Stormy Daniels
-
హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు. -
US: ట్రంప్ కేసులో శృంగార తార స్టార్మీ సంచలన ప్రకటన
న్యూయార్క్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ఘన విజయం సాధించారు. దీంతో వివేక్ రామస్వామి లాంటి ప్రత్యర్థి ఏకంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ పోటీ నుంచే తప్పుకున్నారు. ఇదిలాఉంటే ట్రంప్‌కు తాజాగా మరో న్యాయపరమైన తలనొప్పి వచ్చి పడింది. శృంగార స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతానని ప్రకటించి పెద్ద బాంబు పేల్చింది. ఈ కేసులో మార్చిలో మన్‌హట్టన్ కోర్టు ముందు హాజరవుతానని చెప్పింది. 2016 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తనకు ట్రంప్ అక్రమ పద్ధతిలో పేమెంట్ ఇచ్చారని, ఇందు కోసం ఆయన తన బిజినెస్ రికార్డులను తారుమారు చేశారని స్టార్మీ ఆరోపిస్తోంది. తనకు ట్రంప్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని గతంలోనే ఆరోపణలు చేసి స్టార్మీ సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆమె కోర్టుకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏం చెబుతుంది దాని పరిణామాలేంటన్నదానిపై ట్రంప్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఇదే కేసులో ట్రంప్ తరపున వాదిస్తున్న అగ్రశ్రేణి న్యాయవాది జో టాకోపినా తాను ఇక ఆయన తరపున వాదించనని సోమవారం కోర్టుకు తెలిపారు. ఒక పక్క అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోతున్న ట్రంప్‌కు కేసుల తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. ఇదీచదవండి.. బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి చర్చలు -
నేరమా? దుష్ప్రవర్తనా?
వివాహేతర సంబంధాన్ని దాచివుంచడానికి అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా 2016లో డోనాల్డ్ ట్రంప్ ఒక మహిళకు డబ్బు ఇచ్చారనే విషయంలో పెద్ద సందేహాలేమీ లేవు. కానీ ఆ ప్రయత్నాలు ప్రత్యేకించి శిక్షాస్మృతిని కూడా ఉల్లంఘించాయా అన్నది కఠిన ప్రశ్న. న్యూయార్క్ రాష్ట్ర చట్టాలను కూడా అవి ఉల్లంఘించాయనే ఆరోపణల ప్రాతిపదికన న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‌పై 34 నేరాలతో కూడిన అభియోగ పత్రం మోపింది. ఈ సంఖ్య కేసు బలం గురించి పేర్కొనలేదు. ప్రాసిక్యూటర్ల వాదన బలమైనదా, కాదా అనే దానిపై ఆధారపడి ఇవి పెరుగుతాయి లేదా తగ్గిపోతాయి. 2016లో అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలబడిన డోనాల్డ్ ట్రంప్, తన వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టకుండా రహస్యంగా ఉంచడానికి, ఆ వ్యవహారంలో పాల్గొన్న మహిళకు డబ్బు చెల్లించి ఆమె నోరు మూయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిపై పెద్దగా సందేహించాల్సిందేమీ లేదు. అయితే ట్రంప్ గురించిన నిజాన్ని ఓటర్లు తెలుసుకోకుండా ఉంచడానికి అధ్యక్ష అభ్యర్థి, ఆయన మిత్రులు వ్యవహరించిన తీరు ఒక అవినీతి ప్రయత్నంగా నిలిచింది. కొత్త సాక్ష్యాలు లేవు నిజానికి, ఆ ప్రయత్నాలు ప్రత్యేకించి శిక్షాస్మృతిని కూడా ఉల్లంఘించాయా అన్నది కఠిన ప్రశ్న. న్యూయార్క్ రాష్ట్ర చట్టాలను అవి ఉల్లంఘించాయనే ఆరోపణల ప్రాతిపదికన న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‌పై 34 నేరాలతో కూడిన అభియోగ పత్రం మోపింది. ఈ నేరాభియోగం కలవరం కలిగించింది. అలాగని ఈ కేసు ప్రాసిక్యూటర్లు ఓడిపోతారని నేను చెప్పడం లేదు. దీంట్లో వారు గెలవొచ్చు, గెలవాలనే భావిస్తున్నాను. ఎందుకంటే, నేరారోపణను నిర్ధారించడంలో వైఫల్యం ట్రంప్‌ను, ఆయన మద్దతుదారులను మరింత రెచ్చగొడుతుంది. తమకు వ్యతిరేకంగా శిక్షాస్మృతి కోరలు పెంచుతున్నారని ట్రంప్ మద్దతుదారులు ఇప్పటికే ప్రకటిస్తు న్నారు కూడా! అయితే అభియోగపత్రంలో దాగిన వాస్తవాలకు సంబంధించి పదే పదే చెబుతున్న విషయాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కొత్త సాక్ష్యాలనూ చూపించడం లేదు. ‘పోర్న్ స్టార్’ స్టార్మీ డేనియల్స్, ‘ప్లేబాయ్’ మాజీ మోడల్ కరెన్ మెక్డౌగల్లతో తనకు ఉన్న సంబంధాల గురించిన సమాచారాన్ని కప్పి పుచ్చడానికి ట్రంప్ ఎన్నుకున్న ‘క్యాచ్ అండ్ కిల్’ పథకాలకు సంబంధించిన పసలేని వివరాలు ఇప్పటికే విస్తృతంగా మీడియాలో ప్రసారమయ్యాయి. 34 అనేది సంఖ్య మాత్రమే! ట్రంప్ తరఫున డేనియల్స్‌కు నగదు చెల్లించినట్లు ట్రంప్ మధ్యవర్తి మైఖేల్ కొహెన్ అంగీకరించి న్యాయస్థానంలో క్షమా భిక్షను కోరారు. ఆ చెల్లింపులు చట్టబద్ధమైనవే అని తప్పుగా వర్ణించి, 1,30,000 డాలర్ల భారీ డబ్బును ఆమెకు చెల్లించినట్లు కొహెన్ ఒప్పుకొన్నారు. ఇతర ఆరోపణలతోపాటు... అమెరికా ఫెడరల్ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించాననీ, ప్రత్యేకించి చట్ట విరుద్ధంగా కార్పొరేట్ సహకారాన్ని అందించాననీ అంగీకరించారు. సహకారం విషయంలో ఉన్న పరిమితులను దాటి నగదు రూపంలో వారికి చెల్లించినట్లు కూడా అంగీకరించారు. అయితే ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. కొహెన్‌ను ప్రాసిక్యూట్ చేసినప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండేవారు. కాబట్టి న్యాయవిభాగం ట్రంప్‌ను విచారించలేదు. ట్రంప్ గద్దె దిగిన తర్వాత కూడా ఆ విచారణను చేపట్టలేదు. న్యూయార్క్ ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు ఇలాంటి ప్రవర్తనను నేరచర్యగా మార్చగలరా అనే ప్రశ్నకు ఇది అవకాశమిచ్చింది. 34 నేరాలు అనడం గురించి మీరు దారి తప్పవద్దు. ఈ సంఖ్య కేసు బలం గురించి పేర్కొనలేదు. ప్రాసిక్యూటర్ల కేసు థియరీ బల మైనదా కాదా అనే దానిపై ఆధారపడి ఇవి పెరుగుతాయి లేదా తగ్గిపోతాయి. విచిత్రమైన స్థితి ఈ కేసుల థియరీ: బిజినెస్ రికార్డులను తప్పుగా మార్చడాన్ని న్యూయార్క్ చట్టం నేరంగా పేర్కొంటోంది. సాధారణంగా ఇది కేవలం దుష్ప్రవర్తన మాత్రమే. అయితే మోసగించే ఉద్దేశ్యంతో, మరొక నేరాన్ని దాచి ఉంచే ఉద్దేశ్యంతో ఇలా ఉన్న పరిస్థితిని మార్చి చెప్పినట్లయితే, అలాంటి చర్య తప్పకుండా నేరంగా మారుతుంది. ఈ కేసులో వాస్తవంగా జరిగింది ఇదేనని మన్ హాటన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్ చెబుతున్నారు. సరే. ట్రంప్ దాచి ఉంచారని చెబుతున్న ఇతర నేరాలు ఏమిటి? నేరాభియోగ పత్రం దీనిపై ఏమీ చెప్పలేదు. కానీబ్రాగ్ కొన్ని అంశాలను ప్రతిపాదించారు. మార్చిన రికార్డులు న్యూయార్క్ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనీ, తప్పుడు ప్రకటనలు చేయడంతో సహా, ఇది చట్టవిరుద్ధ మార్గాల్లో ఒక అభ్యర్థిత్వాన్ని ప్రోత్సహించడానికి చేసిన కుట్రపూరిత నేరమేననీ చెప్పారు. కార్పొరేట్ సహకార పరివతులపై ఫెడరల్ ఎన్నికల చట్టం పరిమితి విధించిందని కూడా ఆయన గుర్తు చేశారు. నేను బ్రాగ్ వాదనను సరిగా అర్థం చేసుకుని ఉన్నట్లయితే– కార్పొరేట్ పుస్తకాలపై తప్పుడు ప్రకటన చేయడం నేరమే తప్ప అది దుష్ప్రవర్తనగా ఉండబోదన్న విషయంలో ఒక విచిత్రమైన వర్తులం ఉంది. ఎందుకంటే తప్పుడు ప్రకటనలు చేయడం వంటి చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అభ్యర్థిత్వాన్ని ప్రమోట్ చేయడం దుష్ప్రవర్తన కిందికి వస్తుందని ప్రభుత్వ ఎన్నికల చట్టం నిర్దేశించింది. అంతకుమించి, ఒక విషయం స్పష్టం కావడం లేదు. ఫెడరల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు (ట్రంప్ అలా చేశారని రుజువైనప్పటికీ) ట్రంప్‌పై ఆరోపించిన దుష్ప్రవర్తన... నేరమే నని రుజువు చేయడం సాధ్యమవుతుందా అన్నది! ఎటూ, రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని ఫెడరల్ ఎన్నికల చట్టం తోసివేస్తుందని ట్రంప్ న్యాయవాదులు వాదిస్తారు. ఏమైనా ఈ కేసుకు సంబంధించి బ్రాగ్ వాదన దృఢంగా రూపొందవచ్చు. రూపొందకపోవచ్చు కూడా! కానీ అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై మోపిన మొట్టమొదటి నేరాభియోగం ఒక భయానక పరిస్థితిని çసృష్టించినట్లు కనిపిస్తోంది. రూత్ మార్కస్ వ్యాసకర్త అసోసియేట్ ఎడిటర్ (‘ద వాషింగ్టన్ పోస్ట్’ సౌజన్యంతో) -
Magazine Story: ట్రంప్ మార్క్ కాంట్రావర్శీ
-
నేనే నేరమూ చేయలేదు
న్యూయార్క్/వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో తనపై నమోదైన క్రిమినల్ నేరాభియోగాలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) అంగీకరించలేదు. తాను ఏ నేరమూ చేయలేదంటూ కోర్టు ముందు వాంగ్మూలమిచ్చారు. ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించిన ఈ సంచలనాత్మక కేసులో మంగళవారం ఆయన మన్హాటన్ క్రిమినల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30కు కోర్టు వద్దకు చేరుకున్నారు. తన లాయర్లతో కలిసి కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. ఆ క్షణమే ఆయన సాంకేతికంగా అరెస్టయినట్టు అధికారులు ప్రకటించారు. ‘మిస్టర్ ట్రంప్! యూ ఆర్ అండర్ అరెస్ట్’ అని చెప్పి పోలీసులు ఆయన్ను లోనికి తీసుకెళ్లినట్టు సమాచారం. అనంతరం విచారణకు ముందు రికార్డుల నిమిత్తం ట్రంప్ వేలిముద్రలు, ఫొటో తీసుకున్నట్టు చెబుతున్నారు. మధ్యాహ్నం 2.30కు 15వ అంతస్తులో ఉన్న కోర్టు గదిలోకి ట్రంప్ ప్రవేశించారు. మామూలుగా నిందితుల మాదిరిగా బేడీలు వేయకుండానే ఆయన్ను జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీక్రెట్ సర్విస్ బాడీగార్డులు ట్రంప్ వెన్నంటే ఉన్నారు. అనంతరం ట్రంప్‌పై దాఖలైన 34 అభియోగాలను జడ్జి జువాన్ మాన్యుయల్ మర్చన్ చదివి విన్పించారు. వాటిలో దేనితోనూ తనకు సంబంధం లేదని ట్రంప్ వాంగ్మూలమిచ్చారు. ప్రతి అభియోగాన్నీ చట్టపరంగా ఎదుర్కొంటారని ఆయన లాయర్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3.30 సమయంలో కోర్టు నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత ఫ్లోరిడా పయనమయ్యారు. శృంగార చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్ (44)తో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు ఆమెకు డబ్బుల చెల్లింపు వ్యవహారం ట్రంప్ మెడకు చుట్టుకోవడం, క్రిమినల్ నేరాభియోగాలకు దారితీయడం తెలిసిందే. అమెరికా చరిత్రలో అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. ఆయన విచారణ సందర్భంగా న్యూయార్క్‌లో మన్హాటన్ జ్యూరీ లేన్ మొత్తం మీడియాతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో మీడియా కంటపడకుండా ఉండేందుకు ట్రంప్ తన కాన్వాయ్‌తో కోర్టు భవనంలోకి వెనకవైపుగా ప్రవేశించారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు విచారణకు మీడియాను కోర్టు గదిలోకి జడ్జి అనుమతించలేదు. అంతేగాక విచారణ ప్రక్రియను ప్రసారం చేయరాదని సోమవారమే ఆదేశాలు జారీ చేశారు. విచారణ మొదలయ్యే ముందు ఫొటోలు తీసుకునేందుకు ఐదుగురు ఫొటోగ్రాఫర్లను మాత్రం అనుమతించారు. భారీ భద్రత అంతకుముందు విచారణ నిమిత్తం సోమవారం రాత్రే ట్రంప్ ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి సొంత బోయింగ్ 757 విమానంలో న్యూయార్క్ చేరుకున్నారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ హడావుడి చేసిన అనంతరం ట్రంప్ టవర్‌లో బస చేశారు. విచారణ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ అధ్యక్షునిగా ఉండగానే హష్ మనీ కేసులో మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం ఆయనపై విచారణ మొదలు పెట్టింది. నేను అరెస్ట్ కాబోతున్నా..అభిమానులకు ట్రంప్ మెయిల్ తనపై కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని ట్రంప్ ఆరోపించారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడకుండా అడ్డుకునేందుకు దేశ చరిత్రలోనే అత్యంత దారుణ రీతిలో తననిలా కేసుల పేరిట ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. విచారణకు బయల్దేరే ముందు తన సోషల్ మీడియా సైట్ ట్రూత్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ దిగజారుతోంది. థర్డ్ వరల్డ్ మార్క్సిస్టు దేశంగా మారుతోంది’’ అంటూ అభిమానులకు పంపిన ఈ మెయిల్‌లోనూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అరెస్టుకు ముందు ఇది నా చివరి మెయిల్’ అని అందులో పేర్కొనడం విశేషం! ‘‘ఏ తప్పూ చేయనందుకు విపక్ష నేతను అధికార పార్టీ అరెస్టు చేస్తోంది. ఈ రోజుతో అమెరికాలో న్యాయం అడుగంటింది’’ అంటూ దుయ్యబట్టారు. విచారణ సజావుగా సాగుతుందని నమ్మకం లేదని ట్రంప్‌తో పాటు ఆయన న్యాయవాది అలీనా హబ్బా కూడా అన్నారు. ట్రంప్ విచారణపై స్పందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ నిరాకరించారు. న్యూయార్క్ పోలీసు శాఖ పనితీరుపై తనకు నమ్మకముందన్నారు. -
నేడు కోర్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) మంగళవారం మన్హటన్ గ్రాండ్ జ్యూరీ ముందు హాజరు కానున్నారు. పోర్న్ చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌తో తన అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు చేసిన చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు మోపుతూ జ్యూరీ గత గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఒక క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. మంగళవారం విచారణ తంతు 10 నుంచి 15 నిమిషాల్లో ముగుస్తుందని చెబుతున్నారు. ట్రంప్‌పై ఏయే అభియోగాలు మోపిందీ ఆయనకు చదివి వినిపిస్తారు. అనంతరం ట్రంప్ ఫ్లోరిడా వెళ్లి మంగళవారం రాత్రి మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసును విచారిస్తున్న ప్రాసిక్యూటర్‌తో పాటు జడ్జిపైనా ట్రంప్ ఆరోపణలతో విరుచుకుపడ్డారు! ‘‘ఈ కేసు కేవలం నాపై కక్షపూరిత చర్యే. దీన్ని విచారిస్తున్న జడ్జికి నేనంటే అమిత ద్వేషం. కేసును దర్యాప్తు చేస్తున్న జిల్లా అటార్నీ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీకి చెందినవాడు. ఏరికోరి నన్ను ద్వేషించే జడ్జినే విచారణకు ఎంచుకున్నారు’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. క్రిమినల్ విచారణకు దారితీయగల పలు ఇతర అభియోగాలను కూడా ట్రంప్ ఇప్పటికే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
ముద్దాయి ట్రంప్!...రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత?
న్యూయార్క్: అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ గ్రెగరీ క్లిఫర్డ్)తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది. ట్రంప్ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్‌హట్టన్ అటార్నీ జనరల్ అల్విన్ బ్రాగ్ మాట్లాడారు. ట్రంప్ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్ సూచించారు. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తనను అరెస్ట్ చేస్తారని, అదే జరిగితే రిపబ్లికన్ శ్రేణు లు, తన అభిమానులు దేశవ్యాప్తంగా ఘర్షణలకు దిగాలని కూడా గత వారం ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వేలి ముద్రలు, ఫొటో తీసుకొని... ట్రంప్ కోర్టులో లొంగిపోతే ఆయన అరెస్ట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ న్యూయార్క్ అధికారులకి సహకరిస్తారని ఆయన తరఫు లాయర్ స్పష్టం చేయడంతో ఆయనపై ఎలాంటి అరెస్ట్ వారెంట్లు జారీ చేయలేదు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్‌కి సొంతంగా విమా నం ఉంది. న్యూయార్క్‌లో ఏదైనా విమానాశ్రయానికి తన విమానంలో వెళ్లి అక్కడ్నుంచి మన్‌హట్టన్ కోర్టు హాలుకి కారులో వెళతారు. మంగళవారం నాడు ట్రంప్ కోర్టు ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయి. సర్వసాధారణంగా సామాన్య నిందితుల్ని కోర్టులో హాజరు పరచాలంటే వారికి సంకెళ్లు వేసి నడిపించుకుంటూ తీసుకువెళతారు. కానీ ట్రంప్ దేశానికి మాజీ అధ్య క్షుడు కావడంతో అలా జరిగే అవకాశాల్లేవు. మీడి యా కవరేజీకి అవకాశం లేకుండా ట్రంప్‌ని ప్రత్యేక ద్వారం నుంచి లోపలికి అనుమతించే అవకాశాలున్నా యి. క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదు కావడంతో ట్రంప్ వేలిముద్రలు, పోలీసు రికా ర్డుల కోసం ఆయన ఫొటో తీసుకుంటారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడానికి ముందు ట్రంప్‌ని ప్రత్యేక సెల్లో ఉంచే బదులుగా వేరే ఒక గదిలో ఉంచుతారు. ఒక్కసారి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన తర్వాత ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతుందన్నది తెలుస్తుంది. బెయిల్ లభిస్తుందా? ట్రంప్‌పై నేరాభియోగాలు మోపిన న్యూయార్క్ జ్యూరీ ఆ అభియోగాల పత్రాన్ని సీల్ వేసి ఉంచింది. ట్రంప్‌ను అరెస్ట్ చేసిన తర్వాతే సీల్ విప్పుతారు. ఈ కేసుని విచారించే న్యాయమూర్తి స్వయంగా కోర్టు హాలులో నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ఆయనపై ఏయే సెక్షన్ల కింద ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయో అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఆ అభియోగాలను బట్టి ఆయనకు బెయిల్ లభిస్తుందా, లేదా అన్నది స్పష్టమవుతుంది. ట్రంప్‌పై ప్రయాణపరమైన ఆంక్షలుంటాయా, లేదా వంటివన్నీ కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరైన తర్వాతే తేలుతాయి. ఈ కేసులో దోషిగా తేలితే ట్రంప్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. భారీగా జరిమానా కూడా విధిస్తారని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత? రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తనపై మోపిన అభియోగాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే వ్యూహాల్లో ఉన్నారు. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ పరిణామాన్ని రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ప్రచారం చేయడానికి ట్రంప్ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చెయ్యలేకపోతే ట్రంప్ తన ఇమేజ్ మరింత పెరుగుతుందన్న భావనలో ఉన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మద్దతుదారులు ఈ కేసు వల్ల అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి జరిగే లాభంపై ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారు. ‘‘ఇది చాలా చిన్న కేసు. ట్రంప్‌ను వేధించడానికే ఈ కేసుని బయటకు తెచ్చారు’’అని న్యూహ్యాంప్‌షైర్‌లో రిపబ్లికన్ పార్టీ చీఫ్ గ్రెగ్ హగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కావాలంటే పార్టీలో 25 నుంచి 30 శాతం కంటే ఎక్కువ మంది ఆయనకు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది కష్టమని ప్రత్యర్థి శిబిరం భావిస్తోంది. నేరాభియోగాలు ఎదుర్కొన్నా, శిక్షపడి జైలుకి వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయకూడదని అమెరికన్ రాజ్యాంగంలో నిబంధనలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని అధ్యక్ష అభ్యర్థిని చేస్తే అనవసరంగా పార్టీ పరువు పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేరాభియోగాలతో ట్రంప్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయి మరో అభ్యర్థి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. రాజకీయ అణచివేత: ట్రంప్ రాజకీయంగా తనను అణచివేయడానికి డెమొక్రాట్లు ఈ కుట్రకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇదంతా రాజకీయ అణచివేత. దేశ చరిత్రలో ఎన్నికల పరంగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న జోక్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి న్యాయవ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నన్ను లొంగదీసుకోవడానికి డెమొక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసాలు చేశారు. దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి ఇలాంటి అనూహ్యమైన చర్యకి దిగారు. ఒక అమాయకుడిపై అభియోగాలు నమోదు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఏం చెబితే మన్‌హట్టన్ జ్యూరీ అదే చేస్తోంది’’అని ట్రంప్ ఆ ప్రకటనలో విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్ తరఫు లాయర్లు ఆయన ఏ తప్పు చేయలేదని దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసు నేపథ్యం ఇదీ.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ను డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. అధ్యక్షుడిగా తన పరువు తీయకుండా ఉండడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లను అప్పట్లో తన లాయర్ మైఖేల్ కొహెన్ ద్వారా ముట్టజెప్పినట్టు డేనియల్స్ ఆరోపించారు. ఆ ఒప్పందం చెల్లదంటూ 2018లో ఆమె కోర్టుకెక్కారు. 2006 సంవత్సరంలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గోల్ఫ్‌కోర్టులో ట్రంప్ పరిచయమయ్యారని, తనతో గడిపితే ఆయన నిర్వహించే రియాల్టీ షో ’ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించారని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు. ఆ తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడేవారని 2007లో కలిసినప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా గడపడానికి నిరాకరించానని, అందుకే తనకు ఆ షో లో అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశారని తెలిపారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు జ్యూరీ అభియోగాలు నమోదు చేయడంతో డేనియెల్స్ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎన్నో సందేశాలు వస్తున్నా స్పందించలేకపోతున్నానని, సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నానని ట్వీట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ అరెస్టయితే వాట్ నెక్ట్స్? అమెరికాలో కల్లోలం రేగుతుందా?
నన్ను అరెస్ట్ చేస్తారంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కల్లోలం రేగింది. శృంగార తారతో లైంగిక సంబంధాల్ని పెట్టుకొని 2016 ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరెత్తకుండా ట్రంప్ భారీగా డబ్బులు ముట్టజెప్పారన్న కేసును న్యూయార్క్ జ్యూరీ గత కొన్ని వారాలుగా రహస్య విచారణ సాగిస్తోంది. కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ఆయనపై నేరాభియోగాలు నమోదవుతాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ట్రంప్‌పైనున్న కేసు ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ లైంగిక సంబంధాల ఆరోపణలపై కేసు విచారణ జరుగుతోంది. 2006 ఏడాదిలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ట్రంప్ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియెల్స్ ఒకప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. ట్రంప్ నిర్వహించే రియాల్టీ షో ‘ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించి తనతో గడిపారని ఆరోపణలు గుప్పించారు. అప్పుడప్పుడు తనకి ఫోన్ చేసి హనీబంచ్ అని ముద్దుగా పిలిచేవారని చెప్పుకొచ్చారు. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ఆమె ఈ విషయాలపై నోరెత్తకుండా ఉండేందుకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పారట. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కొహెన్ తొలుత ఈ డబ్బులు డేనియెల్స్‌కు చెల్లిస్తే, ఆ తర్వాత ట్రంప్ మైఖేల్‌కి డబ్బులు ఇచ్చారు. మైఖేల్ తనకు డబ్బులు ఇచ్చినట్టుగా డేనియల్స్ చెబుతూ ఉంటే, అవి లాయర్‌కి ఫీజు చెల్లించినట్టుగా ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఏం జరగబోతోంది ? డబ్బులిచ్చి పోర్న్ స్టార్ నోరుమూయించారన్న ఆరోపణలపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఆధారాలన్నీ సేకరించినట్టు తెలుస్తోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆయన మాజీ లాయర్ కోహెన్ సాక్ష్యమిచ్చారు. డేనియెల్స్‌కు డబ్బులు ఇచ్చినట్టుగా కోర్టు ఎదుట అంగీకరించారు. మైఖేల్ కోహెన్‌కు లీగల్ అడ్వైజర్‌గా పని చేసిన రాబర్ట్ కోస్టెల్లో ఇన్నాళ్లూ ట్రంప్‌కు వ్యతిరేకంగా జ్యూరీలో మాట్లాడి ఇప్పుడు ఎదురు తిరిగినట్టుగా తెలుస్తోంది. ట్రంప్‌కి అనుకూలంగా సాక్ష్యమిచ్చినట్టుగా సమాచారం. ట్రంప్ కోర్టుకి హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రాండ్ జ్యూరీ ఏం చెయ్యాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒక కేసులో నిందితుడిని దోషిగా లేదంటే నిరపరాధిగా తేల్చే అధికారం గ్రాండ్ జ్యూరీకి ఉండదు. కేవలం ఆధారాలు సేకరించి నేరాభియోగాలు మోపగలదు. అయితే మన్హటన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఆధారాలుంటే నిందితుడ్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసుని నమోదు చేస్తారు. అదే జరిగితే తొలిసారి క్రిమినల్ కేసులుఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ అవుతారు. ఈ అభియోగాలు రుజువై ట్రంప్ దోషిగా తేలితే నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడతానని ప్రకటించిన ట్రంప్ ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. దేశాధ్యక్షుడిగా పోటీ పడే వ్యక్తి నేరచరిత్ర, జైలు జీవితం వంటి అంశాలపై అమెరికా రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. దీంతో జైలు శిక్ష అనుభవిస్తూ అధ్యక్షుడయ్యే అవకాశం అభ్యర్థికి ఉంది. సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ ఈ నేరారోపణలు నైతికంగా ట్రంప్‌ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిమినల్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి ఓట్లు అడగడం, చర్చా కార్యక్రమంలో పాల్గొనడం వంటివి ప్రజల ఎదుట ఆయన స్థాయిని తగ్గిస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ దాడుల్ని తలపిస్తాయా? ట్రంప్ అరెస్ట్‌యితే దేశంలో ఆయన అనుచరులు ఎలాంటి పరిస్థితులు సృష్టిస్తారోనన్న ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ తాను అరెస్ట్ అవుతానని, అందరూ నిరసనలకు దిగాలంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అశాంతిని రేపుతోంది. దేశాన్నే చంపేస్తోంది. ఇదే తగిన సమయం. మనందరం మేల్కోవాలి. గట్టిగా నిరసనకు దిగాలి’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. 2021 జనవరిలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఎన్నికల్లో అక్రమాల కారణంగానే తాను ఓడిపోయాయని ట్రంప్ భావించడం, ఆయన అనుచరులు అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి, హింసాకాండతో దేశం అట్టుడికిపోయింది. ఈసారి ట్రంప్ అనుచరులు న్యూయార్క్ కోర్టుపై దాడులకు తెగబడతారన్న అనుమానాలున్నాయి. మన్హటన్ న్యాయవాది బ్రాగ్ న్యూయార్క్ పోలీసులతో మాట్లాడి కోర్టుకు కట్టుదిట్టమైన భద్రత కలి్పంచాల్సిందిగా రాసిన లేఖ ఒకటి మీడియాకు లభ్యమైంది. కోర్టులు, ఇతర కార్యాలయాలపై ఎవరి కన్ను పడినా, వారిని పూర్తిగా విచారించే ప్రయత్నంలో పోలీసు యంత్రాంగం ఉంది. ట్రంప్ ఎదుర్కొంటున్న ఇతర కేసులు ♦ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ప్రభుత్వ రహస్య పత్రాలను ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తీసుకునివెళ్లారన్న ఆరోపణలపై కేసు విచారణ కొనసాగుతోంది. ♦ అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాతఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్అనుచరులు 2021 జనవరి 6నఅమెరికన్ క్యాపిటల్ భవనంపై దాడి చేసి హింసాకాండ సృష్టించిన కేసు. ♦ 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేలా ట్రంప్, ఆయన అనుచరులబృందం నడుచుకున్నట్టు నమోదైన కేసు. -
ట్రంప్‌తో ఉన్న క్షణాలు అత్యంత చెత్త సమయం: పోర్న్‌స్టార్
