
మోదీని, కోహ్లిని, నన్ను ఇష్టపడ్డందుకే.. ఆ దారుణం!
బాలీవుడ్ లో వివాదాల రాణిగా పేరొందిన ఐటంగర్ల్ రాఖీ సావంత్ పాకిస్థాన్ మోడల్ ఖందీల్ బలోచ్ హత్యపై తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా సెన్సేషన్ గా పేరొందిన బలోచ్ ను సొంత సోదరుడే దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. పరువు హత్యగా పోలీసులు దీనిని భావిస్తుండగా.. రాఖీ సావంత్ మాత్రం తనదైన కారణాలను చెప్పింది.
'ఎందుకు బలోచ్ ను చంపారు. ఆమె ఎక్స్ పోజింగ్ చేసినందుకా.. లేక నరేంద్రమోదీజీని, విరాట్ కోహ్లిని, కత్రినాను, కరీనాను, నన్ను ఇష్టపడ్డందుకు ఆమెను చంపేశారు. ఈ హత్యకు కారణాలేమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను' అంటూ రాఖీ పేర్కొంది. కందీల్ హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె ఆరోపించింది. ఆమె హత్యకు కారణమైన సోదరుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.