న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంటి పోరుకంటే వీధిపోరు ఎక్కువవుతోంది. ఆయనతో తమకు శారీరక సంబంధం ఉందంటూ ఆరోపిస్తున్న మహిళలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం చెబుతున్నారు. మొన్నటికి మొన్న తమది పది నెలల బంధం అని పెళ్లి వరకు వెళుతుందని ఆశపడ్డానని ప్రముఖ మేగజిన్ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా.. తాజాగా పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విషయం మరిచిపోవాలని, లేదంటే చంపేస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారని ఆమె వెల్లడించారు. తొలిసారి సీబీఎస్ చానెల్‌లో ప్రముఖ జర్నలిస్టు ఆండర్సన్ కూపర్‌కు ఆమె 60 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ప్రత్యక్ష ప్రసారం అయింది. అందులో పలు విషయాలు వెల్లడించారు.
‘ డోనాల్డ్ ట్రంప్‌కు నాకు ఉన్న శారీరక సంబంధం బయటపెట్టొద్దని నన్ను బెదిరించారు. చంపుతామని హెచ్చరించారు. ఆ అనుభవం నేనిప్పటికీ మరిచిపోలేదు. వాస్తవానికి మా సెక్సువల్ రిలేషన్ సీక్రెట్‌గా ఉంచాలని ట్రంప్ ఎప్పుడూ నాకు చెప్పలేదు. కానీ, ఈ విషయంలో మార్పు వచ్చింది మాత్రం 2011లో. ఓ మేగజిన్‌కు మా స్టోరీని నేను 15వేల డాలర్లకు అమ్మేయాలని నిర్ణయించుకొని దానితో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ విషయంలో ట్రంప్ నుంచి స్పందన వచ్చింది. ఆ రోజు నేను పార్కింగ్ లాట్‌లో ఉన్నాను. నా చంటిబిడ్డతో ఫిట్‌నెస్ క్లాస్‌కు వెళుతున్నాను. వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ట్రంప్ విషయం వదిలేయ్. ఆ స్టోరీ మొత్తాన్ని మర్చిపో అన్నాడు. నా కూతురును చూస్తూ చాలా చక్కగా ఉంది నీ పాప. ఆ పాప తల్లికి (డానియెల్‌కే) అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ పాపకు షేమ్‌గా ఉంటుంది.. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఆ సమయంలో నేను ఎంత వణికిపోయానో. క్లాస్‌కు కూడా వెళ్లకుండా బిడ్డను తీసుకొని భయపడుతూ ఇంటికెళ్లాను.
ట్రంప్‌ను ఎప్పుడు కలిశానంటే..?
‘2006లో తొలిసారి నేను ట్రంప్‌ను కలిశాను. అప్పుడు ఆయన ఓ హోటల్‌లో సూట్‌తో ఉన్నారు. ఆ రోజే మేం తొలిసారి శారీరకంగా దగ్గరయ్యాం. ట్రంప్ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. మీరు అసలు అతడిని ఊహించలేరు. ఆ రోజు హోటల్‌ను నన్ను చూసి.. వావ్ నువు చాలా అందంగా ఉన్నావ్.. తెలివైనదానిలా ఉన్నావ్ అన్నాడు. ఆ రోజు అతడు అసురక్షిత శృంగారంలో పాల్గొన్నాడు. వాస్తవానికి నాకంటే అప్పటికే 30 ఏళ్లు పెద్దవాడైన ట్రంప్ నన్ను పెద్దగా ఆకర్షించలేకపోయారు.. కానీ, నేను కాదనలేకపోయాను.. అయితే, బాధితురాలిగా మిగల్లేదు. ఆ తర్వాత కూడా నేను అతడితో టచ్‌లో ఉన్నాను. సరిగ్గా ఎన్నికలకు 11 రోజుల ముందు 2016లో ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దని ఒప్పందం చేసుకున్నారు’ అంటూ పలు విషయాలను డానియెల్ చెప్పింది.
పోర్న్‌స్టార్‌ను చంపేస్తానన్న ట్రంప్
Published Mon, Mar 26 2018 10:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM
Comments
Please login to add a commentAdd a comment