ఇస్లామాబాద్: ప్రపంచంలోని పలు దేశాలు సోషల్ మీడియాను నిషేధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ చేరింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నూతన ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ప్రభుత్వ అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
ది న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపిన వివరాల ప్రకారం పాక్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని, పత్రాలను బయటకు లీక్ చేయకుండా ఉండేందుకే ఈ నూతన నిబంధన విధించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
పాక్ అధికారిక నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రూల్స్ 1964 ప్రకారం నడుచుకోవాలి. తమ అభిప్రాయాలను వెల్లడించకూడదు. ప్రభుత్వ ప్రతిష్టను ప్రతిబింబించేలా ప్రకటనలు చేయకూడదు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, దేశ సార్వభౌమాధికారం, గౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment