేకం చేయడాన్ని మన పెద్దవాళ్లు ఆచారంగా ఏర్పరిచారు. నిజానికి బోండాలే వాడాలి. అవి ఎక్కువ దొరక్క కాయలు ఉపయోగిస్తున్నాం. బలి ఇవ్వడమనేది సమయాచారంలో లేదు; వామాచారంలో ఉంది. వామాచారంలో మంత్రాలుండవు, తంత్రాలుంటాయి. అందులో కూడా కూష్మాండబలి(తీపి గుమ్మడికాయ) ఉన్నదేగానీ కొబ్బరిని బలి ఇవ్వమనైతే ఎక్కడా చెప్పలేదు. అహాన్ని బద్దలు కొట్టడంగా కొబ్బరికాయ కొట్టడాన్ని అర్థం చేసుకోవడం అనేది, అన్వయించుకోవడానికి బాగుందిగానీ శాస్త్రప్రమాణం ఉన్నదయితే కాదు. వివాహ సమయంలో వధువు చేతిలో కొబ్బరిబోండాం ఎందుకు పెడతామంటే: కొబ్బరి, అరటి విడి కాయలుగా ఉండవు. అవి గెలలుగా ఉంటాయి. అధిక సంతానానికి సూచిక. అందుకే ఈ రెంటికీ పెళ్లిలో ప్రాధాన్యత ఉంది. పుష్పవతి అయిన అమ్మాయికి వివాహం చేస్తాం కదా! ‘ఇదిగో ఈ పుష్పాన్ని నీకిస్తున్నాం, కొబ్బరిలాగే అనేక ఫలాలను అందించు,’ అని వరుడికి చెప్పడం అది. ఆధ్యాత్మిక ప్రవచకులు అయితే, వీటన్నింటికీ శాస్త్రప్రమాణం ఏమీలేదని కొట్టివేసే పెద్దవాళ్లూ ఉన్నారు. అన్వయింపే జీవితంలో ఉన్న అందం కాబట్టి, మనం ఎన్నిరకాలుగానైనా కొబ్బరి గురించి చెప్పుకోవచ్చు. సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను పక్కకు పెట్టినా- ఏ అరిశెలోనో ఎక్కడైనా చిన్న కొబ్బరిముక్క నాలుక్కి తగులుతూ ఉంటే అందులో రుచి పెరుగుతుంది; ఆరుబయట మంచం వేసుకుని, కొబ్బరాకుల మాటున దాగిన చందమామను చూస్తే జీవితంలోని రుచి అర్థమవుతుంది. మాల్దీవుల జాతీయవృక్షం కొబ్బరిచెట్టు. జాతీయచిహ్నంలో కూడా స్వీకరించారు. కొబ్బరి అత్యధికంగా పండించే తొలి పది దేశాలు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ భారత్ శ్రీలంక బ్రెజిల్ థాయిలాండ్ వియత్నాం మెక్సికో పాపువా న్యూ గినియా మలేషియా స్టాండుల మీద వరుసగా నిలబెట్టివున్న కొబ్బరికాయల్ని ఒక చెక్క బంతితో పడగొట్టే ఆటను విదేశాల్లో ఆడతారు. దాని పేరు కొకొనట్ శై. మన జాతర్లలో రింగులు వేయడం లాంటిదే. పడగొట్టిన కొబ్బరికాయ విజేతదే! - మైలవరపు శ్రీనివాసరావు