వాషింగ్టన్: గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు అఫైర్ ఉందని ప్రకటించి సంచలనం సృష్టించిన అడల్ట్ స్టార్ స్టోమీ డేనియల్స్ మరో సారి వార్తల్లో నిలిచారు. ట్రంప్‌తో గడిపిన ఆ 90 సెకన్లు తన జీవితంలో అత్యంత చెత్త సమయం అన్నారు. అలాంటి వ్యక్తిని కలిసినందుకు తన మీద తనకే అసహ్యం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘2006లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నాకు అఫైర్ ఉండేది. అయితే నేను అతడితో శృంగారాన్ని కోరుకోలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఓ సారి ఆ సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడేప్పుడు ఆ గదిలో నుంచి బయటకు వద్దామా అని ఎదురు చూశాను. ఆ 90 సెకన్ల కాలం నా జీవితంలో అత్యంత చెత్త సమయం. అతడిని కలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది’’ అన్నారు. పోడోకాస్ట్ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్‌తో మాట్లాడుతూ డేనియల్స్ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ట్రంప్ వీటిని కొట్టి పారేశారు. చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..? ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా? -
ఆమెది ‘గుర్రంమొహం’: ట్రంప్
వాషింగ్టన్: తనకు వ్యతిరేకంగా కోర్టు కెక్కిన నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌ను గుర్రంమొహం అంటూ దూషించడంతోపాటు అంతు చూస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. ట్రంప్‌పై డేనియల్స్ వేసిన పరువు నష్టం కేసును కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు జడ్జి కొట్టేశారు. కేసుకు అయిన ఖర్చును ట్రంప్‌కు చెల్లించాలని ఆమెను ఆదేశించారు. ఈ తీర్పుపై ట్రంప్ స్పందించారు. ‘ఇప్పుడిక ఆ గుర్రంమొహం సంగతి, ఆమె తరఫున వాదించిన లాయర్ సంగతి చూస్తా. ఆమెకు నా గురించి తెలియదు’ అంటూ ట్రంప్ ట్విట్టర్ ద్వారా బెదిరించారు. 2006లో ట్రంప్ తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని స్టార్మీ ఆరోపించిన విషయం తెలిసిందే. 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయం బయట పెట్టకుండా ఉండేందుకు తనకు 1.30 లక్షల డాలర్లు లాయర్ ద్వారా ట్రంప్ చెల్లించారని గతంలో చెప్పారు. -
శృంగార తారకు చెల్లింపులు నిజమే
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన మాజీ సహాయకులు ఇద్దరు వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలారు. 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌తో సంబంధాలపై నోరెత్తకుండా ఉండేందుకు శృంగారతార స్టార్మీ డేనియెల్స్‌కు భారీగా చెల్లించినట్లు ట్రంప్ మాజీ లాయర్ మైకేల్ కోహెన్ మంగళవారం కోర్టులో అంగీకరించారు. మోసం కేసులో ట్రంప్ ఎన్నికల మాజీ ప్రధాన ప్రచారకర్త పాల్ మనాఫోర్ట్ కూడా దోషిగా తేలారు. ట్రంప్‌తో అక్రమ సంబంధాలకు సంబంధించి ఇద్దరు మహిళల నోరు మూయించిన కేసులో కోహెన్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది. పన్ను ఎగవేత, బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రచార సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడటం తదితర కేసుల్లోనూ ఆయన దోషిగా తేలారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థితో సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడి ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న ఇద్దరు మహిళలకు 2.80 లక్షల డాలర్లు చెల్లించినట్లు కోహెన్ ఒప్పుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థి సూచనల మేరకే ఈ చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ఇక్కడ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కాగా, చెల్లింపులు స్వీకరించిన వారిలో ఒకరు డేనియల్స్, మరొకరు ట్రంప్ మాజీ శృంగార భాగస్వామి అని భావిస్తున్నారు. ఈ ఆరోపణల్లో లాయర్లు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ‘ఇండివిజువల్ 1’ అని పేర్కొన్నారు. కోహెన్‌కు శిక్షను డిసెంబర్ 12న ఖరారుచేయనున్నారు. ముల్లర్‌కు విజయం.. మరోవైపు, ట్రంప్ మాజీ ప్రధాన ప్రచారకర్త మనాఫోర్ట్.. 5 పన్ను ఎగవేత కేసులు, రెండు బ్యాంకు మోసాల కేసులో, విదేశీ బ్యాంకు వివరాలు వెల్లడించడంలో విఫలమైన ఒక కేసులో దోషిగా తేలారు. మరో 10 కేసుల్లో తీర్పుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విచారణ సరిగా జరగలేదని జడ్జీలు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై మాజీ లాయర్ రాబర్ట్ ముల్లర్ చేపట్టిన విచారణలో మనాఫోర్ట్, కోహెన్‌లు పాల్పడిన అవకతవకలు వెలుగుచూశాయి. విచారణను ముగించాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ముల్లర్‌కు తాజా పరిణామాలు గొప్ప విజయంతో సమానం. కోహెన్ దోషిగా తేలడంపై మాట్లాడేందుకు నిరాకరించిన ట్రంప్..పాల్ మనాఫోర్ట్ చాలా మంచి వ్యక్తి అని, ఆ కేసుతో తనకేం సంబంధం లేదని అన్నారు. -
విడాకులు తీసుకుంటున్న ఆ పోర్న్‌స్టార్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు శారీరక సంబంధాలున్నాయని ఆరోపించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఒహియో రాష్ట్రంలో ఓ క్లబ్లో ఆమె స్ట్రిప్పింగ్ డాన్సులు చేస్తూ.. కొందరితో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణలతో అరెస్ట్ అయి కొన్ని గంటల్లోనే విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగిన కారణంగా అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. భర్త బ్రెండన్ మిల్లర్ (అసలుపేరు గ్రెండన్ క్రెయిన్), స్టార్మీ డేనియల్స్ విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అడల్ట్ స్టార్ తరపు న్యాయవాది మైఖెల్ అవెనట్టి మాట్లాడుతూ.. ‘నా క్లయింట్ స్టార్మీ డేనియల్స్, ఆమె భర్త గ్లెన్ విడాకులకు మొగ్గు చూపారు. విడాకులు కోరుతూ ఈ జంట గతవారం పిటిషన్ దాఖలు చేసింది. అభిప్రాయభేదాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకున్నారు. కూతురు తన వద్దే ఉంటుందని స్టార్మీ చెప్పారు. కుటుంబం కోసం తనకు ప్రైవసీ కావాలని కోరుతున్నట్లుగా’ వివరించారు. బ్రెండన్ మిల్లర్ కూడా పలు అడల్ట్ సినిమాల్లో నటించాడు. నిజం నిగ్గుతేలాలి అధ్యక్షుడు ట్రంప్‌తో తన శారీరక సంబంధాల ఆరోపణలపై నిగ్గు తేలాలన్నారు. అంతేకానీ నాకు ఈ విషయంలో ఎలాంటి రాజీమార్గాలు అవసరం లేదు. నేను దేనికీ భయపడను. 2006లో తనతో ట్రంప్ నెరిపిన సంబంధాలపై గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎవరితోనూ బయటపెట్టొద్దని 1,30,000 డాలర్లకు భేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కానీ ఓ వ్యక్తి తనను బెదిరించిన కారణంగా 10ఏళ్ల తర్వాత ఈ విషయాలు బహిర్గతం చేయాల్సి వచ్చిందని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ వెల్లడించారు. -
పోర్న్‌స్టార్ అరెస్ట్.. అంతలోనే...
సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్(స్టోర్మీ డేనియల్స్) అరెస్ట్ వ్యవహారం కలకలం రేపింది. ఒహియో రాష్ట్రంలో ఓ క్లబ్లో ఆమె స్ట్రిప్పింగ్ డాన్సులు చేస్తూ.. కొందరితో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణల మేర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది గంటలకే ఆమెపై ఆరోపణలు కొట్టేస్తూ విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది. కొలంబస్‌లోని సైరెన్స్ జెంటిల్మెన్స్ క్లబ్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రిప్పింగ్ డాన్స్ చేస్తూ టాప్ లెస్‌గా ఆమె కస్టమర్లు, అక్కడికొచ్చిన నలుగురు అధికారుల పట్ల ప్రవర్తించిందని ఆరోపణ. వెంటనే స్టోర్మీతోపాటు, మరో ఇద్దరు డాన్సర్లను అరెస్ట్ చేసి జాక్సన్ పైక్ జైలుకు తరలించారు. అయితే ఉదయం ఆ ఆరోపణలను ఎత్తేసిన పోలీసులు.. ఆమెను రిలీజ్ చేయటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుట్ర కోణం.. స్టెఫానీ క్లిఫోర్డ్.. అమెరికా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. ప్రెసిడెంట్ కాకముందు ఆయన తనతో అఫైర్ నడిపాడని.. ఆ విషయం బయటకు పొక్కకుండా డీల్ కూడా కుదుర్చుకున్నాడని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేసే అరెస్ట్ చేయించారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. డిటెక్టివ్లు మారువేషంలో క్లబ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే డ్రగ్స్, వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకే తాము సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. కాసేపటికే... స్టోర్మీని అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే పోలీసులు విడుదల చేశారు. ఆరు వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను విడుదల చేశారని, శుక్రవారం ఆమె కోర్టులో సైతం హాజరవుతారని ఆమె తరపు న్యాయవాది మైకేల్ అవెనట్టి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే నైట్ క్లబ్లో ఆమె సభ్యత్వం ఉన్న డాన్సర్ కావటంతోనే ఆమెపై ఆరోపణలు కొట్టేసి.. వదిలేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్టెఫానీ పెదవి విప్పాల్సి ఉంది. -
ఆమె పోర్న్‌స్టార్.. ఆమె మాటలు నమ్మొద్దు!
వాషింగ్టన్ : తన మాజీ లాయర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓ కీలుబొమ్మగా మారిపోయాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ అన్నారు. డేనియల్స్ పోర్న్‌స్టార్ అని, ఆమె మాటల్ని ఎవరు నమ్మవద్దని ట్రంప్ లాయర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. ట్రంప్‌తో తనకు గతంలో శారీరక సంబంధాలున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయాలు బహిర్గతం చేయకుండా ఉండేందుకు అధ్యక్షుడు ట్రంప్ లాయర్ మైఖెల్ కోహెన్ మధ్యవర్తిత్వంతో 1,30,000 అమెరికన్ డాలర్లు తనకు ఆఫర్ చేశారని ఆమె అన్నారు. కాగా, ట్రంప్‌తో సంబంధాలు బయట పెట్టినందుకు న్యూయార్క్ మాజీ మేయర్, ట్రంప్ లాయర్ రుడీ గిలియానీ, డేవిడ్సన్ తనను ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. తనపై నిఘా ఉంచిన ట్రంప్ మద్దతుదారులు తన ఫోన్‌కాల్స్‌ను రహస్యంగా రికార్డ్ చేశారని తాజాగా ఆరోపించారు. ప్రణాళికా ప్రకరమే తనపై, తన లాయర్ మైఖెల్ అవెనట్టిపై లేని వదంతులు ప్రచారం చేస్తున్నారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మండిపడ్డారు. స్టార్మీ డేనియల్స్ లాయర్ అవెనట్టి మాట్లాడుతూ.. ట్రంప్ లాయర్ గిలియానీ ఓ పంది అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో శారీరక సంబంధాలు స్టార్మీ డేనియల్స్ కొనసాగించడం వాస్తవమేనన్న అవెనట్టి, డేవిడ్సన్ ఈ నిజాన్ని అవాస్తవంగా చిత్రీకరిండానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. -
ట్రంప్ వార్నింగ్.. నువ్వు ఒంటరిగా ఉండొద్దు!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో తనకు శారీరక సంబంధాలున్నాయని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే వారి బంధాన్ని బయటకు వెల్లడిస్తే హత్య చేస్తానంటూ ట్రంప్ నుంచి స్టార్మీ డేనియల్స్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయట. ఈ విషయాన్ని మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకే తాజాగా వెల్లడించారు. ట్రంప్ వ్యక్తులు కొందరు తనకు తరచుగా కాల్స్ చేసి లైంగిక సంబంధాలను వెల్లడించవద్దని బెదిరించారని 2011లోనే స్టార్మీ డేనియల్స్ తనకు చెప్పినట్లుగా జెస్సికా గుర్తు చేసుకున్నారు. ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని బహిర్గతం చేసిన కారణంగా తనకు ఏదైనా జరుగుతుందోనని స్టార్మీ డేనియల్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నటి తెలిపారు. ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకు కచ్చితంగా ముప్పు ఉంటుందని డేనియల్స్ తనను హెచ్చరించినట్లు నటి జెస్సికా వివరించారు. ట్రంప్‌తో తన సంబంధాల వివరాలు వెల్లడించి, కొంతమేర నగదు తీసుకోవడానికి ఓ మ్యాగజైన్‌తో స్టార్మీ డేనియల్స్ డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని స్వయంగా వెల్లడించారు. అయితే తొలుత ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు బుధవారం గిలియాని ఇటీవల స్పష్టం చేశారు. అయితే తాజాగా పోర్న్‌స్టార్ జెస్సికా ట్రంప్ వ్యవహారాన్ని బయటపెట్టారు. ట్రంప్‌తో సంబంధాలు బహిర్గతం చేస్తానంటేనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అలాంటిది ఆయన అసభ్యంగా ప్రవర్తించారని చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ నటి ఆందోళన వ్యక్తం చేశారు. (ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి) -
పోర్న్‌స్టార్‌తో డీల్ నిజమే: ట్రంప్
వాషింగ్టన్: పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆమెతో జరిగిన డీల్ గురించి తనకూ తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీటర్లో ఆయన వరుస ట్వీట్లు చేశారు. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారంటూ న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని వెల్లడించిన మరుసటి రోజే ట్రంప్ ఈ ట్వీట్లు చేయటం గమనార్హం. ‘ఇది ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారం. నా లాయర్‌గా పనిచేసిన కోహెన్ ఆమెకు డబ్బు చెల్లించారు. వారిద్దరి మధ్య రహస్యంగా జరిగిన ఒప్పందం ఇది. ప్రైవేట్ ఒప్పందాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. సంపన్నుల మధ్య ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అంతేగానీ ఆమె ఆరోపిస్తున్నట్లు ఎలాంటి లైంగిక సంబంధం లేదు.’ అంటూ ట్రంప్ ట్వీట్లు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడా తన ప్రమేయం ఉన్నట్లు ఆయన పేర్కొనకపోవటం విశేషం. ట్రంప్ తనతో కొంత కాలంపాటు(2006లో) లైంగిక సంబంధం నడిపారని, ఆ విషయం బయటపెట్టొద్దంటూ తన లాయర్ ద్వారా ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ ప్రకంపనలు రేపారు. ఈ ఆరోపణలపై ట్రంప్ స్పందిస్తూ.. అవి వాస్తవం కాదని కొట్టిపారేశారు. ఇక ఇప్పుడు ఒప్పందం మాట వాస్తవమేనని చెప్పటంతో వ్యవహారం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు లాయర్ కోహెన్ ద్వారా ట్రంప్ 1,30,000 డాలర్లకు ఈ డీల్ కుదిర్చారు. ఆపై కొన్ని నెలల తర్వాత ట్రంప్ ఆ నగదును కోహెన్‌కు ఇచ్చి వేశారు. అయితే అది ఆయన వ్యక్తిగత నగదో.. లేక ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో తనకు తెలిదని రుడీ గిలియానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోర్న్‌స్టార్ ఎన్నికలకు పనిచేసి ఉంటే అది ప్రచారం చేసినందుకు ఇచ్చిన మొత్తంగా భావించవచ్చే వాళ్లమని.. కానీ, అలాంటిది జరగలేదంటూ రుడీ గిలియాని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు స్పష్టమౌతోంది. -
ట్రంప్ బండారం మళ్లీ బట్టబయలు!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) చేస్తున్న ఆరోపణలు నిజమని తేలింది. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని వెల్లడించారు. అయితే తొలుత ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు బుధవారం గిలియాని తెలిపారు. ఇటీవల ట్రంప్ న్యాయనిపుణుల బృందంలో రుడీ గిలియాని చేరిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా ఫాక్స్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 2016 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీల్ కుదిరింది. అయితే ట్రంప్ తన వద్ద చాలాకాలం నుంచి పనిచేస్తున్న లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ఒప్పందం చేసుకున్న నగదును ఇప్పించారు. ఆపై కొన్ని నెలల తర్వాత ట్రంప్ ఆ నగదును కోహెన్‌కు ఇచ్చి వేశారు. అయితే అది ఆయన వ్యక్తిగత నగదో.. లేక ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో తనకు తెలియదన్నారు. పోర్న్‌స్టార్ ఎన్నికలకు పనిచేసి ఉంటే అది ప్రచారం చేసినందుకు ఇచ్చిన మొత్తంగా భావించవచ్చునని, అలాంటిది జరగలేదంటూ రుడీ గిలియాని స్పష్టం చేశారు. కాగా, 2006లో తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని గోప్యంగా ఉంచాలంటూ ట్రంప్ తన లాయర్ కోహెన్ ద్వారా 2016లో 1,30,000 డాలర్లకు తనతో ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ ప్రకంపనలు రేపారు. అయితే ట్రంప్ ఇటీవల దీనిపై స్పందిస్తూ.. లైంగిక సంబంధం అవాస్తమని, డీల్ అనే ప్రసక్తే లేదని తనపై వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. మరోవైపు వైట్‌హౌజ్ గత కొద్దిరోజులు నుంచి ట్రంప్-డేనియల్స్ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ వరుస ప్రకటన విడుదల చేస్తోంది. -
ఆమె మాత్రం స్పందించరేం?
వాషింగ్టన్: ఓ వైపు నుంచి లైంగికపరమైన ఆరోపణలు .. మరోవైపు మాజీ ఉద్యోగుల తీవ్ర విమర్శలు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఊపిరి సలపనివ్వటం లేదు. వేటిపై కూడా స్పష్టత ఇవ్వకుండా ‘నో’ ఒక్క సమాధానంతోనే దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ మీడియా ఛానెళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ భార్య- అమెరికా ప్రప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటిదాకా పెదవి విప్పకపోవటం గమనార్హం. ఈ వ్యవహారాలపై మీడియాకు తారసపడినప్పుడల్లా ఆమె మౌనంగా ఉండటమో లేక తప్పించుకుని తిరగటమో లాంటివి చేస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె హాజరుకాగా.. మీడియా తారసపడకుండా భద్రతా సిబ్బంది గట్టి ప్రయత్నాలే చేశారు. గతంలో ట్రంప్ వ్యాపార విషయాల్లో.. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. మెలానియా చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. అలాంటిది పోర్న్ స్టార్ స్ట్రోమీ డేనియల్స్ వ్యవహారం, తాజాగా ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమే.. ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఆమె స్పందించటం లేదు. ఒకానోకదశలో కనీసం సోషల్ మీడియా మాధ్యమంగా ఆమె ఖండించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ట్రంప్ బాగోతాల గురించి పూర్తిగా తెలిసిన ఆమె తన మౌనంతోనే భర్తకు శిక్ష విధించేసి ఉంటుందంటూ అమెరికన్ మాగ్జైన్లు వరుస కథనాలు ప్రచురించేస్తున్నాయి. -
పోర్న్‌స్టార్‌తో డీల్‌పై పెదవి విప్పాడు
వాషింగ్టన్ : పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ చేస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెదవి విప్పారు. ఆమెతో తాను డీల్ కుదుర్చున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. స్టెఫానీ క్లిఫార్డ్(స్టోర్మీ డేనియల్స్)కు మీ లాయర్ మైకేల్ కోహెన్ మీ తరపున డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకున్న మాట వాస్తం కాదా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ‘ఆ విషయాన్ని మైకేల్ కోహెన్నే అడగండంటూ’ ట్రంప్ బదులిచ్చారు. ఇక ఒప్పందం నిజం అవునా? కాదా? సూటిగా చెప్పండన్న మరో ప్రశ్నకు.. ‘లేదు’ అని చెప్పారు. అలాగైతే ఆమెకు డబ్బు ఎవరు ఇచ్చారు? అన్న ప్రశ్నకు.. ‘నాకేం తెలీదు’ అనే సమాధానం ట్రంప్ వద్ద నుంచి వచ్చింది. కోహెన్ నా అటార్నీ మాత్రమే అంటూ ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు వైట్‌హౌజ్ గత కొద్దిరోజులు నుంచి ట్రంప్-డేనియల్స్ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ వరుస ప్రకటన విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే తనతో లైంగిక సంబంధాన్ని గోప్యంగా ఉంచాలంటూ ట్రంప్ తన లాయర్ కోహెన్ ద్వారా 2016లో 1,30,000 డాలర్లకు తనతో ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ పెను చర్చకు దారితీసింది. అయితే ఆ ఒప్పందం మాట వాస్తవమేనని స్వయానా కోహెన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించటం విశేషం. అది జరిగిన కొద్దిరోజులకే ప్లే బాయ్ మోడల్(మాజీ) కరెన్ మెక్‌డౌగల్(46) కూడా ట్రంప్ తనతో శారీరక సంబంధం నెరిపినట్లు ఆరోపించింది. -
టీవీలో ఆమె రచ్చ.. 1600 కి.మీ దూరంలో ట్రంప్
న్యూయార్క్ : తనపై ఆరోపణలు వచ్చిన కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో లేకుండా పోయారు. తనకు ట్రంప్‌కు శారీరక సంబంధం ఉందని చెప్పడమే కాకుండా.. ఆ విషయం బయటకు చెబితే ట్రంప్ తనను చంపేస్తానని బెదిరించారంటూ పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్ చెప్పే సందర్భంలో ఆ లైవ్ చూడకుండా మిస్సయ్యారు. దాదాపు 60 నిమిషాలు ప్రత్యక్ష ప్రసారం అయిన ఆ ఇంటర్వ్యూను ట్రంప్‌గానీ, ఆయన భార్య మిలానియా ట్రంప్‌గానీ చూడలేదని, ఆ సమయంలో వారు వెయ్యి మైళ్ల (1609.34 కిలోమీటర్ల) దూరంలో ఉన్నారని శ్వేతసౌదం ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోగల మార్ ఏలాగో ఎస్టేట్‌లో ట్రంప్ గత వారం రోజులుగా సేద తీరుతున్నారని, వేసవి విడిదిలో భాగంగా అక్కడికి వెళ్లినట్లు వెల్లడించింది. మిలానియా ట్రంప్ కూడా కూడా శుక్రవారం ఫ్లోరిడా వెళ్లారని, ఆమె కూడా అక్కడే ఉన్నారని, ప్రస్తుతం వారు వచ్చే సమయానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. స్టామీ ఇంటర్వ్యూ జరిగిన చోటుకు ప్రస్తుతం ట్రంప్ వాళ్లు ఉన్న ప్రదేశానికి సరిగ్గా 1600 కిలోమీటర్ల పైనే ఉంటుందట. సేద తీరే సమయం అయినందున ఎలాంటి అంశాలు వారి ఏకాంతానికి భంగం కలిగించకుండా ఉండే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్‌కు తనకు శారీరక సంబంధం ఉందని, అది బయటపెట్టొద్దని నన్ను బెదిరించారని, చంపుతామన్నారని పోర్న్‌స్టార్ స్టామీ 60 నిమిషాలపాటు ఆదివారం ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. -
పోర్న్‌స్టార్‌ను చంపేస్తానన్న ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంటి పోరుకంటే వీధిపోరు ఎక్కువవుతోంది. ఆయనతో తమకు శారీరక సంబంధం ఉందంటూ ఆరోపిస్తున్న మహిళలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం చెబుతున్నారు. మొన్నటికి మొన్న తమది పది నెలల బంధం అని పెళ్లి వరకు వెళుతుందని ఆశపడ్డానని ప్రముఖ మేగజిన్ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా.. తాజాగా పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విషయం మరిచిపోవాలని, లేదంటే చంపేస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారని ఆమె వెల్లడించారు. తొలిసారి సీబీఎస్ చానెల్లో ప్రముఖ జర్నలిస్టు ఆండర్సన్ కూపర్‌కు ఆమె 60 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ప్రత్యక్ష ప్రసారం అయింది. అందులో పలు విషయాలు వెల్లడించారు. ‘ డోనాల్డ్ ట్రంప్‌కు నాకు ఉన్న శారీరక సంబంధం బయటపెట్టొద్దని నన్ను బెదిరించారు. చంపుతామని హెచ్చరించారు. ఆ అనుభవం నేనిప్పటికీ మరిచిపోలేదు. వాస్తవానికి మా సెక్సువల్ రిలేషన్ సీక్రెట్‌గా ఉంచాలని ట్రంప్ ఎప్పుడూ నాకు చెప్పలేదు. కానీ, ఈ విషయంలో మార్పు వచ్చింది మాత్రం 2011లో. ఓ మేగజిన్కు మా స్టోరీని నేను 15వేల డాలర్లకు అమ్మేయాలని నిర్ణయించుకొని దానితో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ విషయంలో ట్రంప్ నుంచి స్పందన వచ్చింది. ఆ రోజు నేను పార్కింగ్ లాట్లో ఉన్నాను. నా చంటిబిడ్డతో ఫిట్నెస్ క్లాస్‌కు వెళుతున్నాను. వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ట్రంప్ విషయం వదిలేయ్. ఆ స్టోరీ మొత్తాన్ని మర్చిపో అన్నాడు. నా కూతురును చూస్తూ చాలా చక్కగా ఉంది నీ పాప. ఆ పాప తల్లికి (డానియెల్కే) అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ పాపకు షేమ్‌గా ఉంటుంది.. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఆ సమయంలో నేను ఎంత వణికిపోయానో. క్లాస్‌కు కూడా వెళ్లకుండా బిడ్డను తీసుకొని భయపడుతూ ఇంటికెళ్లాను. ట్రంప్‌ను ఎప్పుడు కలిశానంటే..? ‘2006లో తొలిసారి నేను ట్రంప్‌ను కలిశాను. అప్పుడు ఆయన ఓ హోటల్లో సూట్‌తో ఉన్నారు. ఆ రోజే మేం తొలిసారి శారీరకంగా దగ్గరయ్యాం. ట్రంప్ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. మీరు అసలు అతడిని ఊహించలేరు. ఆ రోజు హోటల్‌ను నన్ను చూసి.. వావ్ నువు చాలా అందంగా ఉన్నావ్.. తెలివైనదానిలా ఉన్నావ్ అన్నాడు. ఆ రోజు అతడు అసురక్షిత శృంగారంలో పాల్గొన్నాడు. వాస్తవానికి నాకంటే అప్పటికే 30 ఏళ్లు పెద్దవాడైన ట్రంప్ నన్ను పెద్దగా ఆకర్షించలేకపోయారు.. కానీ, నేను కాదనలేకపోయాను.. అయితే, బాధితురాలిగా మిగల్లేదు. ఆ తర్వాత కూడా నేను అతడితో టచ్‌లో ఉన్నాను. సరిగ్గా ఎన్నికలకు 11 రోజుల ముందు 2016లో ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దని ఒప్పందం చేసుకున్నారు’ అంటూ పలు విషయాలను డానియెల్ చెప్పింది.