భార్య వేధిస్తోందని ...
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
అభిమాన నటుడు అంబరీష్ రావాలని పట్టు
అక్క మాటతో దిగి వచ్చిన వెంకటేష్
మైసూరు : ఆస్తి కోసం భార్య, ఆమె బంధువులు వేధించడంతో భర్త చెట్టెక్కాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తన సమస్య పరిస్కారం కావాలంటే తన అభిమాన నటుడు అంబరీష్ ఘటనా స్థలానికి రావాలని పట్టుబట్టాడు. తాను జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తానని అతని అక్క హామీ ఇవ్వడంతో చెట్టు దిగాడు.
సంచలనం సృషించిన ఈ ఘటన శనివారం మైసూరు నగరంలోని సరస్వతిపురంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు... సరస్వతిపురలో వెంకటేశ్,సుశీల దంపతులు నివాసం ఉంటున్నారు. ఈయనకు చెందిన ఆస్తిపాస్తులను భార్య, ఆమె బంధువులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో వెంకటేశ్ శనివారం ఉదయం 10 గంటలకు తన ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దిగాలని నచ్చజెప్పారు. అందుకు వెంకటేశ్ ససేమిరా అన్నాడు. తన భార్య, ఆమె బంధువులు తనను కొట్టి ఆస్తి పత్రాలు లాక్కున్నారని, ఆస్తి మొత్తం రాసివ్వకపోతే చంపివేస్తామని బెదిరిస్తున్నారని, వారిని వెంటనే ఇక్కడకు తీసుకొచ్చి తనకు న్యాయం చేయాలని, అంతవరకు కిందకు దిగేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు.
రాత్రి ఏ డుగంటలైనా కిందకు దిగకపోవడంతో పోలీసులు చెట్టుపైకి ఎక్కేందుకు యత్నించగా కిందకు దూకుతానని వెంకటేశ్ బెదిరించాడదు. అక్కడే ఉన్న భార్య మాట్లాడుతూ తన భర్తను తాను వేధించలేదని పేర్కొంది. భర్త కిందకు దిగితే సమస్య పరిష్కరించుకుందామని సూచించింది. అయినా వెంకటేశ్ స్పందించలేదు. రాత్రి 7.30గంటల సమయంలో అతని అక్క పుట్ట మహదేవమ్మ వచ్చి నేను మాట్లాడుతా అని చెప్పడంతో వెంకటేష్ రాత్రి 7.30 గంటల సమయంలో కిందికి దిగడంతో పొలిసులు ఊపిరి పిల్చుకున్నారు.
చెట్టు దిగిన వెంకటేష్‌ను పొలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా సినీ నటుడు, ఎంపీ అయిన అంబరీష్‌కు వీరాభిమాన అయిన వెంకటేశ్ 1993లో ఓసారి ఇలా చెట్టు ఎక్కాడు. అప్పట్లో మైసూరు సమీపంలో సినిమా షూటింగ్‌లోఉన్న నటుడు అంబరిష్ విషయం తెలుసుకోని అక్కడికి చేరుకోగా వెంకటేశ్ కిందకు దిగినట్లు స్థానికులు తెలిపారు.