governmen
-
పాక్‌లో సోషల్ మీడియాపై నిషేధం
ఇస్లామాబాద్: ప్రపంచంలోని పలు దేశాలు సోషల్ మీడియాను నిషేధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ చేరింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నూతన ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ప్రభుత్వ అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.ది న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపిన వివరాల ప్రకారం పాక్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని, పత్రాలను బయటకు లీక్ చేయకుండా ఉండేందుకే ఈ నూతన నిబంధన విధించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవలసి ఉంటుంది.పాక్ అధికారిక నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రూల్స్ 1964 ప్రకారం నడుచుకోవాలి. తమ అభిప్రాయాలను వెల్లడించకూడదు. ప్రభుత్వ ప్రతిష్టను ప్రతిబింబించేలా ప్రకటనలు చేయకూడదు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, దేశ సార్వభౌమాధికారం, గౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. -
వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం
నూతన సంవత్సరం(2024)తొలి రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రంలోని వృద్ధులకు నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం తరపున ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు. ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ వృద్ధులను తీర్థయాత్రలకు తీసుకువెళ్లే పథకాన్ని ప్రారంభించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తొలిసారిగా వృద్ధులకు తీర్థయాత్ర పథకాన్ని ప్రారంభించిందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. వృద్ధులు బస్సులు, రైళ్ల ద్వారా ఉచితంగా తీర్థయాత్రలు చేసే అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు తాజాగా పంజాబ్‌లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం భగవంత్ మాన్ యాత్రికుల కోసం చార్టర్డ్ విమానాలను బుక్ చేశారు. ఫలితంగా ఆర్థిక స్థోమత లేని వృద్ధులు చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి పాట్నా సాహిబ్, వారణాసి, నాందేడ్ సాహిబ్‌లను సందర్శించే అవకాశం కలిగింది. -
‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? ‘సనాతనం’పై ఎందుకంత చర్చ?
నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుండి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పదాలలో ఒకటి ‘ఓం’. ఇది సనాతన ధర్మానికి చిహ్నం. నేపాల్‌లో 20216వ సంవత్సరం నుండి నిఘంటువును మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై నేపాల్ సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేపాల్ ప్రభుత్వం తీరుపై సనాతన ధర్మాన్ని నమ్ముతున్న అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించే అంశం ఇటీవలిది కాదు. 2012 నుంచి కొనసాగుతోంది. నాడు నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉంది. అప్పటి విద్యాశాఖ మంత్రి దీనానాథ్ శర్మ ఆదేశాల మేరకు డిక్షనరీలో మార్పులు చేసేందుకు కమిటీని వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బుద్ధుడు, బ్రాహ్మణుడు మొదలైన వాటితో పాటు ఓం, శ్రీ తదితర పదాలన్నింటినీ నిఘంటువు నుండి తొలగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంలోని సంకీర్ణమైన సోషలిస్టు ఫ్రంట్ వ్యతిరేకిస్తోంది. నేపాలీ కాంగ్రెస్ ఎంపీ శంకర్ భండారీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని బహిరంగంగా దుయ్యబడుతున్నారు. నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించడం సనాతన సంస్కృతిపై దాడి చేయడం లాంటిదేనని ఆయన ఆరోపించారు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావంతో జరుగుతున్న కుట్రగా ఆయని దీనిని అభివర్ణించారు. సనాతన ధర్మంలో ‘ఓం’ అనే పదాన్ని శివుని చిహ్నంగా పరిగణిస్తారు. ఇది చాలా పవిత్రమైనదని, శక్తివంతమైనదని చెబుతారు. చాలా మంత్రాలు ‘ఓం’ అనే పదంతోనే ప్రారంభమవుతాయి. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? -
హామీ బూటకం మాఫీ నాటకం
అది పాతకడపలోని రాయలసీమ గ్రామీణ బ్యాంకు. అందులో 630 మంది రైతులు సుమారు రూ.2.88 కోట్లు పంట రుణాలుగా పొందారు. చంద్రబాబు ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని వారంతా ఆశించారు. ఆరు నెలల ఎదురుచూపు తర్వాత కేవలం 21 మంది రైతులే రుణమాఫీకి అర్హులంటూ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం మాఫీ అయ్యేది రూ.5లక్షలే. మిగతా రూ.2.83 కోట్లు అనర్హులని తేల్చిన 609 మంది రైతులే చెల్లించాలట. తామేందుకు అనర్హులమో చెప్పాలని ఆ రైతులు పట్టుబడుతున్నారు. చింతకొమ్మదిన్నె రాయలసీమ గ్రామీణ బ్యాంకులో 1403 మంది రైతులు రూ.5.86 కోట్లు రుణాలు పొందారు. చంద్రబాబు హామీని నమ్మి రెన్యువల్స్ చేసుకోలేదు. ఆమేరకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడుతోన్న నష్ట నివారణ ఆస్కారం లేకుండా పోయింది. తాజాగా రుణమాఫీ జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. 728 మందినే అర్హులుగా తేల్చింది. తక్కిన వారికి రుణమాఫీ వర్తించదా? నష్టపోతున్న పంటలకు నష్ట పరిహారం, అదనపు వడ్డీ భారం ఎవరు భరించాలి?అన్న రైతన్న ప్రశ్నలకు జవాబుల్లేవు. సాక్షి ప్రతినిధి, కడప: పై రెండు ఘటనలు ప్రభుత్వ రుణమాఫీలో వాస్తవాలకు మచ్చుతునకలు. జిల్లాలో లక్షలాది మంది రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. జిల్లాలో సుమారు 12లక్షల మంది రైతన్నలు రుణాలు మాఫీ అవుతాయని ఆశించారు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక, రుణాలు మాఫీకి విధివిధానాలంటూ కొత్తరాగం తీయడంతోనే రైతాంగం నిరాశ నిస్పృహలకు గురైంది. జిల్లాలో 2013-14 వరకూ 6,38,421మంది రైతులు రూ. 6063.19కోట్ల పంట రుణాలుగా వివిధ బ్యాంకుల్లో బకాయి ఉన్నారు. మరో 5,59,493 మంది రైతులు రూ.2,124.43 కోట్లు బంగారు ఆభరణాలపై రుణాలు పొందారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు మేరకు అవన్నీ రద్దు అవుతాయని రుణగ్రహితలు భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త నిర్ణయంతో రైతన్నలు ఆశలు రోజురోజుకు నీరుగారిపోయాయి. ఆశలు ఆడియాశలుగా మారిన విధం... అధికారంలోకి రాగానే రైతులు,డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల హామీతో ప్రజానీకం ఆశగా ఎదురు చూసింది. జిల్లాలో సుమారు 12లక్షల మంది రైతన్నలు రుణాలు మాఫీ అవుతాయని ఆశించారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విధివిధానాలంటూ కొత్తరాగం తీయడంతో రైతాంగం ఆశలు సన్నగిల్లాయి. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులకు ముడిపెట్టి 3,08,377 ఖాతాలున్న జాబితాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రభుత్వం కేవలం 70,452 మందికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లకు జాబితా పంపారు. ప్రభుత్వ తీరుతో అదనపు భారం.... ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ ఓవైపు రుణమాఫీ వర్తించకపోగా, మరో వైపు ఉన్న అప్పు సకాలంలో చెల్లించని కారణంగా రైతన్నలు అదనపు భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే అప్పులన్నీ మటుమాయం అవుతాయని భావించిన అన్నదాతలు మరోభారం భరించాల్సి వచ్చింది. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోపు రుణాలు చెల్లించకపోతే రూ.13.5 శాతం వడ్డీ భరించాల్సి ఉంది. దాంతో పాటు ఇన్స్ఫెక్షన్ ఛార్జీలు రూపేణ బ్యాంకు రుణం ఉన్న ప్రతిరైతు రూ.150 భరించాల్సి ఉంది. ఈ కారణంగా జిల్లాలోని రుణగ్రహితలైన రైతన్నలు రూ.725 కోట్లు అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా లభ్యమైయ్యే క్రాప్ ఇన్సూరెన్సు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మిమోసపోయిన రైతాంగం ఇన్సూరెన్సు అవకాశాన్ని చేజార్చుకుంది. నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా... రైతులు, మహిళలు రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని పక్కాగా మోసగించారు. ప్రభుత్వ వైనం పట్ల ప్రజానీకం రగిలిపోతోంది. దగా పడ్డ ప్రజానీకానికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి ప్రకటించింది. అందులో భాగంగా ఇదివరకే అన్నీ మండల కేంద్రాలల్లో ధర్నాలు చేసింది. జిల్లా కేంద్రాలల్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం మహాధర్నా నిర్వహించదలిచారు. పాలకుల మోసపూరిత వైఖరికి నిరశనగా చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. -
అరకొరకొర!
పోయిన యేడు పంటలు సరిగ్గా పండలేదు. అప్పు కట్టేందుకు డబ్బులు సర్దుబాటు కాలేదు. ఇంతలోపే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని ప్రకటి ంచడంతో తీసుకున్న అప్పులు పోతాయేమోనని కట్టలేదు. ఐదెకరాల పొలానికి లద్దగిరి స్టేట్‌బ్యాంక్‌లో రూ.లక్ష అప్పు తీసుకున్నా. వడ్డీతో కలుపుకొని రూ.1.30 లక్షలు అయ్యింటుంది. ఇప్పుడేమో రూ.50 వేల లోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇది కేవలం కంటితుడుపే. పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయాలి. - వెంకటస్వామి, రైతు, ఎర్రదొడ్డి, కోడుమూరు మండలం సాక్షి, కర్నూలు : రుణమాఫీపై రోజుకో మాటతో రైతుల్లో గందరగోళం నెలకొంటోంది. మొదట్లో 20 శాతం రుణమాఫీ అన్న ప్రభుత్వం.. తాజాగా గురువారం కేవలం రూ. 50 వేలలోపు ఉన్న రుణాలను మొదట మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో జిల్లాలో ఏకంగా 3.67 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రుణమాఫీ జరగని పరిస్థితి నెలకొంది. మరోవైపు బంగారు రుణాలను మాఫీ చేయమని చెప్పడంతో కౌలు రైతులకూ కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. జిల్లాలోని 35 వేల మంది కౌలు రైతులు.. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నారు. వీరందరికీ ఇప్పుడు మాఫీ అయ్యే పరిస్థితి లేదు. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి వస్తున్న రోజుకో మాటతో బ్యాంకర్లు కాస్తా రైతులను పీడించడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల బంగారాన్ని వేలం వేస్తుండగా.. మరికొన్ని చోట్ల దాచుకున్న పొదుపు సొమ్ము కాస్తా రుణాల చెల్లింపు కింద జమ చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. అంతేకాకుండా 2013 సంవత్సరానికి సంబంధించిన పంటల బీమా సొమ్ము వస్తే దాన్ని కూడా రుణాల్లో జమ చేసుకునేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద రుణమాఫీపై రోజుకో గందరగోళం ప్రజల్లో నెలకొంటోంది. 1.57 లక్షల ఖాతాలకే లబ్ధి జిల్లాలో 6.50 లక్షల మంది రైతులున్నారు వీరికి చెందిన 5.24 లక్షల ఖాతాలకు సంబంధించి పంట, బంగారు రుణాలు కలిపి మొత్తం రూ. 3,600 వేల కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో పంట రుణాలే రూ. 2,200 కోట్లు. ఇక టర్మ్‌లోన్స్, బంగారు రుణాలన్నీ కలిపి మరో రూ. 1,400 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో కేవలం బంగారు రుణాలు మాత్రమే రూ. 600 కోట్లు. వాస్తవానికి ప్రభుత్వం కుటుంబానికి రూ. లక్షన్నర వరకు మాఫీ అని పేర్కొనడంతో జిల్లాలో రూ. 2,160 కోట్ల వరకు మాఫీ అవుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం సేకరించిన వివరాలన్నీ క్రోడీకరించుకున్న తర్వాత ఇటీవల 2.50 లక్షల అకౌంట్లకు సంబంధించిన వివరాలను మరోసారి తనిఖీ చేసి పంపాలని కోరుతూ రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నుంచి బ్యాంకర్లకు పంపారు. పరిశీలన అనంతరం ఈ ఖాతాల వివరాలను మంగళవారం సాయంత్రానికే తిరిగి ఎస్ఎల్బీసీకి పంపారు. ఇందులో రూ. 50 వేలలోపు ఉన్న రుణాలు కేవలం 30 శాతానికి మించవని ప్రాథమిక అంచనాకు బ్యాంకులు వచ్చాయి. అంటే జిల్లాలో వెంటనే రుణమాఫీ ద్వారా లబ్ధి పొందేది కేవలం 1.57 లక్షల ఖాతాలు మాత్రమేనన్నమాట. అంటే మరో 3.67 లక్షల ఖాతాలకు రుణమాఫీ ఎప్పుడు అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే, లక్షా 57 వేల ఖాతాల కింద ఎన్ని రుణాలున్నాయనే విషయాన్ని బ్యాంకర్లు ఎవరూ నిర్దారించడం లేదు. ఎన్నికల ముందు నుంచే రుణాల చెల్లింపులు నిలిపివేసిన రైతులు గడిచిన సంవత్సర కాలానికి 14 శాతం వడ్డీతోపాటు ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని కోల్పోయారు. పైగా రుణాలు చెల్లించనిదే కొత్త రుణాలు ఇచ్చేదీ లేదని బ్యాంకర్లు బల్లగుద్ది చెబుతుండడం.. వడ్డీ భారం రోజురోజుకీ పెరిగిపోతుండడంతో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ విధంగా 14 శాతం వడ్డీ లెక్కన జిల్లాలోని రైతులపై రూ. 300 కోట్ల అదనపు భారం పడిందనేది బ్యాంకర్ల అంచనాలే చెబుతున్నాయి. కౌలు రైతుకు కొత్త కష్టాలు బంగారు రుణాలను మాఫీ చేయమంటున్న సీఎం ప్రకటనతో కౌలు రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. జిల్లాలో రుణ అర్హత కార్డులు తీసుకున్న కౌలు రైతులు 35 వేల మంది ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో లక్షా 50 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో రుణ అర్హత కార్డులు తీసుకున్న 35 వేల మంది బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నారు. వీరందరికీ ఇప్పుడు రుణ మాఫీ అయ్యే పరిస్థితి లేదు. మరోవైపు బంగారాన్ని వేలం వేసేందుకు బ్యాంకులు ఇప్పటికే సిద్ధపడ్డాయి. అనేక చోట్ల నోటీసులు కూడా ఇచ్చి వేలానికి సిద్ధపడితే.. రైతులు అడ్డుకున్న సంఘటనలు జరిగాయి. ఈ పరిణామాలతో రుణమాఫీకై ఎదురుచూస్తున్న కౌలు రైతుల ఆశలు కాస్తా ఆడియాశలయ్యాయి. దాదాపు రూ. 200 కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. ఈ రుణంపై 14 శాతం చొప్పున రూ. 28 కోట్ల వడ్డీ భారం పడింది. అయితే సకాలంలో వర్షాలు రాకపోవడం.. పంటల దిగుబడి అనుకున్న స్థాయిలో రాకపోవడంతో వీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. డ్వాక్రా సంఘాల పొదుపు హుష్‌కాకి...! జిల్లా వ్యాప్తంగా 35 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా.. రూ. 535 కోట్లు రుణాలు ఉన్నాయి. సర్కారు ఒక్కో సంఘానికి కేవలం రూ. లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. చంద్రబాబు మాటలు నమ్మి వారు రుణాలు చెల్లించకపోవడం బ్యాంకర్లు ముక్కుపిండి వాటిని వసూలు చేస్తున్నారు. 11.75 శాతం చొప్పున ఈ సంఘాలపై సుమారు రూ. 62 కోట్లు వడ్డీ భారం పడింది. అంతేకాకుండా జిల్లాలో కోడుమూరు తదితర ప్రాంతాల్లో బ్యాంకులు ఏకంగా.. ఇన్ని రోజులుగా డ్వాక్రా సంఘాలు చేసుకున్న పొదుపు మొత్తాలను కాస్తా రుణాల చెల్లింపు కింద జమ చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు చంద్రబాబు మాకు ఏదో చేస్తారని ఆశిస్తూ వచ్చిన రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు, నిరుద్యోగులు ఇక సర్కారును నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదని ఆందోళన బాటకు సిద్ధమవుతున్నాయి. బాబు మాయమాటలు నమ్మి మోసపోయామంటూ లబోదిబోమంటున్న అన్నదాతలు శుక్రవారం రోడ్డెక్కెందుకు సన్నద్ధమవుతున్నారు.