
పటాస్, 118 వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు హీరో నందమూరి కల్యాణ్ రామ్. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడీ హీరో. ప్రస్తుతం అతడు నటించిన బింబిసార మూవీ ఆగస్టు 5న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ తనను బాగా దెబ్బ తీసిన సినిమా పేరును వెల్లడించాడు. 'అతనొక్కడే, పటాస్, 118 సినిమాలతో సక్సెస్ రుచి చూశాను. కానీ ఓం సినిమా ఫలితం చూసి బాగా ఫీలయ్యాను. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ మా లెక్కలు తప్పాయి. ఓం నన్ను ఆర్థికంగా దెబ్బ తీసింది. కానీ పటాస్ వచ్చి అది మొత్తం రికవరీ చేసింది. బింబిసార సినిమాను తమ్ముడు తారక్ చూశాడు. బాలకృష్ణ కర్నూలు షూటింగ్‌లో బిజీగా ఉన్నందువల్ల ఇంకా ఈ సినిమా చూడలేదు' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: సౌత్ హిట్స్‌తో బాలీవుడ్ బేజార్.. స్పందించిన బాలీవుడ్ నిర్మాత
గ్యారేజీలో అనిల్ కాపురం.. హీరోయిన్‌తో సునీల్ దత్ లవ్‌స్టోరీ..
Comments
Please login to add a commentAdd a comment