'పరువు తీస్తోంది.. అందుకే చంపా' | Qandeel Baloch murder: Brother arrested by police, admits to killing her for 'family honour' | Sakshi
Sakshi News home page

'పరువు తీస్తోంది.. అందుకే చంపా'

Published Sun, Jul 17 2016 2:10 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

'పరువు తీస్తోంది.. అందుకే చంపా' - Sakshi

'పరువు తీస్తోంది.. అందుకే చంపా'

ఇస్లామాబాద్: తమ కుటుంబ పరువు తీస్తున్నందువల్లే తన సోదరిని హతమార్చానని ప్రముఖ పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెలబ్రిటీ ఖందిల్ బలోచ్ సోదరుడు వసీమ్ చెప్పాడు. తానే ఈ హత్య చేసినట్లు చెప్పాడు. పాకిస్థాన్ సోషల్ మీడియా సెలబ్రిటీ,  ఇంటర్నెట్‌ సెన్సేషన్ గా  పేరొందిన ఖందిల్ బలోచ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఖందిల్ బులోచ్ అసలు పేరు ఫౌజియా అజీమ్. మోడలింగ్ పేరుతో ఇంటర్ నెట్లో అశ్లీల వీడియోలను పోస్ట్ చేస్తూ కుటుంబ పరువు తీస్తోందని అందుకే ఆమెను హత్య చేసినట్టు ఆమె సోదరుడు వసీమ్ అంగీకరించాడు. శుక్రవారం రాత్రి అందరూ నిద్రించిన సమయంలో తాను ఒక్కడినే హతమార్చినట్టు తెలిపాడు. ఇందులో తన మరో సోదరునికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ లో పరువు హత్యలకు సెలబ్రిటీలు సైతం అతీతం కాదని ఖందిల్ హత్యతో స్పష్టమైంది. వసీమ్ ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement