Qandeel Baloch
-
పరువు హత్య.. జైలు నుంచి రిలీజ్ కాగానే భారీ ఊరేగింపుతో స్వాగతం
సోషల్ మీడియాలో సెన్సేషన్, పాక్ పూనం పాండేగా పేరున్న క్వాందీల్ బలోచ్ హత్య ఉదంతం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అశ్లీల వీడియోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ కుటుంబం పరువు తీస్తోందంటూ తోడబుట్టినవాడే 2016, జులైలో ఆమెను దారుణంగా హతమార్చారు. అయితే ఇంతకాలం జైలుశిక్ష అనుభవించిన ఆమె సోదరుడు.. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఊరేగింపుగా జనం ఇంటికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఫౌజియా అజీమ్ అలియాస్ క్వాందీల్ బలోచ్ అలియాస్ కందిల్ బలోచ్.. పాక్ తొలి సోషల్ మీడియా సెలబ్రిటీ. భర్త నుంచి విడిపోయాక ఆమె.. హాట్ ఫొటోలు, వీడియోలతో పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో భారత క్రికెటర్లు, సినీ తారల పేర్లను సైతం ఆమె ఉపయోగించుకుంది. ఇదిలా ఉండగా..ఆపై ఆమె పరివర్తనలో మార్పొచ్చింది. ఉద్యమకారిణిగా పలు అంశాలపై పోరాడింది. ఇదిలా ఉండగా.. 2016లో క్వాందీల్(26) దారుణంగా హత్యకు గురైంది. అశ్లీల ఫొటోలు, వీడియోలతో తమ కుటుంబ పరువు తీస్తున్నందువల్లే తన సోదరిని హతమార్చానని బలోచ్ సోదరుడు వసీమ్ ప్రకటించాడు. అంతేకాదు ఇందుకు తానేం బాధపడడం లేదని, ఆమె హద్దులు దాటిందంటూ తన చర్యను సమర్థించుకున్నాడు కూడా. ఈ కేసులో వసీమ్‌కు జీవిత ఖైదు పడింది. ఈ హత్య ఉదంతం మడోనా లాంటి పాప్ సింగర్ దగ్గరి నుంచి ఎంతో మంది సెలబ్రిటీలను కదిలించింది. ఆడవాళ్ల స్వేచ్ఛ.. దానికి ఉండాల్సిన పరిధులపైనా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది కూడా. పాక్‌లో ఇలాంటి నేరాలకు చట్ట సవరణ పై చర్చ జరగ్గా.. చట్టాలకు కీలకమైన మార్పులు సైతం జరిగాయి. అదే టైంలో ఇలాంటి కేసుల్లో క్షమాభిక్షలు ఇవ్వకూడదనే డిమాండ్ బలంగా వినిపించింది. మరోవైపు తమ కుమార్తె హత్య కేసులో కొడుకు వసీంను క్షమించే ప్రసక్తే లేదని తొలుత ఆ పేరెంట్స్ వ్యాఖ్యానించారు కూడా. చివరికి.. క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో ఆరేళ్ల శిక్షా కాలం పూర్తి కాకముందే వసీం బయటకు వచ్చేశాడు. బలోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు తనను గుర్తుంచుకుంటాయని మహ్మద్ వసిమ్ అరెస్ట్ అయిన సమయంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యాక కూడా అతని పరివర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. స్థానిక మీడియాకు అదే మాట చెప్పాడు. ఇక ముల్తాన్ సిటీలోని అతనుండే ఏరియా మొత్తం వసీమ్‌ను ‘హీరో’గా అభివర్ణిస్తోంది. పైగా అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, ఆ విషయంలో దారి తప్పితే వసీమ్ లాంటి హీరోలు పుట్టుకొస్తారంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు సైతం ప్రదర్శించడం విశేషం. ఇంట్లో వాళ్లు అతన్ని రానివ్వకపోవడంతో.. అదే ఏరియాలో మరో అద్దె ఇంట్లో దిగాడు వసీమ్ ఇప్పుడు. -
ఆ మోడల్ ఎవరికీ భయపడరు!
ఇస్లామాబాద్: ఇంటర్నెట్ సెన్సేషన్, పాకిస్తాన్ మోడల్ కాందిల్ బలోచ్ గత ఏప్రిల్‌లో హత్యకుగురైనా.. నిందితులకు శిక్షపడకపోవడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేర్ అండ్ డాషింగ్‌గా వ్యవహరించే కాందిల్ను సొంత సోదరుడు మహ్మద్ వసీమ్, హక్ నవాబ్ అనే వ్యక్తితో కలిసి హత్యచేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా విచారణ చేపట్టని కారణంగా శిక్షపడలేదని పాక్ నెటిజన్లు మండిపడుతున్నారు. కాందిల్ హత్యకు గురై ఏడాది కావస్తున్న నేపథ్యంలో గతంలో కాందిల్ బలోచ్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మత నిబంధలను ఉల్లంఘిస్తూ తరచుగా వివాదాల్లో నిలిచే కాందిల్.. ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించేవారని, ఏ విషయంలోనూ ఎవరికీ భయపడే మనస్తత్వం ఆమెది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'పాకిస్తాన్ కిమ్ కర్దాషియన్' కాందిల్ను దారుణహత్య చేశారంటూ ముల్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ముందుగా డ్రగ్స్ తీసుకుని, ఆ తర్వాత పీకనొక్కి తన సోదరిని చంపినట్లు నిందితుడు వసీమ్ గతంలోనే అంగీకరించాడు. నవాజ్ పాత్ర ఏంటన్నది తేలుస్తామని చెప్పిన పోలీసులు విచారణ కొనసాగించారా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంతో గందరగోళం నెలకొని స్పష్టత కరువైందని మృతిచెందిన మోడల్ కాందిల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆడాళ్లు పరువు హత్యలు మొదలుపెడితే...
ముంబై: వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ హత్యపై పాకిస్థాన్ కు చెందిన బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ స్పందించాడు. కందిల్ హత్యకు గురికావడం బాధ కలిగిచిందని వ్యాఖ్యానించాడు. పడుతులు పరువు హత్యలు చేయడం మొదలు పెడితే మగాళ్లలో చాలా మందికి మూడినట్టేనని అన్నాడు. 'తమ గౌరవాన్ని నిలుపుకునేందుకు మనల్ని మహిళలు మర్డర్లు చేయడం మొదలుపెడితే, మనలో చాలా మంది చావడం ఖాయమ'ని ట్వీట్ చేశాడు. అయితే పాకిస్థాన్ లో పరిస్థితులు అంత దారుణంగా లేవని చెప్పాడు. 'సినిమాల్లో రొమాంటిక్ పాత్రల్లో నటిస్తాను. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న వాటి గురించి స్పందిస్తాను. నేను ఆశావాదిని. పాకిస్థాన్ లో అంతా చెడే జరగడం లేదు. పాక్ సినిమా పరిశ్రమ వృద్ధి చెందుతోంది. అక్కడ అద్భుత ప్రతిభ కలిగిన కళాకారులున్నారు. పాక్ యువత కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఉంటున్నారు. ఇది శుభపరిణామ'ని అలీ జాఫర్ పేర్కొన్నాడు. If women started killing us to protect their honour, a lot of us would be dead! — Ali Zafar (@AliZafarsays) 16 July 2016 -
మోడల్ హత్య: మరో నిందితుడి లొంగుబాటు
పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఖందిల్ బలోచ్ హత్యకేసులో సహ నిందితుడు, ఆమె మరో సోదరుడు హక్ నవాజ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ హత్యలో అతడి హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు పంజాబ్ రాష్ట్రంలోని డేరా ఘాజీఖాన్ వద్ద పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో ఇంతకుముందు బలోచ్ సొంత సోదరుడు మహ్మద్ వసీమ్‌ను పోలీసులు శనివారమే అరెస్టు చేశారు. తాజాగా నవాజ్ కూడా లొంగిపోయాడు. తాను ముందుగా డ్రగ్స్ తీసుకుని, ఆ తర్వాత పీకనొక్కి తన సోదరిని చంపినట్లు వసీమ్ ఇంతకుముందే చెప్పాడు. ఇందులో నవాజ్ పాత్ర ఎంతో తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లాహోర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వసీమ్‌కు డీఎన్ఏ, పాలీగ్రాఫ్ పరీక్షలు చేయించారు. ముల్తాన్ నగరంలోని తమ ఇంట్లో బలోచ్‌ను ఈనెల 15వ తేదీన వసీమ్ హతమార్చాడు. బలోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు తనను గుర్తుంచుకుంటాయని మహ్మద్ వసిమ్ అన్నాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే హత్య చేశానన్నాడు. తాను మాదక ద్రవ్యాలకు బానిసయినా, స్పృహలో ఉండే ఈ హత్య చేశానని వసీమ్ చెప్పాడు. ఖందిల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరి ఎప్పుడూ ఇలా ఉండలేదని చెప్పాడు. -
