తండ్రికి గట్టి మద్దతిచ్చిన జూనియర్ ట్రంప్
తండ్రికి గట్టి మద్దతిచ్చిన జూనియర్ ట్రంప్
Published Sat, Jun 10 2017 2:20 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి అనూహ్యంగా ట్రంప్ చే ఉద్వాసనకు గురైన జేమ్స్ కోమీ సెనేట్ ప్యానల్ ముందు తనను తాను నిరూపించుకుండగా.. వరుస లైవ్ ట్వీట్లతో తండ్రికి గట్టి మద్దతిచ్చారు జూనియర్ ట్రంప్. మొత్తం 80 పైగా ట్వీట్లను ఆయన చేశారు. ఈ విషయంలో కొంచెం ట్రంప్ నిదానంగా ఉన్నప్పటికీ, కొడుకు మాత్రం తన ప్రతాపం చూపించారు. కోమీ, సెనేటర్లు చేసిన ప్రతి ఆరోపణకు ట్విట్టర్ ద్వారానే సమాధానమిచ్చారు.
కోమ్లి శుక్రవారం రిపబ్లిక్ నేషనల్ కమిటీ, ప్రెసిడెంట్స్ పర్సనల్ లాయర్ ముందు హాజరయ్యారు. ఇప్పుడే కాక గతేడాది ఎన్నికల సమయంలో కూడా జూనియర్ ట్రంప్ తండ్రికి గట్టి మద్దతిచ్చారు. ఫోక్స్ న్యూస్, స్థానిక కన్జర్వేటివ్ అవుట్ లెట్స్ కు వందకు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చి హిల్లరీని ముప్పు తిప్పులు పెట్టారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెక్షన్ లో ఇచ్చిన స్పీచ్ జూనియర్ ట్రంప్ కు బాగా పేరుతెచ్చింది. అప్పుడే జూనియర్ ట్రంప్ రాజకీయ ప్రవేశంపై చర్చలు జరిగాయి.
Advertisement
Advertisement