hoste
-
ఇంటిపై పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని ఒక ఇంటిపై పాకిస్తాన్ జండా ఎగురవేసిన ఉదంతం వెలుగు చూసింది. ఎవరో దీనికి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి పోలీసుల వరకూ చేరడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆ పాక్ జెండాను అక్కడి నుంచి తొలగించడంతో పాటు ఇంటి యజమానితో పాటు అతని కుమారునిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ ఉదంతం భగత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుఢాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక వస్త్రవ్యాపారి ఇంటిపై పాక్ జండా ఎగురుతున్నదని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పాక్ జెండాను గమనించి దానికి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేశారు. అనంతరం జండాను తొలగించారు. అదే ఇంటిలో ఉంటున్న రయూస్(45), అతని కుమారుడు సల్మాన్(25)లను అరెస్టు చేశారు. వీరిద్దరిపై 153ఏ, 153బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి, విచారించిన అనంతరం కోర్టుకు అప్పగించారు. ఈ ఉదంతం గురించి ఎస్ఎస్పీ హెమరాజ్ మీణా మాట్లాడుతూ నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, కేసు దర్యాప్తులో ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు? -
ట్రంప్ భార్యకు మిషెల్లీ అరుదైన ఆతిథ్యం
వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా త్వరలో రానున్న కొత్త ప్రథమ మహిళ డోనాల్డ్ ట్రంప్ భార్య మిలానియా ట్రంప్‌కు అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. త్వరలో ఆమె అడుగుపెట్టనున్న శ్వేత సౌదం దానికి సంబంధించిన ఇతర భవనాల గురించి తన అనుభవాలు పంచుకున్నారు. తేనీరును కూడా పంచుకున్న మిషెల్లీ.. ఒక్కసారి అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టాక ఎన్నో భావోద్వేగాలు అలుముకుంటాయని, అవన్నీ ఎప్పటికీ వదిలిపెట్టబుద్ధికానంత గొప్పగా అందంగా ఉంటాయని వివరించారు. మిలానియాను శ్వేత సౌదానికి చెందిన ప్రైవేటు భవనంలో తిప్పుతూ ప్రముఖమైన ట్రూమన్ బాల్కనీ వద్దకు కూడా తీసుకెళ్లారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తన పిల్లలను ఎలా పెంచానన్న అనుభవాలు కూడా ఆమెతో పంచుకున్నారు. శ్వేత సౌదంలో నివసించడమనేది ఫిష్బౌల్లో ఉంటున్నట్లుంటుందని, మ్యూజియంలో జీవిస్తున్నంత అద్బుతంగా ఉంటుందని మిలానియా ట్రంప్ కు తెలియజేశారు. మిలానియాకు కూడా అచ్చం ఇలాంటి అనుభూతులే కలుగుతాయని మిషెల్లీ చెప్పారని, త్వరలో శ్వేతసౌదాన్ని విడిచి వెళుతున్న ఆమె మధ్యమధ్యలో కొంత భావోద్వేగానికి లోనయ్యారని వౌట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు.