
స్టార్మీ డేనియల్స్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : తన మాజీ లాయర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓ కీలుబొమ్మగా మారిపోయాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ అన్నారు. డేనియల్స్ పోర్న్‌స్టార్ అని, ఆమె మాటల్ని ఎవరు నమ్మవద్దని ట్రంప్ లాయర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. ట్రంప్‌తో తనకు గతంలో శారీరక సంబంధాలున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయాలు బహిర్గతం చేయకుండా ఉండేందుకు అధ్యక్షుడు ట్రంప్ లాయర్ మైఖెల్ కోహెన్ మధ్యవర్తిత్వంతో 1,30,000 అమెరికన్ డాలర్లు తనకు ఆఫర్ చేశారని ఆమె అన్నారు.
కాగా, ట్రంప్‌తో సంబంధాలు బయట పెట్టినందుకు న్యూయార్క్ మాజీ మేయర్, ట్రంప్ లాయర్ రుడీ గిలియానీ, డేవిడ్‌సన్ తనను ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. తనపై నిఘా ఉంచిన ట్రంప్ మద్దతుదారులు తన ఫోన్‌కాల్స్‌ను రహస్యంగా రికార్డ్ చేశారని తాజాగా ఆరోపించారు. ప్రణాళికా ప్రకరమే తనపై, తన లాయర్ మైఖెల్ అవెనట్టిపై లేని వదంతులు ప్రచారం చేస్తున్నారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మండిపడ్డారు.
స్టార్మీ డేనియల్స్ లాయర్ అవెనట్టి మాట్లాడుతూ.. ట్రంప్ లాయర్ గిలియానీ ఓ పంది అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో శారీరక సంబంధాలు స్టార్మీ డేనియల్స్ కొనసాగించడం వాస్తవమేనన్న అవెనట్టి, డేవిడ్‌సన్ ఈ నిజాన్ని అవాస్తవంగా చిత్రీకరిండానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment