ప్రతీకాత్మక చిత్రం
ఖాట్మాండ్ : నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖాట్మాండ్‌లోని సేన్‌చుక్ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజధానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్రీ గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పిన బస్సు 700 మీటర్ల ఎత్తు నుంచి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత వారం రోజుల్లో నేపాల్ జరిగిన రెండో ప్రమాదం ఇది. డిసెంబరు 15న ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో 20మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment