OM
-
‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? ‘సనాతనం’పై ఎందుకంత చర్చ?
నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుండి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పదాలలో ఒకటి ‘ఓం’. ఇది సనాతన ధర్మానికి చిహ్నం. నేపాల్‌లో 20216వ సంవత్సరం నుండి నిఘంటువును మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై నేపాల్ సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేపాల్ ప్రభుత్వం తీరుపై సనాతన ధర్మాన్ని నమ్ముతున్న అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించే అంశం ఇటీవలిది కాదు. 2012 నుంచి కొనసాగుతోంది. నాడు నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉంది. అప్పటి విద్యాశాఖ మంత్రి దీనానాథ్ శర్మ ఆదేశాల మేరకు డిక్షనరీలో మార్పులు చేసేందుకు కమిటీని వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బుద్ధుడు, బ్రాహ్మణుడు మొదలైన వాటితో పాటు ఓం, శ్రీ తదితర పదాలన్నింటినీ నిఘంటువు నుండి తొలగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంలోని సంకీర్ణమైన సోషలిస్టు ఫ్రంట్ వ్యతిరేకిస్తోంది. నేపాలీ కాంగ్రెస్ ఎంపీ శంకర్ భండారీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని బహిరంగంగా దుయ్యబడుతున్నారు. నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించడం సనాతన సంస్కృతిపై దాడి చేయడం లాంటిదేనని ఆయన ఆరోపించారు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావంతో జరుగుతున్న కుట్రగా ఆయని దీనిని అభివర్ణించారు. సనాతన ధర్మంలో ‘ఓం’ అనే పదాన్ని శివుని చిహ్నంగా పరిగణిస్తారు. ఇది చాలా పవిత్రమైనదని, శక్తివంతమైనదని చెబుతారు. చాలా మంత్రాలు ‘ఓం’ అనే పదంతోనే ప్రారంభమవుతాయి. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? -
ఆ సినిమా దెబ్బకొట్టింది, చాలా నష్టపోయా: కల్యాణ్ రామ్
పటాస్, 118 వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు హీరో నందమూరి కల్యాణ్ రామ్. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడీ హీరో. ప్రస్తుతం అతడు నటించిన బింబిసార మూవీ ఆగస్టు 5న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ తనను బాగా దెబ్బ తీసిన సినిమా పేరును వెల్లడించాడు. 'అతనొక్కడే, పటాస్, 118 సినిమాలతో సక్సెస్ రుచి చూశాను. కానీ ఓం సినిమా ఫలితం చూసి బాగా ఫీలయ్యాను. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ మా లెక్కలు తప్పాయి. ఓం నన్ను ఆర్థికంగా దెబ్బ తీసింది. కానీ పటాస్ వచ్చి అది మొత్తం రికవరీ చేసింది. బింబిసార సినిమాను తమ్ముడు తారక్ చూశాడు. బాలకృష్ణ కర్నూలు షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల ఇంకా ఈ సినిమా చూడలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సౌత్ హిట్స్‌తో బాలీవుడ్ బేజార్.. స్పందించిన బాలీవుడ్ నిర్మాత గ్యారేజీలో అనిల్ కాపురం.. హీరోయిన్‌తో సునీల్ దత్ లవ్‌స్టోరీ.. -
వస్తువులం కాదు.. మనుషులమే
న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఓ ముస్లిం ఖైదీ వీపు మీద బలవంతంగా ఓం గుర్తును ముద్రించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకోక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. ఇది చాలా అసాధరణమేకాక ఎంతో అవమానకరం కూడా. మేము మనుషులమే.. వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు.. తప్ప ఇందుకు వేరే ఇతర బలమైన కారణాలు ఏం లేవు కదా’ అని ట్వీట్ చేశారు. Everyday, a more innovative way is developed to humiliate us To brand someone like cattle is cruel, unusual & dehumanising. We’re not chattel, we’re HUMAN. (Let’s not pretend there’s any other reason why Nabbir was branded with this specific symbol)https://t.co/eFMUvWTJJZ — Asaduddin Owaisi (@asadowaisi) April 19, 2019 ఇంతకు విషయం ఏంటంటే షబ్బీర్ అలియాస్ నబ్బీర్ అనే వ్యక్తి తీహార్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం నబ్బీర్.. తమ బ్యారక్‌లోని ఇండక్షన్ స్టవ్ సరిగా పని చేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ‘ఫిర్యాదులు చేస్తున్నావ్.. నాయకుడిగా ఎదగాలని చూస్తున్నావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అంతటితో ఊరుకోక మెటల్ ఓం సింబల్‌ని తీసుకొచ్చి.. కాల్చి దాన్ని నబ్బీర్ వీపు మీద ముద్రించారు. ఓ రెండు రోజుల పాటు అతనికి భోజనం కూడా పెట్టలేదు. ఈ విషయం గురించి తోటి ఖైదీలకు ‘నబ్బీర్ హిందువుగా మారాడు. ప్రస్తుతం నవరాత్రి దీక్ష చేస్తున్నాడు. దానిలో భాగంగా ఉపవాసం ఉన్నాడని’ తెలిపారు. ఈ క్రమంలో జైలులో తనకు జరిగిన అవమానం గురించి నబ్బీర్ తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ క్రమంలో ఈ నెల 17న నబ్బీర్ కేసు ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో నబ్బీర్ తల్లి జైలులో తన కొడుకుకు ప్రాణాపాయం ఉందని బెయిల్ మంజూరు చేయమని కోర్టును కోరింది. దాంతో న్యాయమూర్తి విషయం ఏంటని ప్రశ్నించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
'ఓం' అంటే తప్పేంటి?
న్యూఢిల్లీ: యోగాను వ్యతిరేకించడం సరికాదని ఉపరాష్ట్రపతి సతీమణి సల్మా అన్సారీ అన్నారు. యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదేనని అభిప్రాయపడ్డారు. యోగాతో ఎముకల సమస్య నుంచి తాను ఉపశమనం పొందానని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున 'ఓం' ఉచ్ఛరించడంతో తప్పేంలేదని పేర్కొన్నారు. మత సంబంధమైన పదాలు పలకడం లేదు కదా అని అన్నారు. అందరూ తప్పనిసరిగా యోగా చేయాలని ఆమె సూచించారు. యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగా చేసే వారంతా 'ఓం' ఉచ్ఛరించాలని ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేసింది. దీనిపై మైనారిటీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
‘ఓం’ ఉచ్చరించినా వివాదమే!
ప్రధాని మోదీ వ్యాఖ్య న్యూఢిల్లీ: దేశంలో ‘ఓం’ ఉచ్చారణతో వివాదాలు తలెత్తగలవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆలిండియా రేడియో రూపొందించిన తులసీదాస్ రామచరితమానస్ ఆడియో సీడీలను ఆయన సోమవారం ఢిల్లీలో ఆవిష్కరిస్తూ.. ఈ పురాణంపైనా వివాదం వస్తుందేమోనన్నారు. ‘మన దేశంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సైద్ధాంతిక ప్రాతిపదికపైనా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ‘ఓం’ అంటే.. ‘ఓం’ ఎలా అంటారని వారం రోజుల పాటు వివాదం రేగుతుంది’ అని అన్నారు. ‘ఇటువంటి దేశంలో రామచరితమానస్‌ను ఎవరూ ప్రశ్నించలేదు. అది ఇప్పుడూ నడుస్తోంది. ఈ రోజు తర్వాత దీనిపై ఎవరో ఒకరి దృష్టిపడి.. తుపాను సృష్టిస్తారేమో.. నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. భారత దేశ సారాంశాన్ని అద్భుతంగా తెలిపే ‘రామచరితమానస్’ గొప్ప ఇతిహాసమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో హిందూ మతానికి సంబంధించిన ‘ఓం’ ఉచ్చరించాల్సి వస్తుంది కాబట్టి తాము పాల్గొనలేమని ముస్లిం సంస్థలు పేర్కొనటం, దానిపై వివాదం తలెత్తటం తెలిసిందే. కాగా, రామచరితమానస్ ఆడియో సీడీలను తీసుకొచ్చిన ఆలిండియా రేడియో కృషి ని మెదీ కొనియాడారు. దీన్ని సంగీత సాధనతోకాకుండా సంస్కృతి, సంస్కార విలువలతో గొప్పగా తీసుకొచ్చారన్నారు. 20-22 ఏళ్లపాటు రికార్డింగ్ చేశారంటే దీని కోసం ఎంతగా శ్రమించారో అర్థమవుతుందని అన్నారు. ఆకాశవాణి రికార్డు చేసిన రామచరితమానస్‌ను 1980 నుంచి చాలా ఏళ్లపాటు భోపాల్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించారు. ‘మండలి’లో సంస్కరణలు తక్షణావసరం ఈ నెల 25న జరిగే ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యూఎన్జీఏ) 70వ సమావేశంలో.. పెండింగ్‌లో ఉన్న భద్రతామండలి సంస్కరణలు సహా పలు అపరిష్కృత అంశాలపై నిర్ణయాత్మక ఫలితాలు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూఎన్జీఏ 70వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన మెజెన్ లికెటాఫ్ట్తో మోదీ సోమవారం భేటీ అయ్యారు. భద్రతామండలిలో సంస్కరణలు తక్షణావసరమని మోజెన్తో చెప్పారు. -
అంధుల కోసం స్పెషల్ మెనూ!
‘బ్రెయిలీ లిపి’ అంధులకు లూయీ బ్రెయిలీ అందించిన అద్భుత సదుపాయం. దీన్ని ఆధారం చేసుకుని అనేక విషయాల్లో అంధులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ‘ఓమ్’ అనే రెస్టారెంట్ అంధుల కోసం ప్రత్యేకంగా మెనూ కార్డ్‌ను తయారుచేసింది. రుచిగా, శుచిగా ఆహారాన్ని అందిస్తుందనే పేరున్న ఈ వెజిటేరియన్ రెస్టారెంట్ మెనూకార్డ్ను బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేసి అందుబాటులో ఉంచింది. దీర్ఘ దృష్టి సమస్య ఉన్న వారి కోసం కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండే ఈ మెనూ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ వారు అంధులకు ఈ సౌకర్యం తీసుకురావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఓమ్ రెస్టారెంట్‌కు పక్కగా ఒక ఎన్జీవో ఆఫీస్ ఉంటుంది. విజువల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ కోసం పనిచేసే ఆ సంస్థ కార్యాలయానికి చాలామంది అంధులు వస్తుంటారు. పని మీద ఆ ఎన్జీవో ఆఫీస్‌కు వచ్చి, తినడానికి వచ్చే వారి కోసం రెస్టారెంట్ ఓనర్లు ఈ అవకాశాన్ని కల్పించారు. తమకు కావలసిన ఆహారం గురించి చదువుకొని.. ఆర్డర్ చేసేంత కాన్ఫిడెన్స్‌ను ఇస్తోంది రెస్టారెంట్. ఈ ఏడాది ఉగాది నుంచే ఈ మెనూ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తాము చేసిన పనికి ప్రచారం వస్తోందని, అనేక మంది రెస్టారెంట్ ఓనర్లు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఓమ్ రెస్టారెంట్ ఓనర్లు తెలిపారు. -
ఓం అంటున్న అందాలభామలు
-
కళ్యాణ్ రామ్ "ఓం"