సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం! | Qandeel Baloch shot dead in Multan | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం!

Published Sat, Jul 16 2016 1:06 PM | Last Updated on Mon, Oct 22 2018 6:23 PM

సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం! - Sakshi

సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం!

  • అన్న చేతిలో హత్యకు గురైన ఖందిల్

  • పాకిస్థాన్ ఇంటర్నెట్‌ సెన్సెషన్ పేరొందిన ఖందిల్ బలోచ్ శనివారం ముల్తాన్‌లో హత్యకు గురయింది. సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.

    ముల్తాన్‌లోని తన సొంతూరు ముజఫర్‌బాద్ గ్రీన్‌టౌన్‌కు బలోచ్ ఈద్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు వెళ్లింది. అయితే, ఇంటర్నెట్‌లో ఫొటోలు పెడుతుండటంపై ఆమె సోదరుడు ఆమెను బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె హత్య జరిగింది.

    సోషల్ మీడియాలో ఫేమస్‌ కావడంతో ఖందిల్ బలోచ్‌కు గతంలోనే పలుసార్లు ఛాందసవాదుల నుంచి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రత కోసం ఆమె పాక్ హోంశాఖకు విజ్ఞప్తి చేసినా.. హోంశాఖ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈద్ అనంతరం ఆమె విదేశాల్లో స్థిరపడాలని నిశ్చయించుకున్నారని ఇంతలోనే ఈ దారుణం జరిగిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

    ఖందిల్ తాజాగా విడుదల చేసిన ’బ్యాన్’ అనే మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పాకిస్థాన్‍ లో పెద్ద చర్చను లేవనెత్తింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ గా ఖందిల్ బలోచ్‌ను తీసుకోవాలని మొదట భావించారు. కానీ కుదరలేదు. సోషల్ మీడియాలో ఫొటొలు పెట్టి.. కామెంట్లు చేయడం ద్వారా ఫేమస్ అయిన ఖందిల్ ను పాక్ పూనం పాండేగా పేరు తెచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement