డొనాల్డ్ ట్రంప్, స్టార్మీ డేనియల్స్ (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) చేస్తున్న ఆరోపణలు నిజమని తేలింది. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని వెల్లడించారు. అయితే తొలుత ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు బుధవారం గిలియాని తెలిపారు.
ఇటీవల ట్రంప్ న్యాయనిపుణుల బృందంలో రుడీ గిలియాని చేరిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా ఫాక్స్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 2016 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీల్ కుదిరింది. అయితే ట్రంప్ తన వద్ద చాలాకాలం నుంచి పనిచేస్తున్న లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ఒప్పందం చేసుకున్న నగదును ఇప్పించారు. ఆపై కొన్ని నెలల తర్వాత ట్రంప్ ఆ నగదును కోహెన్‌కు ఇచ్చి వేశారు. అయితే అది ఆయన వ్యక్తిగత నగదో.. లేక ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో తనకు తెలియదన్నారు. పోర్న్‌స్టార్ ఎన్నికలకు పనిచేసి ఉంటే అది ప్రచారం చేసినందుకు ఇచ్చిన మొత్తంగా భావించవచ్చునని, అలాంటిది జరగలేదంటూ రుడీ గిలియాని స్పష్టం చేశారు.
కాగా, 2006లో తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని గోప్యంగా ఉంచాలంటూ ట్రంప్ తన లాయర్ కోహెన్ ద్వారా 2016లో 1,30,000 డాలర్లకు తనతో ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ ప్రకంపనలు రేపారు. అయితే ట్రంప్ ఇటీవల దీనిపై స్పందిస్తూ.. లైంగిక సంబంధం అవాస్తమని, డీల్ అనే ప్రసక్తే లేదని తనపై వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. మరోవైపు వైట్‌హౌజ్ గత కొద్దిరోజులు నుంచి ట్రంప్-డేనియల్స్ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ వరుస ప్రకటన విడుదల చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment