
న్యూయార్క్ : తనపై ఆరోపణలు వచ్చిన కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో లేకుండా పోయారు. తనకు ట్రంప్‌కు శారీరక సంబంధం ఉందని చెప్పడమే కాకుండా.. ఆ విషయం బయటకు చెబితే ట్రంప్ తనను చంపేస్తానని బెదిరించారంటూ పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్ చెప్పే సందర్భంలో ఆ లైవ్ చూడకుండా మిస్సయ్యారు. దాదాపు 60 నిమిషాలు ప్రత్యక్ష ప్రసారం అయిన ఆ ఇంటర్వ్యూను ట్రంప్‌గానీ, ఆయన భార్య మిలానియా ట్రంప్‌గానీ చూడలేదని, ఆ సమయంలో వారు వెయ్యి మైళ్ల (1609.34 కిలోమీటర్ల) దూరంలో ఉన్నారని శ్వేతసౌదం ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోగల మార్ ఏలాగో ఎస్టేట్‌లో ట్రంప్ గత వారం రోజులుగా సేద తీరుతున్నారని, వేసవి విడిదిలో భాగంగా అక్కడికి వెళ్లినట్లు వెల్లడించింది.
మిలానియా ట్రంప్ కూడా కూడా శుక్రవారం ఫ్లోరిడా వెళ్లారని, ఆమె కూడా అక్కడే ఉన్నారని, ప్రస్తుతం వారు వచ్చే సమయానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలిపింది. స్టామీ ఇంటర్వ్యూ జరిగిన చోటుకు ప్రస్తుతం ట్రంప్ వాళ్లు ఉన్న ప్రదేశానికి సరిగ్గా 1600 కిలోమీటర్ల పైనే ఉంటుందట. సేద తీరే సమయం అయినందున ఎలాంటి అంశాలు వారి ఏకాంతానికి భంగం కలిగించకుండా ఉండే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్‌కు తనకు శారీరక సంబంధం ఉందని, అది బయటపెట్టొద్దని నన్ను బెదిరించారని, చంపుతామన్నారని పోర్న్‌స్టార్ స్టామీ 60 నిమిషాలపాటు ఆదివారం ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment