
సాక్షి, సంగెం(వరంగల్): భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి హల్‌చల్ చేసిన సంఘటన సంగెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లికి చెందిన కర్జుగుత్త రమేష్, కవిత గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లో ఉంటున్న వీరి మధ్య కొంతకాలంగా గొడవలు అవుతున్నాయి.
దీంతో కవిత చిన్నకుమారుడితో కలిసి వేరొక చోట ఉంటుంది. భార్య కాపురానికి రావడం లేదని రమేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం పెద్ద మనుషుల సమక్షంలో కలిసి ఉండాలని పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనికి భార్య కవిత కోర్టు నుంచి విడాకులు తీసుకుంటానని చెప్పింది. చిన్న కుమారుడిని సైతం తండ్రి రమేష్ దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ మంగళవారం రాత్రి సంగెం వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా ప్రొబెషనరీ ఎస్సై ప్రియదర్శిని, సిబ్బందితో కలిసి రమేష్‌కు నచ్చచెప్పి కిందకు దింపారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment