
బొమ్మనహళ్లి(కర్ణాటక): దశాబ్దాల తరువాత కన్నడ రెబల్ స్టార్, నటుడు అంబరీష్ పూర్తిస్థాయి హీరోగా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్నారు. అంబి నింగే మయసాయ్తె (అంబి నీకు మయస్సయింది) అనే సినిమా హీరోగా నటిస్తున్నాడు. మరో విశేషమేమంటే తెలుగులో ఈగ సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైన కిచ్చ సుదీప్ ఈ సినిమాకు నిర్మాతగా, నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె అంబరీష్ తన కుమారుడు అభిషేక్‌గౌడ్‌ను కన్నడ చిత్రరంగానికి పరిచయం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ప్రస్తుతం అంబి నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా సుహాసినిని ఎంపిక చేశారు. ప్రస్తుతం అంబరీష్ భారీ బడ్జెట్ సినిమా కురుక్షేత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బీష్ముడిగా అభిమానుల ముందుకు రాబోతున్నారు.
అభిషేక్ కోసం క్యూ కడుతున్న నిర్మాతలు
అభిషేక్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. రాక్‌లైన్ వెంకటేశ్, కిచ్చ క్రియేషన్స్, ముగుళునగె సినిమా నిర్మాత సయ్యద్ సలాం అంబరీష్‌తో చర్చిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment