టీమిండియాను ఓడిస్తే.. న్యూడ్ డాన్స్ చేస్తా.. | Pakistan Model Offers Strip Dance If Pakistan Defeats India In T20 World Cup | Sakshi
Sakshi News home page

టీమిండియాను ఓడిస్తే.. న్యూడ్ డాన్స్ చేస్తా..

Published Tue, Mar 15 2016 7:03 PM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

టీమిండియాను ఓడిస్తే.. న్యూడ్ డాన్స్ చేస్తా.. - Sakshi

టీమిండియాను ఓడిస్తే.. న్యూడ్ డాన్స్ చేస్తా..

ఇస్లామాబాద్:   టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే   న్యూడ్ షో అంటూ అప్పట్లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ భామ పూనం పాండే బాటలో తాజాగా మరో భామ వెలుగులోకి వచ్చింది.   షాహిద్ ఆఫ్రిది  సారధ్యంలోని పాకిస్తాన్  క్రికెట్ జట్టు...టీమిండియాను మట్టి కరిపిస్తే స్ట్రిప్ డ్యాన్స్ (ఒంటిపై ఉన్న బట్టలు ఒక్కోటి విప్పుతూ చేసే డ్యాన్స్) చేస్తానంటూ పాకిస్తానీ మోడల్ కాందీల్ బాలోచ్ సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేసింది.   దీంతోపాటుగా ఆ డ్యాన్స్ ను పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి  అంకితం అంటూ బంపర్  ఆఫర్  కూడా ఇచ్చేసింది.


టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్ లో టీమిండియాపై పాక్  గెలిస్తే , అందరి ముందు తాను 'స్ట్రిప్ డాన్స్' చేస్తానంటూ తన ఫేస్ బుక్ ఖాతా లో వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక  వీడియోను కూడా షేర్ చేసింది. అంతేకాదు, ఇదంతా పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితమిస్తానని, ఒకే ఒక్కసారి ఇండియాను ఓడించమంటూ షాహిద్ అఫ్రిదిని వేడుకుంది ఈ బ్యూటీ.  దీంతో ఇప్పుడు అమ్మడి ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను  దాదాపు  నాలుగున్నర లక్షలమంది   వీక్షించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement