ట్రంప్‌ వార్నింగ్.. నువ్వు ‌ఒంటరిగా ఉండొద్దు! | Donald Trump Threatens Stormy Daniels, Says Jessica Drake | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వార్నింగ్.. నువ్వు ‌ఒంటరిగా ఉండొద్దు!

Published Sat, May 26 2018 11:58 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Donald Trump Threatens Stormy Daniels, Says Jessica Drake - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో తనకు శారీరక సంబంధాలున్నాయని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే వారి బంధాన్ని బయటకు వెల్లడిస్తే హత్య చేస్తానంటూ ట్రంప్‌ నుంచి స్టార్మీ డేనియల్స్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయట. ఈ విషయాన్ని మరో అడల్ట్‌ స్టార్‌ జెస్సికా డ్రాకే తాజాగా వెల్లడించారు. ట్రంప్‌ వ్యక్తులు కొందరు తనకు తరచుగా కాల్స్‌ చేసి లైంగిక సంబంధాలను వెల్లడించవద్దని బెదిరించారని 2011లోనే స్టార్మీ డేనియల్స్‌ తనకు చెప్పినట్లుగా జెస్సికా గుర్తు చేసుకున్నారు. 

ట్రంప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని బహిర్గతం చేసిన కారణంగా తనకు ఏదైనా జరుగుతుందోనని స్టార్మీ డేనియల్స్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు నటి తెలిపారు. ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకు కచ్చితంగా ముప్పు ఉంటుందని డేనియల్స్‌ తనను హెచ్చరించినట్లు నటి జెస్సికా వివరించారు. ట్రంప్‌తో తన సంబంధాల వివరాలు వెల్లడించి, కొంతమేర నగదు తీసుకోవడానికి ఓ మ్యాగజైన్‌తో స్టార్మీ డేనియల్స్‌ డీల్‌ కుదుర్చుకున్నారు. 

అనంతరం జరిగిన పరిణామాల్లో డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని స్వయంగా వెల్లడించారు. అయితే తొలుత ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్‌ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు  1,30,000 డాలర్లు చెల్లించినట్లు బుధవారం గిలియాని ఇటీవల స్పష్టం చేశారు. అయితే తాజాగా పోర్న్‌స్టార్‌ జెస్సికా ట్రంప్‌ వ్యవహారాన్ని బయటపెట్టారు. ట్రంప్‌తో సంబంధాలు బహిర్గతం చేస్తానంటేనే బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, అలాంటిది ఆయన అసభ్యంగా ప్రవర్తించారని చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ నటి ఆందోళన వ్యక్తం చేశారు.
(ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement