james comey
-
ఆమె మాత్రం స్పందించరేం?
వాషింగ్టన్: ఓ వైపు నుంచి లైంగికపరమైన ఆరోపణలు .. మరోవైపు మాజీ ఉద్యోగుల తీవ్ర విమర్శలు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఊపిరి సలపనివ్వటం లేదు. వేటిపై కూడా స్పష్టత ఇవ్వకుండా ‘నో’ ఒక్క సమాధానంతోనే దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ మీడియా ఛానెళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ భార్య- అమెరికా ప్రప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఇప్పటిదాకా పెదవి విప్పకపోవటం గమనార్హం. ఈ వ్యవహారాలపై మీడియాకు తారసపడినప్పుడల్లా ఆమె మౌనంగా ఉండటమో లేక తప్పించుకుని తిరగటమో లాంటివి చేస్తూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె హాజరుకాగా.. మీడియా తారసపడకుండా భద్రతా సిబ్బంది గట్టి ప్రయత్నాలే చేశారు. గతంలో ట్రంప్ వ్యాపార విషయాల్లో.. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. మెలానియా చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. అలాంటిది పోర్న్ స్టార్ స్ట్రోమీ డేనియల్స్ వ్యవహారం, తాజాగా ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమే.. ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఆమె స్పందించటం లేదు. ఒకానోకదశలో కనీసం సోషల్ మీడియా మాధ్యమంగా ఆమె ఖండించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ట్రంప్ బాగోతాల గురించి పూర్తిగా తెలిసిన ఆమె తన మౌనంతోనే భర్తకు శిక్ష విధించేసి ఉంటుందంటూ అమెరికన్ మాగ్జైన్లు వరుస కథనాలు ప్రచురించేస్తున్నాయి. -
తండ్రికి గట్టి మద్దతిచ్చిన జూనియర్ ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి అనూహ్యంగా ట్రంప్ చే ఉద్వాసనకు గురైన జేమ్స్ కోమీ సెనేట్ ప్యానల్ ముందు తనను తాను నిరూపించుకుండగా.. వరుస లైవ్ ట్వీట్లతో తండ్రికి గట్టి మద్దతిచ్చారు జూనియర్ ట్రంప్. మొత్తం 80 పైగా ట్వీట్లను ఆయన చేశారు. ఈ విషయంలో కొంచెం ట్రంప్ నిదానంగా ఉన్నప్పటికీ, కొడుకు మాత్రం తన ప్రతాపం చూపించారు. కోమీ, సెనేటర్లు చేసిన ప్రతి ఆరోపణకు ట్విట్టర్ ద్వారానే సమాధానమిచ్చారు. కోమ్లి శుక్రవారం రిపబ్లిక్ నేషనల్ కమిటీ, ప్రెసిడెంట్స్ పర్సనల్ లాయర్ ముందు హాజరయ్యారు. ఇప్పుడే కాక గతేడాది ఎన్నికల సమయంలో కూడా జూనియర్ ట్రంప్ తండ్రికి గట్టి మద్దతిచ్చారు. ఫోక్స్ న్యూస్, స్థానిక కన్జర్వేటివ్ అవుట్ లెట్స్ కు వందకు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చి హిల్లరీని ముప్పు తిప్పులు పెట్టారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెక్షన్ లో ఇచ్చిన స్పీచ్ జూనియర్ ట్రంప్ కు బాగా పేరుతెచ్చింది. అప్పుడే జూనియర్ ట్రంప్ రాజకీయ ప్రవేశంపై చర్చలు జరిగాయి. -
అమెరికాలో ఉత్కంఠ
గురువారం సెనెట్ ఇంటలిజెన్స్ కమిటీ ముందుకు జేమ్స్ కోమీ సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ప్రత్యక్షప్రసారం చేయనున్న పలు టీవీ చానెల్స్ అమెరికా ‘రాజకీయం’ మలుపు తిరుగుతుందా? అధ్యక్షుడిగా ట్రంప్ అభిశంసనకు బీజం పడుతుందా? ఇప్పుడు అమెరికన్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి. కారణం... ఎఫ్‌బీఐ డైరక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన జేమ్స్ కోమీ గురువారం వాషింగ్టన్లో సెనెట్ ఇంటలిజెన్స్ కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ప్రమాణం చేసి సెనెటర్లు అడిగే ప్రశ్నలకు ఆయన బదులిస్తారు. ఆయన నోట ఏ సంచలన వ్యాఖ్యలు బయటికి వస్తాయో, ట్రంప్‌ను ఇరుకున పెట్టే సంగతులేమైనా బయటపెడతారేమోనని ఇప్పుడు అమెరికా అంతా ఎదురుచూస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో కోమీ సెనెట్ కమిటీ ముందుకు వస్తారు. విషయం ఏమిటంటే: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రష్యా సహకరించిందని, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్, ఇతర డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నాయకుల ఈ మెయిల్స్‌ను లీక్ చేయడం ద్వారా ట్రంప్‌కు సహకరించిందనేది ఆరోపణ. దీనిపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. ట్రంప్ బందం రష్యా రాయబారితో టచ్‌లో ఉందనేది వెల్లడైంది. ట్రంప్ ప్రచార బందంలో కీలకంగా పనిచేసిన మైకేల్ ఫ్లిన్ తర్వాత జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్తో తాను సంభాషించిన విషయంపై ఉపాధ్యక్షుడు పెన్స్‌ను తప్పుదోవ పట్టించారని తేలడంతో మైకేల్ ఫ్లిన్ నెల తిరగకముందే జాతీయ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన ప్రచార బృందానికి రష్యాతో ఉన్న సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతుండగా... గతనెల 9వ తేదీన ట్రంప్ అకస్మాత్తుగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి నుంచి కోమీకి ఉద్వాసన పలికారు. విచారణను అడ్డుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. తనకు సన్నిహితుడైన ఫ్లిన్‌పై విచారణను నిలిపివేయాల్సిందిగా కోమీని అధ్యక్షుడి హోదాలో ట్రంప్ కోరినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. వీటిపై సెనెటర్లు గురువారం ప్రశ్నలు సంధించనున్నారు. ఎదురయ్యే కీలక ప్రశ్నలు: 1. ఫ్లిన్‌పై విచారణలో వెనక్కితగ్గాల్సిందిగా అధ్యక్షుడు మీపై ఒత్తిడి తెచ్చారా? 2. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటే... అందులో ఫ్లిన్ పాత్రేమిటి? 3. ట్రంప్‌ను ఎప్పుడు కలిశారు... ఏం మాట్లాడారు? 4. తనకు విధేయుడిగా పనిచేయాలని అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ మిమ్మల్ని అడిగారా? 5. రష్యా జోక్యంపై విచారణలో ట్రంప్ పాత్రపై విచారణ జరగడం లేదని మీరు ఆయనకు చెప్పారా? పర్యవసానాలు: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అమెరికా జోక్యం విషయంలో కోమీ మాట్లాడటానికి నిరాకరించొచ్చు. దర్యాప్తును ప్రభావితం చేస్తుందనే కారణం చూపొచ్చు. ఫ్లిన్‌ను కాపాడటానికి ట్రంప్ అధ్యక్ష హోదాలో ఒత్తిడి తెచ్చారని కోమీ వెల్లడిస్తే రాజకీయ దుమారం రేగుతుంది. న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలినందున ట్రంప్‌ను అభిశంసించాలనే డిమాండ్లు పెరుగుతాయి. అయితే న్యాయపరంగా ట్రంప్‌పై అభియోగాలు మోపే అధికారం సెనెట్ కమిటీకి లేదు. రష్యా జోక్యం, ట్రంప్ బృందానికి క్రెమ్లిన్‌తో ఉన్న సంబంధాలపై విచారణకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్‌ను ప్రత్యేక కౌన్సిల్‌గా మే 17న నియమించారు. ఆయన దర్యాప్తులో తేల్చే విషయాలపైనే ట్రంప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదు
ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్కోమీ తొలగింపు తప్పదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి వాషింగ్టన్: న్యాయవ్యవస్థ సూచనలతో సంబంధంలేకుండా తనకున్న విశిష్ట అధికారాలను వినియోగించి ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్‌హౌస్ వర్గాలు మాత్రం అత్యున్నత న్యాయాధికారుల సలహా మేరకే అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ కోమీని విధుల నుంచి తొలగించేందుకు తాను ఎవరి సలహా తీసుకోలేదని తెలిపారు. అటార్నీ జనరల్ జెఫ్ సెసన్స్, డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోషెన్ స్టెయిన్‌లతో సోమవారం సమావేశమైన ట్రంప్ కోమీ తొలగింపునకు గల కారణాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్ వెల్లడించింది. తాను ఎఫ్‌బీఐ దర్యాప్తు పరిధిలో ఉన్నానా? అని కోమీని అనేక మార్లు ప్రశ్నించానని అందుకు ఆయన లేదని బదులిచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కోమీని ప్రభావితం చేయడానికి, అతనిపై ఒత్తిడి తేవడానికీ ఎన్నడూ ప్రయత్నించలేదని ట్రంప్ అన్నారు. ఎఫ్‌బీఐ మాజీ చీఫ్పైన కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆయన్ని ఒక షోబోట్గా అభివర్ణించారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సమగ్రతను ఆయన చెడగొట్టారని అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం నాటికి ఎఫ్‌బీఐ సంక్షోభంలో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందేనని, ఈ ఏడాది సమయంలో అది ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు. కోమీ అధికారుల విశ్వాసాన్ని కోల్పోయారని ఎఫ్‌బీఐ తాత్కాలిక డైరెక్టర్ ఆండ్రూ మెక్‌క్యాబ్ వెల్లడించిన కాసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బృందం రష్యాతో కుమ్మక్కయిందనే ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఉద్వాసనకు కారణం ఏమిటి?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి రష్యా నిర్వహించిన పాత్రపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కోమీ దర్యాప్తు చేస్తున్న తీరు నచ్చకపోవడం వల్లే అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు ఉద్వాసన పలికారని స్పష్టమౌతోంది. ఈ దర్యాప్తునకు చెప్పుకోదగ్గ మొత్తంలో నిధులు, సిబ్బందిని కేటాయించాలని ఫెడరల్ న్యాయశాఖను తన తొలగింపునకు కొద్ది రోజుల ముందు కోమీ కోరారని అమెరికా మీడియా వెల్లడించింది. మెజారిటీ పాలకపక్షమైన రిపబ్లికన్‌పార్టీ సభ్యలతో నిండిన సెనేట్, హౌస్ కమిటీలు కూడా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నప్పటికీ, ఎఫ్‌బీఐ తన దృష్టిని ట్రంప్ టీమ్‌తో రష్యాకున్న లింకులపై కేంద్రీకరించడం అధ్యక్షుని ఆగ్రహానికి కారణమైంది. ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై సాగుతున్న దర్యాప్తును తాను పర్యవేక్షిస్తున్నానని మార్చిలో కోమీ ధ్రువీకరించాక ఆయనను తొలగించడంతో ట్రంప్‌కు ఈ దర్యాపును సక్రమంగా ముగించడం ఇష్టంలేదని తేలిపోయింది. మార్చి 20న హౌస్ ఇంటెలిజన్స్ కమిటీ ముందు హాజరైన కోమీ, ‘‘ఎఫ్‌బీఐ రష్యా జోక్యంపైనేగాక, ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయిందా? అనే విషయంపై కూడా దర్యాప్తు జరుపుతోంది’’అని చెప్పిన మాటలు కోమీకి ఉద్వాసన పలకాల్సిందేనని అధ్యక్షుడు నిర్ణయించుకోవడానికి కారణమయ్యాయి. ఎన్నికల సమయంలో ట్రంప్ టవర్ ఫోన్లను ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ట్యాపింగ్ చేయించారనడానికి సాక్ష్యాధారాలు లేవని కూడా అదే సందర్భంలో కోమీ అన్న మాటలు ట్రంప్‌కు చిర్రెత్తించాయి. అయితే, రష్యాతో తన శిబిరానికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయడం వల్లే కోమీని తొలగించారనే మాటకు విలువలేకుండా చేయడానికే ట్రంప్, ‘‘నాపై దర్యాప్తు జరపడం లేదని మూడు వేర్వేరు సందర్భాల్లో మీరు నాకు చెప్పడం ఎంతో అభినందనీయం.’’ అని కామీని ప్రశంసిస్తూనే పదవి నుంచి తొలగించారు. ట్రంప్‌పై మెకెయిన్ నిప్పులు ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యంపై ప్రత్యేక కాంగ్రెషెనల్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని తానెప్పటి నుంచో కోరానని, ఇలాంటి కమిటీని తక్షణమే నియమించాల్సిన అవసరం ఉందని ఎఫ్‌బీఐ ఛీఫ్ తొలగింపు నిరూపిస్తోందని రిపబ్లికన్ సీనియర్ సెనేటర్ జాన్ మెకెయిన్ చెప్పారు. అయితే, ఏడాదిగా రష్యా పాత్రపై కాంగ్రెస్ విచారణ సాగుతోందనీ, ముందుకు సాగని ఈ దర్యాప్తునకు వెంటనే స్వస్తి పలికితే మంచిదని, అమెరికన్లు కోరుకుంటున్న విషయాలపై ఇక దృష్టి పెట్టడం మంచిదని వైట్‌హౌస్ ప్రతినిధి సారా హకబీ శాండర్స్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ చెప్పిన మాటల్లో నిజం లేదు. ఎందుకుంటే, ఇంతవరకూ ఈ వ్యవహారంపై కాంగ్రెస్ దర్యాప్తు ప్రారంభమే కాలేదు. రెండోది, రష్యా జోక్యంపై అత్యధిక ప్రజానీకం విచారణ జరపాలని కోరుతోంది. మరో ముఖ్యాంశం ఏమంటే, రష్యన్ల జోక్యంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ఇటీవల జోరందుకుంది. ఈ కుంభకోణంపై కోమీ ఇటీవల రోజూవారీగా నివేదికలు అందకుంటున్నారు. అంతకు ముందు వీక్లీ రిపోర్టులు ఆయనకు వచ్చేవి. ఈ పరిస్థితులే ట్రంప్ ఆగ్రహానికి, చివరికి కోమీ ఉద్వాసనకు దారితీశాయని అమెరికా ప్రధాన మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వాటర్‌గేట్ ఛాయలు రష్యాపాత్రపై దర్యాప్తుపై కొత్త డైరెక్టర్ పర్యవేక్షణ ఉంటుందా? అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ జవాబివ్వకపోవడం కూడా ఈ దర్యాప్తును నీరుగార్చుతారనే అనుమానాన్ని బలపరుస్తోంది. 1972 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని వాటర్‌గేట్ కాంప్లెక్స్–హోటల్లో జరిగిన డెమొక్రాటిక్ కన్వెన్షన్‌లో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై(వాటర్‌గేట్ కుంభకోణం)దర్యాప్తునకు 1973లో ఓ ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమించారు. ఆయన విచారణ ప్రారంభించిన వెంటనే ఆరోపణలెదుర్కొంటున్న అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ప్రాసిక్యూటర్‌ను తొలగించేశారు. దాంతో 1974లో నిక్సన్ రాజీనామాకు దారితీసిన పరిణామాలకు ప్రాసిక్యూటర్ ఉద్వాసన నాందీ పలికింది. ఇప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్ తొలగింపు 1973నాటి పరిణామాలను గుర్తుచేస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అసలు ట్రంప్‌కు పవర్ ఎలా? రంగంలోకి ఎఫ్‌బీఐ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యాకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా? వారి మధ్య ఒప్పందాలు జరిగి ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారా? అవినీతి నేరాలకు ఒడిగట్టారా అనే విషయాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామే బహిరంగంగా స్పష్టం చేశారు. ‘వారు(రష్యా) మా ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టాలని భావించారు. ఆమె(హిల్లరీ క్లింటన్)ను గాయపరిచారు. అతడి(డోనాల్డ్ ట్రంప్)కి సహాయం చేశారు’ అని కామే ఆరోపించారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో అమెరికాకు చెందిన కొంతమంది ప్రత్యేకమైన పౌరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే విషయాన్నిమాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రభావం చూపించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా సామాన్యుల నుంచి అగ్రస్థానాల్లో ఉన్న సంస్థల అధిపతులకు కూడా నచ్చలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో గత ఏడాది(2016)నవంబర్ 8 జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌తో కలిసి రష్యా ఏదైనా కుట్రలకు పాల్పడిందా అనే అంశంపై ఎఫ్‌బీఐ ఇప్పటికీ దర్యాప్తు చేస్తూనే ఉందని ఆయన ఓ ఇంటెలిజెన్స్‌కు స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికాలో ఎవరు అధ్యక్షుడు కావాలనే విషయంలో పుతిన్‌కు ఒక స్పష్టత ఉందని, అతడికి హిల్లరీ అధ్యక్షురాలు కావడం ఇష్టం లేదని, ట్రంప్ అధికారంలోకి రావాలని అతను నిర్ణయించుకున్నారని, ఆ ప్రకారమే ట్రంప్ అధికారంలోకి వచ్చాడని నేరుగా కామెంట్లు చేసి తాజాగా వివాదం రేపారు. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.