నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుండి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పదాలలో ఒకటి ‘ఓం’. ఇది సనాతన ధర్మానికి చిహ్నం. నేపాల్‌లో 20216వ సంవత్సరం నుండి నిఘంటువును మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా ఈ అంశంపై నేపాల్ సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేపాల్ ప్రభుత్వం తీరుపై సనాతన ధర్మాన్ని నమ్ముతున్న అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించే అంశం ఇటీవలిది కాదు. 2012 నుంచి కొనసాగుతోంది. నాడు నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉంది. అప్పటి విద్యాశాఖ మంత్రి దీనానాథ్ శర్మ ఆదేశాల మేరకు డిక్షనరీలో మార్పులు చేసేందుకు కమిటీని వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బుద్ధుడు, బ్రాహ్మణుడు మొదలైన వాటితో పాటు ఓం, శ్రీ తదితర పదాలన్నింటినీ నిఘంటువు నుండి తొలగించాలని నిర్ణయించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంలోని సంకీర్ణమైన సోషలిస్టు ఫ్రంట్ వ్యతిరేకిస్తోంది. నేపాలీ కాంగ్రెస్ ఎంపీ శంకర్ భండారీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని బహిరంగంగా దుయ్యబడుతున్నారు. నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించడం సనాతన సంస్కృతిపై దాడి చేయడం లాంటిదేనని ఆయన ఆరోపించారు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావంతో జరుగుతున్న కుట్రగా ఆయని దీనిని అభివర్ణించారు. సనాతన ధర్మంలో ‘ఓం’ అనే పదాన్ని శివుని చిహ్నంగా పరిగణిస్తారు. ఇది చాలా పవిత్రమైనదని, శక్తివంతమైనదని చెబుతారు. చాలా మంత్రాలు ‘ఓం’ అనే పదంతోనే ప్రారంభమవుతాయి.
ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
Comments
Please login to add a commentAdd a comment