నా కొడుకు కనబడితే కాల్చిచంపండి | Pakistani Model Qandeel Baloch's Father Wants Son To Be 'Shot' | Sakshi
Sakshi News home page

నా కొడుకు కనబడితే కాల్చిచంపండి

Published Fri, Jul 22 2016 4:42 PM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

నా కొడుకు కనబడితే కాల్చిచంపండి - Sakshi

నా కొడుకు కనబడితే కాల్చిచంపండి

ఇస్లామాబాద్: పాకిస్థానీ సోషల్ మీడియా సెన్సేషన్, మోడల్ ఖందిల్ బులోచ్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు స్పందించారు. తన  కూతుర్ని కిరాతకంగా గొంతు నులిమి చంపిన తన కొడుకు కనబడితే కాల్చి చంపాలని ఆమె తండ్రి అన్వర్ హసీమ్ పేర్కొన్నాడు.

ఇంటర్ నేషనల్ మీడియాతో  మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఖందిల్ తనతో స్నేహితురాలిగా ఉండేదని ఆయన అన్నాడు. తన కొడుకు వసీం ఒట్టి వెధవ అని చెప్పాడు. ఖందిల్ తల్లి మాట్లాడుతూ.. తనతో  కష్టసుఖాలు పంచుకునే కూతురు ఇప్పుడు  దూరమైందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ రోజు రాత్రి తాము తాగిన పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో తాము గాఢ నిద్రలోకి జారుకున్నామని తెలిపింది. ఉదయం అల్పాహారానికి ఖందిల్ ను పిలుద్దామని వెళ్లగా ఆమె అప్పటికే విగతజీవిగా పడుందని  చెప్పింది. ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేస్తూ కుటుంబ పరువుతీస్తోందని ఆరోపిస్తూ ఖందిల్ ను ఆమె సోదరుడు వసీమ్ ఈనెల 14న హత్య చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement