USA: నైట్‌ క్లబ్‌పై కాల్పులు.. 11 మందికి గాయాలు | America Attack Mass Shooting Night Club 11 People Shot Created Panic | Sakshi
Sakshi News home page

USA: నైట్‌ క్లబ్‌పై కాల్పులు.. 11 మందికి గాయాలు

Published Thu, Jan 2 2025 11:51 AM | Last Updated on Thu, Jan 2 2025 12:38 PM

America Attack Mass Shooting Night Club 11 People Shot Created Panic

వాషింగ్టన్‌: నూతన సంవత్సం వేళ అమెరికాలో వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. లూసియానా రాష్ట్రంలో ఓ వాహనంతో ఒక దుండగుడు బీభత్సం సృష్టించి, 15 మందిని పొట్టనపెట్టుకున్న ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది.

న్యూయార్క్‌లోని ఓ నైట్ క్లబ్‌(Night club)లో సామూహిక కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మందిపై కాల్పులు జరిగాయి. గాయాల పాలైనవీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన క్వీన్స్ నగరంలోని అమేజురా నైట్ క్లబ్‌లో చోటుచేసుకుంది. జనవరి ఒకటిన రాత్రి 11:45 గంటల ప్రాంతంలో  ఈ కాల్పులు జరిగాయి. సిటిజన్ యాప్ నివేదిక ప్రకారం కాల్పులకు పాల్పడిన ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నారు. అమేజురా ఈవెంట్ హాల్ జమైకా లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ స్టేషన్‌కు సమపీంలో ఉంది. రాత్రి 11:45 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్ధం వినపడటంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా చుట్టుపక్కల రోడ్లను మూసివేశారు. దీనికిముందు లాస్ వెగాస్‌(Las Vegas)లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల ట్రక్‌లో పేలుడు సంభవించింది. గడచిన 24 గంటల్లో వరుసగా మూడు దాడుల ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.

 


ఇది కూడా చదవండి: అమెరికాలో వరుస ప్రమాదాలు.. ట్రంప్‌, మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement