Jessica Drake
-
ట్రంప్ వార్నింగ్.. నువ్వు ఒంటరిగా ఉండొద్దు!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో తనకు శారీరక సంబంధాలున్నాయని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే వారి బంధాన్ని బయటకు వెల్లడిస్తే హత్య చేస్తానంటూ ట్రంప్ నుంచి స్టార్మీ డేనియల్స్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయట. ఈ విషయాన్ని మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకే తాజాగా వెల్లడించారు. ట్రంప్ వ్యక్తులు కొందరు తనకు తరచుగా కాల్స్ చేసి లైంగిక సంబంధాలను వెల్లడించవద్దని బెదిరించారని 2011లోనే స్టార్మీ డేనియల్స్ తనకు చెప్పినట్లుగా జెస్సికా గుర్తు చేసుకున్నారు. ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని బహిర్గతం చేసిన కారణంగా తనకు ఏదైనా జరుగుతుందోనని స్టార్మీ డేనియల్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నటి తెలిపారు. ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకు కచ్చితంగా ముప్పు ఉంటుందని డేనియల్స్ తనను హెచ్చరించినట్లు నటి జెస్సికా వివరించారు. ట్రంప్‌తో తన సంబంధాల వివరాలు వెల్లడించి, కొంతమేర నగదు తీసుకోవడానికి ఓ మ్యాగజైన్‌తో స్టార్మీ డేనియల్స్ డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని స్వయంగా వెల్లడించారు. అయితే తొలుత ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు బుధవారం గిలియాని ఇటీవల స్పష్టం చేశారు. అయితే తాజాగా పోర్న్‌స్టార్ జెస్సికా ట్రంప్ వ్యవహారాన్ని బయటపెట్టారు. ట్రంప్‌తో సంబంధాలు బహిర్గతం చేస్తానంటేనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అలాంటిది ఆయన అసభ్యంగా ప్రవర్తించారని చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ నటి ఆందోళన వ్యక్తం చేశారు. (ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి) -
ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు గుప్పిస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శృంగార చిత్రాల నటి(అడల్ట్ యాక్ట్రెస్) జెసికా డ్రాకే తెర ముందుకు వచ్చింది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, తనతో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశారని జెసికా ఆరోపించింది. తనను బలవంతంగా ముద్దు పెట్టారని వెల్లడించింది. ప్రముఖ న్యాయవాది గ్లోరియా ఆల్డ్రెడ్ తో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2006లో కాలిఫ్నోరియాలోని లేక్ టాహోయ్ గోల్ఫ్ టోర్నమెంట్ లో తనకు ట్రంప్ పరిచమయ్యారని జెసికా తెలిపింది. తర్వాత ట్రంప్ ఆహ్వానం మేరకు మరో ఇద్దరు మహిళలతో ఆయన హోటల్ గదికి వెళ్లానని వెల్లడించారు. 'మేము వెళ్లేసరికి ట్రంప్ పైజామా దస్తుల్లో ఉన్నారు. దగ్గరికి వచ్చి ఒక్కొక్కరినీ గట్టిగా కౌగిలించుకున్నారు. మా అనుమతి లేకుండానే ముద్దు పెట్టుకున్నారు. పోర్నోగ్రఫీ గురించి కూడా మాట్లాడారు. అక్కడి నుంచి నా గదికి తిరిగొచ్చాక తాను బసచేసిన హోటల్ గదికి రావాలని మరోసారి ట్రంప్ ఆహ్వానించారు. పార్టీకి రావాలని కూడా కోరారు. నీకు ఏం కావాలి, ఎంత కావాలని అడిగారు. నేను తిరస్కరించడంతో ట్రంప్ లేదా ఆయన తరపు వ్యక్తి నాకు 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు. దీనికి ఒప్పుకుంటే ట్రంప్ వ్యక్తిగత విమానంలో తన ఇంటి నుంచి లాస్ ఏంజెలెస్ తీసుకెళతామని చెప్పార'ని జెసికా వివరించింది. ట్రంప్ పై ఆరోపణలు చేసిన మరో ఇద్దరు మహిళలతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొంది. జెసికా ఆరోపణలను ట్రంప్ ప్రచార బృందం తోసిపుచ్చింది. ట్రంప్ పై బురద చల్లేందుకు హిల్లరీ వర్గం చేసిన ప్రయత్నంగా పేర్కొంది.