pligrims
-
వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం
నూతన సంవత్సరం(2024)తొలి రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రంలోని వృద్ధులకు నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం తరపున ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలియజేశారు. ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ వృద్ధులను తీర్థయాత్రలకు తీసుకువెళ్లే పథకాన్ని ప్రారంభించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తొలిసారిగా వృద్ధులకు తీర్థయాత్ర పథకాన్ని ప్రారంభించిందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. వృద్ధులు బస్సులు, రైళ్ల ద్వారా ఉచితంగా తీర్థయాత్రలు చేసే అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు తాజాగా పంజాబ్‌లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం భగవంత్ మాన్ యాత్రికుల కోసం చార్టర్డ్ విమానాలను బుక్ చేశారు. ఫలితంగా ఆర్థిక స్థోమత లేని వృద్ధులు చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి పాట్నా సాహిబ్, వారణాసి, నాందేడ్ సాహిబ్‌లను సందర్శించే అవకాశం కలిగింది. -
నేషనల్ హైవేపై ప్రమాదం.. పుణ్యస్నానాలకు వెళ్లి అనంతలోకాలకు..
గువాహటి: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానాల కోసం వెళ్లిన భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. మోరిగావ్ జిల్లాలోని ధరామ్‌తుల్ ఏరియాలో జాతీయ రహదారి 37పై రోడ్డు ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా ఒకే ప్రాంతానికి చెందిన కొందరు లోహిత్ నదిలో పుణ్యస్నానాలకు వెళ్లారు. పుణ్యస్నానాలు ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. యాత్రికులతో వెళ్తున్న వాహనం ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారికి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. ఇక, పుణ్యస్నానాల కోసం వెళ్లిన ఇలా ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. Assam | 3 dead & several injured after vehicle carrying pilgrims collides with a truck on NH-37 at Dharamtul area in Morigaon district. The pilgrims were returning after taking a holy dip in the Lohit river on Makar Sankranti. Injured have been admitted to the hospital: SHO pic.twitter.com/ckOcI9aMOE — ANI (@ANI) January 16, 2023 -
పల్నాడులో మండపోరులో భక్తులు
ఆకట్టుకున్న కత్తి సేవలు, ఆయుధాలకు గ్రామోత్సవాలు కారంపూడి: వీరాచారవంతులు కత్తులతో గుండెలపై బాదుకుంటూ ఆవేశంతో ఊగిపోతుండగా బ్రహ్మనాయుడు ఆయుధం నృరసింహకుంతం వారిపై ఒరిగి శాంతింప చేసింది. ఉత్సాలకు వచ్చిన ప్రతి ఆచారవంతుడు తమ ఆయుధాలతో వంతులవారీగా కత్తి సేవలు చేసుకున్నారు. వీరులగుడితోపాటు అంకాళమ్మ ఆలయం, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద బుధవారం మందపోరు జరిగింది. ఈ సందర్భంగా వీరుల ఆయుధాలకు నీరాజనాలు పలికారు. భక్తిపారవశ్యం వీరులగుడిలో పొంగళ్లు చేసుకుని నాగులేరులో ఆయుధాలను శుభ్రపరుచుకున్నారు. మహిళలు పొంగళ్లతో ఆయుధాల వెంట నడిచారు. పలనాటి యుద్ధంలో వీర మరణం పొందిన వారిని స్మరించుకుంటూ కత్తి సేవల్లో లీనమయ్యారు. మహిళలకు పూనకాలతో ఊగిపోయారు. విషాద వదనాలతో చివరకు బిగ్గరగా ఏడడం లాంటి సంఘటనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చెన్నకేశవస్వామి, అంకాళమ్మ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో బ్రహ్మనాయుడుగా భావించే పీఠాధిపతి తరుణ్చెన్నకేశవకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయుధాలకు గ్రామోత్సవాలు నిర్వహించారు. పోతురాజుకు ప్రత్యేక మొక్కుబడులు చెల్లించారు. చాపకూడు సిద్దాంతం అమలు బ్రహ్మనాయుడు చాపకూడు మండపం ఆవరణలో చాపకూడు సహపంక్తి భోజనాలు నిర్వహించారు. పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవ, జెడ్పీ ఛైర్పర్సన్ షేక్ జానీమూన్, కొమ్మారెడ్డి చలమారెడ్డి తదితరులు అన్నరాసులకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 5 వేల మంది సహపంక్తి భోజనాలు చేశారు. కథ వింటూ రాత్రంతా జాగారం... వీరులగుడిలో రాయబార కథాగానం బుధవారం తెల్లవారు జాము వరకు సాగింది. ఉదయగిరికి చెందిన వీర విద్యావంతుడు చీమలదిన్నె చెన్నయ్య(75) కథాగానం చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ఆచారవంతులు సపర్యలు చేశాక ఆయన కోలుకున్నారు. తర్వాత చీరాలకు చెందిన ముద్రగడ వెంకటేశ్వర్లు కథాగానం కొనసాగించారు. తోటవారిపాలేనికి చెందిన కత్తుల గోపి, కందుకూరుకు చెందిన గోవర్దన్, మంగళగిరికి చెందిన ముక్కంటి, వీరన్నకోట నరసింహం, దర్శికి చెందిన సింహాద్రి, వెన్నపూసల వెంకటేశ్వర్లు తదితరులు కథాగానాలు చేయడానికి వచ్చారు. పీఠాధిపతి తరుణ్ సమక్షంలో ఆచారవంతులు గుడిలో వీరంగం వేశారు. నేడు కోడి పోరు పల్నాటి వీరారాధనోత్సవాల్లో భాగంగా గురువారం కోడిపోరు జరగనుంది. