
వాషింగ్టన్: ఓ వైపు నుంచి లైంగికపరమైన ఆరోపణలు .. మరోవైపు మాజీ ఉద్యోగుల తీవ్ర విమర్శలు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఊపిరి సలపనివ్వటం లేదు. వేటిపై కూడా స్పష్టత ఇవ్వకుండా ‘నో’ ఒక్క సమాధానంతోనే దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ మీడియా ఛానెళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ భార్య- అమెరికా ప్రప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటిదాకా పెదవి విప్పకపోవటం గమనార్హం.
ఈ వ్యవహారాలపై మీడియాకు తారసపడినప్పుడల్లా ఆమె మౌనంగా ఉండటమో లేక తప్పించుకుని తిరగటమో లాంటివి చేస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె హాజరుకాగా.. మీడియా తారసపడకుండా భద్రతా సిబ్బంది గట్టి ప్రయత్నాలే చేశారు. గతంలో ట్రంప్ వ్యాపార విషయాల్లో.. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. మెలానియా చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు.
అలాంటిది పోర్న్ స్టార్ స్ట్రోమీ డేనియల్స్ వ్యవహారం, తాజాగా ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమే.. ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఆమె స్పందించటం లేదు. ఒకానోకదశలో కనీసం సోషల్ మీడియా మాధ్యమంగా ఆమె ఖండించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ట్రంప్ బాగోతాల గురించి పూర్తిగా తెలిసిన ఆమె తన మౌనంతోనే భర్తకు శిక్ష విధించేసి ఉంటుందంటూ అమెరికన్ మాగ్జైన్లు వరుస కథనాలు ప్రచురించేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment