‘‘దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ మూవీ తీయాలనే నా కలని తొలి సినిమా ‘పటాస్’తోనే నెరవేర్చుకోగలిగాను. నా బలం ఏంటో విశ్లేషించుకుంటూ, నా గత చిత్రాల ప్రభావం ప్రస్తుత మూవీస్‌పై పడకుండా జాగ్రత్త పడుతూ, ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా కథ రాసుకోవడమే నా సక్సెస్ సీక్రెట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ). ‘పటాస్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి నేటి (జనవరి 23)తో పదేళ్లు. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు.
∙నా పదేళ్ల కెరీర్‌లో నేను చేసిన ప్రతి సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి సినిమాకు ఒకొక్క మెట్టు ఎక్కించి, ఫైనల్‌గా ఈ ‘పొంగల్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఆడియన్స్ నాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఆడియన్స్ నుంచి నాకు లభించిన ప్రేమే నా ఆస్తి. ఆ విషయంలో నేను శ్రీమంతుడిని. ఇక నా కెరీర్‌లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్, వన్ వీక్‌లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.
ఫ్యామిలీ మూవీస్‌కి ఈ బలం ఉందని ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie)తో ఆడియన్స్ స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్ ఇచ్చారనిపిస్తోంది. ‘పటాస్’కు ముందు దర్శకుడ్ని కావడానికి నేను ఎక్కని కాంపౌండ్ లేదు. చాలామంది హీరోలను కలిశాను. నన్ను నమ్మి, కల్యాణ్‌రామ్‌గారు చాన్స్ ఇచ్చారు. అందుకే నా సక్సెస్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.
దర్శకులు ఈవీవీగారితో కొందరు నన్ను పోల్చడాన్ని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. గొప్ప బాధ్యత కూడా. జంధ్యాలగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన నాకో స్ఫూర్తి.
థియేటర్స్ లో ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు. అసలు నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తాను. ప్రతి సినిమాకి ముందు సినిమా తాలూక క్యారెక్టర్స్, రిసంబులెన్స్ పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది.
వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. చిరంజీవిగారితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాను. నాగార్జునగారితో ‘హలో బ్రదర్’లాంటి మూవీ చేయాలని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment