నూతన సంవత్సరం(2024)తొలి రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రంలోని వృద్ధులకు నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం తరపున ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు. ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ వృద్ధులను తీర్థయాత్రలకు తీసుకువెళ్లే పథకాన్ని ప్రారంభించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తొలిసారిగా వృద్ధులకు తీర్థయాత్ర పథకాన్ని ప్రారంభించిందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. వృద్ధులు బస్సులు, రైళ్ల ద్వారా ఉచితంగా తీర్థయాత్రలు చేసే అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు తాజాగా పంజాబ్‌లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం భగవంత్ మాన్ యాత్రికుల కోసం చార్టర్డ్ విమానాలను బుక్ చేశారు. ఫలితంగా ఆర్థిక స్థోమత లేని వృద్ధులు చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి పాట్నా సాహిబ్, వారణాసి, నాందేడ్ సాహిబ్‌లను సందర్శించే అవకాశం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment