ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని ఒక ఇంటిపై పాకిస్తాన్ జండా ఎగురవేసిన ఉదంతం వెలుగు చూసింది. ఎవరో దీనికి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి పోలీసుల వరకూ చేరడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆ పాక్ జెండాను అక్కడి నుంచి తొలగించడంతో పాటు ఇంటి యజమానితో పాటు అతని కుమారునిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
ఈ ఉదంతం భగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుఢాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక వస్త్రవ్యాపారి ఇంటిపై పాక్ జండా ఎగురుతున్నదని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పాక్ జెండాను గమనించి దానికి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేశారు. అనంతరం జండాను తొలగించారు.
అదే ఇంటిలో ఉంటున్న రయూస్(45), అతని కుమారుడు సల్మాన్(25)లను అరెస్టు చేశారు. వీరిద్దరిపై 153ఏ, 153బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి, విచారించిన అనంతరం కోర్టుకు అప్పగించారు. ఈ ఉదంతం గురించి ఎస్‌ఎస్‌పీ హెమరాజ్ మీణా మాట్లాడుతూ నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, కేసు దర్యాప్తులో ఉన్నదని తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు?
Comments
Please login to add a commentAdd a comment