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మల మధ్య అలనాడు జరిగిన కోడిపోరును బ్రహ్మనాయుడుగా పీఠాధిపతి, ఆచారవంతుడు నాగమ్మ వేషంలో కోడిపోరు సంప్రదాయం కోసం ప్రదర్శిస్తారు. బ్రహ్మనాయుడు పుంజు రతనాల చిట్టిమల్లు, నాయకురాలు పుంజు శివంగిడేగల మధ్య రెండుసార్లు జరిగిన పోరులో నాయకురాలు పుంజు ఓడిపోతుంది. అనంతరం ఓడిన వారు ఏడేళ్లు అరణ్యవాసం చేయాలనే షరతుతో మలిపోరు జరుగుతుంది. అప్పటికే అలసిపోయిన చిట్టిమల్లు నాయకురాలు కొత్త పుంజుపై ఓడిపోతుంది. వీరవిద్యావంతుల కథాగానం అనంతరం సంప్రదాయబద్ధంగా వీటిని నిర్వహిస్తారు. వీరులగుడి ఆవరణలో జరిగే వేడుక కార్యక్రమంలో వేలాదిగా జనం పాల్గొంటారు. వైఎస్సార్ సీపీ సీఎల్పీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. పోటోలు 30ఎంహెbŒlఆర్ఎల్45 వీరులగుడిలో ఆవేశంతో కత్తి సేవలు చేసుకుంటున్న వీరాచారవంతులు, 46 కధాగానం, 50 కత్తి సేవలు వీక్షిస్తున్న పీఠాధిపతి, 141 వీరులగుడిలో అర్ధరాత్రి కత్తి సేవ, 142 చాపకూడు అన్నంరాశికి పూజలు చేస్తున్న జెడ్పీఛైర్మన్ జానీమూన్, పీఠాధిపతి తరణ్చెన్నకేశవ -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూద్దాం
జాయింట్ పోలీస్ కమిషనర్ శ్రీహరికుమార్ విజయవాడ (లబ్బీపేట) : పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటం మన బాద్యత అని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఏ.శ్రీహరికుమార్ విద్యార్థులకు హితవు పలికారు. బందరురోడ్డులోని శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం తెలుగు, హిందీ విభాగాల ఆధ్వర్యంలో ‘తెలుగు, హిందీ సాహిత్యాలు – నదీ ప్రాశస్త్యం – పర్యావరణ చైతన్యం’ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ టి.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీహరికుమార్ జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. అతిథి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు వారి సంస్కతి, సంప్రదాయం ఎంతో గొప్పదన్నారు. మరో అతిథి జె.ఆత్మారామ్ మాట్లాడుతూ ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో.. పుష్కర స్నానం చేయడం వల్ల అంతే ఫలితం వస్తుందని చెప్పారు. సదస్సులో సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ ఎన్.లలితప్రసాద్, రాజగోపాల్ చ్రM] వర్తి, వై.పూర్ణచంద్రరావు, వలివేలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తెలుగు, హిందీ విభాగాధిపతులు డాక్టర్ ఎ.నాగజ్యోతి, రామలక్ష్మి పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు
ఇంద్రకీలాద్రిపై డీసీపీ సెంథిల్ పర్యటన విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని డీసీపీ ఎస్.సెంథిల్‌కుమార్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై గురువారం ఆయన ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏసీపీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత దుర్గగుడి అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఏఈవో అచ్యుతరామయ్య, రామమోహనరావు, ఈఈలు శ్రీరామకృష్ణ ప్రసాద్ కోటేశ్వరరావు, నూకరత్నంతో చర్చించారు. అనంతరం అమ్మవారి దర్శనం నిమిత్తం దేవస్థానం ఏర్పాటుచేస్తున్న క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో కొబ్బరి కాయలు కొట్టే ప్రదేశంలో చేయాల్సిన మార్పుల గురించి చర్చించుకున్నారు. అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కలిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం కనకదుర్గానగర్ను పరిశీలించారు. వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం ఇంద్రకీలాద్రిపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో గురువారం ఆడి కృత్తిక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో నిర్వహించిన దీపోత్సవంలో ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య పాల్గొన్నారు. తొలుత స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై తొలిసారి నిర్వహించిన ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని నాగపుట్ట వద్ద నిర్వహించిన దీపోత్సవంలో పాల్గొన్నారు.