నా సోదరిని చంపినందుకు గర్వంగా ఉంది | 'People will remember me with honour for killing Qandeel,' boasts her brother Wasim | Sakshi
Sakshi News home page

నా సోదరిని చంపినందుకు గర్వంగా ఉంది

Published Mon, Jul 18 2016 4:46 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

నా సోదరిని చంపినందుకు గర్వంగా ఉంది - Sakshi

నా సోదరిని చంపినందుకు గర్వంగా ఉంది

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మోడల్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఖందిల్ బులోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు నన్ను గుర్తుంచుకుంటాయని ఆమె సోదరుడు మహ్మద్ వసిమ్ అన్నాడు. తమ కుటుంబానికి తలవంపులు తెస్తున్నందుకే హత్య చేశానన్నాడు. శనివారం వసీమ్ ను అరెస్టు  పోలీసులు  సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

తాను మాదక ద్రవ్యాలకు బానిసయినా, స్పృహలో ఉండే ఈ హత్య చేశానని వసీమ్ చెప్పాడు. ఖందిల్ ఇంటర్నెట్ లో అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తున్నందుకే హత్య చేశానన్నాడు. అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, అయితే తన సోదరి ఎప్పుడూ ఇలా ఉండలేదని చెప్పాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement