Strip Dance
-
విద్యార్థినిల బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించిన ఖాకీలు
ముంబై: అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే బాలికలపై జరిగే దారుణాలకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు చదువుతూనే ఉంటాం. తమకంటూ ఎవరు లేని ఈ అభాగ్యుల పట్ల జాలి, దయ చూపాల్సింది పోయి పశువుల్లా ప్రవర్తిస్తారు కొందరు అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారారు. పోలీసులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న కొందరు విద్యార్థినిల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారు. బుల్దానా, చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. రాష్ట్రంలోని జల్గావ్లో ప్రభుత్వం ఆశాదీప్ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కొందరు పోలీసు అధికారులు, మరి కొందరితో కలిసి హాస్టల్‌కి వెళ్లారు. అక్కడున్న విద్యార్థినిలను బెదిరించి వారి బట్టలు విప్పించి.. డ్యాన్స్ చేయించారు. ఈ దారుణం గురించి ఓ ఎన్జీఓకు తెలియడంతో వారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేడు శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా శ్వేతా మహాలే మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణంలో పోలీసులు కూడా పాలు పంచుకున్నారని తెలిసి సిగ్గుపడుతున్నాము. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉంటారని భావిస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ”అన్నారు శ్వేతా మహాలే. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. మహాలే లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ దేశ్ ముఖ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని.. వారు రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. దారుణం జరిగిన హాస్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది. చదవండి: ఇది పశువుల హాస్టల్.. ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే -
పోర్న్‌స్టార్ అరెస్ట్.. అంతలోనే...
సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్(స్టోర్మీ డేనియల్స్) అరెస్ట్ వ్యవహారం కలకలం రేపింది. ఒహియో రాష్ట్రంలో ఓ క్లబ్లో ఆమె స్ట్రిప్పింగ్ డాన్సులు చేస్తూ.. కొందరితో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణల మేర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది గంటలకే ఆమెపై ఆరోపణలు కొట్టేస్తూ విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది. కొలంబస్‌లోని సైరెన్స్ జెంటిల్మెన్స్ క్లబ్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రిప్పింగ్ డాన్స్ చేస్తూ టాప్ లెస్‌గా ఆమె కస్టమర్లు, అక్కడికొచ్చిన నలుగురు అధికారుల పట్ల ప్రవర్తించిందని ఆరోపణ. వెంటనే స్టోర్మీతోపాటు, మరో ఇద్దరు డాన్సర్లను అరెస్ట్ చేసి జాక్సన్ పైక్ జైలుకు తరలించారు. అయితే ఉదయం ఆ ఆరోపణలను ఎత్తేసిన పోలీసులు.. ఆమెను రిలీజ్ చేయటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుట్ర కోణం.. స్టెఫానీ క్లిఫోర్డ్.. అమెరికా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. ప్రెసిడెంట్ కాకముందు ఆయన తనతో అఫైర్ నడిపాడని.. ఆ విషయం బయటకు పొక్కకుండా డీల్ కూడా కుదుర్చుకున్నాడని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేసే అరెస్ట్ చేయించారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. డిటెక్టివ్లు మారువేషంలో క్లబ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే డ్రగ్స్, వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకే తాము సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. కాసేపటికే... స్టోర్మీని అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే పోలీసులు విడుదల చేశారు. ఆరు వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను విడుదల చేశారని, శుక్రవారం ఆమె కోర్టులో సైతం హాజరవుతారని ఆమె తరపు న్యాయవాది మైకేల్ అవెనట్టి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే నైట్ క్లబ్లో ఆమె సభ్యత్వం ఉన్న డాన్సర్ కావటంతోనే ఆమెపై ఆరోపణలు కొట్టేసి.. వదిలేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్టెఫానీ పెదవి విప్పాల్సి ఉంది. -
నగ్న నృత్యాలతో పార్టీ, 50 మంది అరెస్టు
ఇస్లామాబాద్: అశ్లీల కార్యక్రమాల్లో పాల్గొని పాటలు పాడారంటూ 50 మంది యువతీ యువకులను పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివారం పొగ తాగుతూ పెద్ద శబ్దాలతో పాటలు వింటూ యువతీ యువకులు నృత్యాలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు 34 మంది యువకులతోపాటు 16 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా అందరికీ బెయిల్ మంజూరైంది. ఈ ఘటనకు సంబంధించి సదరు హోటల్ యజమానితోపాటు నిర్వాహకుడిపైనా కేసులు నమోదు చేశారు. గత మే నెలలో లాహోర్‌లోని సొజొ వాటర్ పార్క్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారంటూ మత పెద్దలు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయించారు. -
టీమిండియాను ఓడిస్తే.. న్యూడ్ డాన్స్ చేస్తా..
ఇస్లామాబాద్: టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్ షో అంటూ అప్పట్లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ భామ పూనం పాండే బాటలో తాజాగా మరో భామ వెలుగులోకి వచ్చింది. షాహిద్ ఆఫ్రిది సారధ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు...టీమిండియాను మట్టి కరిపిస్తే స్ట్రిప్ డ్యాన్స్ (ఒంటిపై ఉన్న బట్టలు ఒక్కోటి విప్పుతూ చేసే డ్యాన్స్) చేస్తానంటూ పాకిస్తానీ మోడల్ కాందీల్ బాలోచ్ సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేసింది. దీంతోపాటుగా ఆ డ్యాన్స్ ను పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితం అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్ లో టీమిండియాపై పాక్ గెలిస్తే , అందరి ముందు తాను 'స్ట్రిప్ డాన్స్' చేస్తానంటూ తన ఫేస్ బుక్ ఖాతా లో వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అంతేకాదు, ఇదంతా పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితమిస్తానని, ఒకే ఒక్కసారి ఇండియాను ఓడించమంటూ షాహిద్ అఫ్రిదిని వేడుకుంది ఈ బ్యూటీ. దీంతో ఇప్పుడు అమ్మడి ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను దాదాపు నాలుగున్నర లక్షలమంది వీక్షించారు.