నా కొడుకు కనబడితే కాల్చిచంపండి
ఇస్లామాబాద్: పాకిస్థానీ సోషల్ మీడియా సెన్సేషన్, మోడల్ ఖందిల్ బులోచ్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు స్పందించారు. తన కూతుర్ని కిరాతకంగా గొంతు నులిమి చంపిన తన కొడుకు కనబడితే కాల్చి చంపాలని ఆమె తండ్రి అన్వర్ హసీమ్ పేర్కొన్నాడు. ఇంటర్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఖందిల్ తనతో స్నేహితురాలిగా ఉండేదని ఆయన అన్నాడు. తన కొడుకు వసీం ఒట్టి వెధవ అని చెప్పాడు. ఖందిల్ తల్లి మాట్లాడుతూ.. తనతో కష్టసుఖాలు పంచుకునే కూతురు ఇప్పుడు దూరమైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రోజు రాత్రి తాము తాగిన పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో తాము గాఢ నిద్రలోకి జారుకున్నామని తెలిపింది. ఉదయం అల్పాహారానికి ఖందిల్ ను పిలుద్దామని వెళ్లగా ఆమె అప్పటికే విగతజీవిగా పడుందని చెప్పింది. ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తూ కుటుంబ పరువుతీస్తోందని ఆరోపిస్తూ ఖందిల్ ను ఆమె సోదరుడు వసీమ్ ఈనెల 14న హత్య చేసిన విషయం తెలిసిందే. -
నా సోదరిని చంపినందుకు గర్వంగా ఉంది
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఖందిల్ బులోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు నన్ను గుర్తుంచుకుంటాయని ఆమె సోదరుడు మహ్మద్ వసిమ్ అన్నాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే హత్య చేశానన్నాడు. శనివారం వసీమ్ ను అరెస్టు పోలీసులు సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాను మాదక ద్రవ్యాలకు బానిసయినా, స్పృహలో ఉండే ఈ హత్య చేశానని వసీమ్ చెప్పాడు. ఖందిల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరి ఎప్పుడూ ఇలా ఉండలేదని చెప్పాడు. -
మోదీని, కోహ్లిని, నన్ను ఇష్టపడ్డందుకే.. ఆ దారుణం!
-
మోదీని, కోహ్లిని, నన్ను ఇష్టపడ్డందుకే.. ఆ దారుణం!
బాలీవుడ్ లో వివాదాల రాణిగా పేరొందిన ఐటంగర్ల్ రాఖీ సావంత్ పాకిస్థాన్ మోడల్ ఖందీల్ బలోచ్ హత్యపై తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా సెన్సేషన్ గా పేరొందిన బలోచ్ ను సొంత సోదరుడే దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. పరువు హత్యగా పోలీసులు దీనిని భావిస్తుండగా.. రాఖీ సావంత్ మాత్రం తనదైన కారణాలను చెప్పింది. 'ఎందుకు బలోచ్ ను చంపారు. ఆమె ఎక్స్ పోజింగ్ చేసినందుకా.. లేక నరేంద్రమోదీజీని, విరాట్ కోహ్లిని, కత్రినాను, కరీనాను, నన్ను ఇష్టపడ్డందుకు ఆమెను చంపేశారు. ఈ హత్యకు కారణాలేమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను' అంటూ రాఖీ పేర్కొంది. కందీల్ హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె ఆరోపించింది. ఆమె హత్యకు కారణమైన సోదరుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. -
'పరువు తీస్తోంది.. అందుకే చంపా'
ఇస్లామాబాద్: తమ కుటుంబ పరువు తీస్తున్నందువల్లే తన సోదరిని హతమార్చానని ప్రముఖ పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెలబ్రిటీ ఖందిల్ బలోచ్ సోదరుడు వసీమ్ చెప్పాడు. తానే ఈ హత్య చేసినట్లు చెప్పాడు. పాకిస్థాన్ సోషల్ మీడియా సెలబ్రిటీ, ఇంటర్నెట్ సెన్సేషన్ గా పేరొందిన ఖందిల్ బలోచ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఖందిల్ బులోచ్ అసలు పేరు ఫౌజియా అజీమ్. మోడలింగ్ పేరుతో ఇంటర్ నెట్లో అశ్లీల వీడియోలను పోస్ట్ చేస్తూ కుటుంబ పరువు తీస్తోందని అందుకే ఆమెను హత్య చేసినట్టు ఆమె సోదరుడు వసీమ్ అంగీకరించాడు. శుక్రవారం రాత్రి అందరూ నిద్రించిన సమయంలో తాను ఒక్కడినే హతమార్చినట్టు తెలిపాడు. ఇందులో తన మరో సోదరునికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ లో పరువు హత్యలకు సెలబ్రిటీలు సైతం అతీతం కాదని ఖందిల్ హత్యతో స్పష్టమైంది. వసీమ్ ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అన్న చేతిలో హత్యకు గురైన ఖందిల్
-
సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం!
-
సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం!
అన్న చేతిలో హత్యకు గురైన ఖందిల్ పాకిస్థాన్ ఇంటర్నెట్ సెన్సెషన్ పేరొందిన ఖందిల్ బలోచ్ శనివారం ముల్తాన్‌లో హత్యకు గురయింది. సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. ముల్తాన్‌లోని తన సొంతూరు ముజఫర్బాద్ గ్రీన్టౌన్కు బలోచ్ ఈద్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు వెళ్లింది. అయితే, ఇంటర్నెట్లో ఫొటోలు పెడుతుండటంపై ఆమె సోదరుడు ఆమెను బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె హత్య జరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఖందిల్ బలోచ్‌కు గతంలోనే పలుసార్లు ఛాందసవాదుల నుంచి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రత కోసం ఆమె పాక్ హోంశాఖకు విజ్ఞప్తి చేసినా.. హోంశాఖ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈద్ అనంతరం ఆమె విదేశాల్లో స్థిరపడాలని నిశ్చయించుకున్నారని ఇంతలోనే ఈ దారుణం జరిగిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఖందిల్ తాజాగా విడుదల చేసిన ’బ్యాన్’ అనే మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పాకిస్థాన్ లో పెద్ద చర్చను లేవనెత్తింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ గా ఖందిల్ బలోచ్‌ను తీసుకోవాలని మొదట భావించారు. కానీ కుదరలేదు. సోషల్ మీడియాలో ఫొటొలు పెట్టి.. కామెంట్లు చేయడం ద్వారా ఫేమస్ అయిన ఖందిల్ ను పాక్ పూనం పాండేగా పేరు తెచ్చుకుంది. -
'పాకిస్థాన్ ఇంటర్నెట్ సంచలనం' వివాదం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్నెట్ సంచలనం కాందీల్ బాలోచ్ మరో వివాదానికి కారణమైంది. సెల్ఫీతో మతాధికారి పదవికి ఎసరు పెట్టింది. మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావితో తీసుకున్న సెల్ఫీని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఖావి పక్కన కూర్చుని ఆయనను సరదాగా ఆట పట్టించింది. ఆయన టోపీ పెట్టుకుని సెల్ఫీ తీసుకుంది. అదే సమయంలో అబ్దుల్ ఖావి సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా సెల్ఫీలో ఉంది. బాలోచ్ తో సన్నిహితంగా మెలిగినందుకు మతాధికారి పదవి నుంచి ఖావిని మతవ్యవహారాల శాఖ తొలగించింది. కాగా, ఇఫ్తార్ విందుకు రావాలని ఖావి ఆహ్వానించడంతో ఆయన వద్దకు వెళ్లానని బాలోచ్ వెల్లడించింది. తనకు ఆయన 'ప్రపోజ్' చేశారని చెప్పి బాంబు పేల్చింది. బాలోచ్ చెప్పిన విషయాలను ఖావి తోసిపుచ్చారు. తమ విషయాలు నేర్చుకుంటానని చెప్పడంతో ఆమెను ఆహ్వానించానని ఖావి తెలిపారు. నిష్టగా రంజాన్ ఉపవాసం చేస్తానని తనకు చెప్పిందన్నారు. కాగా, గతంలోనూ బాలోచ్ సంచలన ప్రకటనలతో వార్తల్లోకి ఎక్కింది. టీ20 ప్రపంచకప్ లో ఇండియాను పాకిస్థాన్ టీమ్ ఓడిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటించి కలకలం రేపింది. -
టీమిండియాను ఓడిస్తే.. న్యూడ్ డాన్స్ చేస్తా..
ఇస్లామాబాద్: టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్ షో అంటూ అప్పట్లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ భామ పూనం పాండే బాటలో తాజాగా మరో భామ వెలుగులోకి వచ్చింది. షాహిద్ ఆఫ్రిది సారధ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు...టీమిండియాను మట్టి కరిపిస్తే స్ట్రిప్ డ్యాన్స్ (ఒంటిపై ఉన్న బట్టలు ఒక్కోటి విప్పుతూ చేసే డ్యాన్స్) చేస్తానంటూ పాకిస్తానీ మోడల్ కాందీల్ బాలోచ్ సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేసింది. దీంతోపాటుగా ఆ డ్యాన్స్ ను పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితం అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్ లో టీమిండియాపై పాక్ గెలిస్తే , అందరి ముందు తాను 'స్ట్రిప్ డాన్స్' చేస్తానంటూ తన ఫేస్ బుక్ ఖాతా లో వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అంతేకాదు, ఇదంతా పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితమిస్తానని, ఒకే ఒక్కసారి ఇండియాను ఓడించమంటూ షాహిద్ అఫ్రిదిని వేడుకుంది ఈ బ్యూటీ. దీంతో ఇప్పుడు అమ్మడి ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను దాదాపు నాలుగున్నర లక్షలమంది వీక్షించారు.