సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్(స్టోర్మీ డేనియల్స్) అరెస్ట్ వ్యవహారం కలకలం రేపింది. ఒహియో రాష్ట్రంలో ఓ క్లబ్‌లో ఆమె స్ట్రిప్పింగ్ డాన్సులు చేస్తూ.. కొందరితో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణల మేర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది గంటలకే ఆమెపై ఆరోపణలు కొట్టేస్తూ విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది.
కొలంబస్‌లోని సైరెన్స్ జెంటిల్మెన్‌స్ క్లబ్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రిప్పింగ్ డాన్స్ చేస్తూ టాప్ లెస్‌గా ఆమె కస్టమర్లు, అక్కడికొచ్చిన నలుగురు అధికారుల పట్ల ప్రవర్తించిందని ఆరోపణ. వెంటనే స్టోర్మీతోపాటు, మరో ఇద్దరు డాన్సర్లను అరెస్ట్ చేసి జాక్సన్ పైక్ జైలుకు తరలించారు. అయితే ఉదయం ఆ ఆరోపణలను ఎత్తేసిన పోలీసులు.. ఆమెను రిలీజ్ చేయటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కుట్ర కోణం.. స్టెఫానీ క్లిఫోర్డ్.. అమెరికా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. ప్రెసిడెంట్ కాకముందు ఆయన తనతో అఫైర్ నడిపాడని.. ఆ విషయం బయటకు పొక్కకుండా డీల్ కూడా కుదుర్చుకున్నాడని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేసే అరెస్ట్ చేయించారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. డిటెక్టివ్‌లు మారువేషంలో క్లబ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే డ్రగ్స్, వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకే తాము సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు వెల్లడించారు.
కాసేపటికే... స్టోర్మీని అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే పోలీసులు విడుదల చేశారు. ఆరు వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను విడుదల చేశారని, శుక్రవారం ఆమె కోర్టులో సైతం హాజరవుతారని ఆమె తరపు న్యాయవాది మైకేల్ అవెనట్టి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే నైట్ క్లబ్‌లో ఆమె సభ్యత్వం ఉన్న డాన్సర్ కావటంతోనే ఆమెపై ఆరోపణలు కొట్టేసి.. వదిలేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్టెఫానీ పెదవి విప్పాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment