వాషింగ్టన్ : పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ చేస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెదవి విప్పారు. ఆమెతో తాను డీల్ కుదుర్చున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు.
స్టెఫానీ క్లిఫార్డ్(స్టోర్మీ డేనియల్స్)కు మీ లాయర్ మైకేల్ కోహెన్ మీ తరపున డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకున్న మాట వాస్తం కాదా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ‘ఆ విషయాన్ని మైకేల్ కోహెన్‌నే అడగండంటూ’ ట్రంప్ బదులిచ్చారు. ఇక ఒప్పందం నిజం అవునా? కాదా? సూటిగా చెప్పండన్న మరో ప్రశ్నకు.. ‘లేదు’ అని చెప్పారు. అలాగైతే ఆమెకు డబ్బు ఎవరు ఇచ్చారు? అన్న ప్రశ్నకు.. ‘నాకేం తెలీదు’ అనే సమాధానం ట్రంప్ వద్ద నుంచి వచ్చింది. కోహెన్ నా అటార్నీ మాత్రమే అంటూ ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు వైట్‌హౌజ్ గత కొద్దిరోజులు నుంచి ట్రంప్-డేనియల్స్ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ వరుస ప్రకటన విడుదల చేస్తోంది.
ఇదిలా ఉంటే తనతో లైంగిక సంబంధాన్ని గోప్యంగా ఉంచాలంటూ ట్రంప్ తన లాయర్ కోహెన్ ద్వారా 2016లో 1,30,000 డాలర్లకు తనతో ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ పెను చర్చకు దారితీసింది. అయితే ఆ ఒప్పందం మాట వాస్తవమేనని స్వయానా కోహెన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించటం విశేషం. అది జరిగిన కొద్దిరోజులకే ప్లే బాయ్ మోడల్(మాజీ) కరెన్ మెక్‌డౌగల్(46) కూడా ట్రంప్ తనతో శారీరక సంబంధం నెరిపినట్లు ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment