ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి | Adult films actress accuses Trump of groping, offering her 10,000 Dollars | Sakshi
Sakshi News home page

ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి

Published Sun, Oct 23 2016 10:45 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి - Sakshi

ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి

లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు గుప్పిస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శృంగార చిత్రాల నటి(అడల్ట్ యాక్ట్రెస్) జెసికా డ్రాకే తెర ముందుకు వచ్చింది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, తనతో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశారని జెసికా ఆరోపించింది. తనను బలవంతంగా ముద్దు పెట్టారని వెల్లడించింది. ప్రముఖ న్యాయవాది గ్లోరియా ఆల్డ్రెడ్ తో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

2006లో కాలిఫ్నోరియాలోని లేక్ టాహోయ్ గోల్ఫ్‌ టోర్నమెంట్ లో తనకు ట్రంప్ పరిచమయ్యారని జెసికా తెలిపింది. తర్వాత ట్రంప్ ఆహ్వానం మేరకు మరో ఇద్దరు మహిళలతో ఆయన హోటల్ గదికి వెళ్లానని వెల్లడించారు. 'మేము వెళ్లేసరికి ట్రంప్ పైజామా దస్తుల్లో ఉన్నారు. దగ్గరికి వచ్చి ఒక్కొక్కరినీ గట్టిగా కౌగిలించుకున్నారు. మా అనుమతి లేకుండానే ముద్దు పెట్టుకున్నారు. పోర్నోగ్రఫీ గురించి కూడా మాట్లాడారు. అక్కడి నుంచి నా గదికి తిరిగొచ్చాక తాను బసచేసిన హోటల్ గదికి రావాలని మరోసారి ట్రంప్ ఆహ్వానించారు. పార్టీకి రావాలని కూడా కోరారు. నీకు ఏం కావాలి, ఎంత కావాలని అడిగారు. నేను తిరస్కరించడంతో ట్రంప్ లేదా ఆయన తరపు వ్యక్తి నాకు 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు. దీనికి ఒప్పుకుంటే ట్రంప్ వ్యక్తిగత విమానంలో తన ఇంటి నుంచి లాస్ ఏంజెలెస్ తీసుకెళతామని చెప్పార'ని జెసికా వివరించింది.

ట్రంప్ పై ఆరోపణలు చేసిన మరో ఇద్దరు మహిళలతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొంది. జెసికా ఆరోపణలను ట్రంప్ ప్రచార బృందం తోసిపుచ్చింది. ట్రంప్ పై బురద చల్లేందుకు హిల్లరీ వర్గం చేసిన ప్రయత్నంగా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement